PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-thinking-about-support-on-jagan3aa71d33-3d4a-4e36-b34e-bde8fb0ad9c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-thinking-about-support-on-jagan3aa71d33-3d4a-4e36-b34e-bde8fb0ad9c8-415x250-IndiaHerald.jpgఇక తాజా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న కొద్ది రోజుల క్రిత‌మే వైసీపీని వీడారు. ఈ రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్ష‌డు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్‌ మాట్లాడుతూ కేసీఆర్ ను తెలంగాణలో రాజకీయంగా కనుమరుగు చేస్తామని.. కేసీఆర్‌కు ద‌మ్ముంటే హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓటమి భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొడ్తున్నారు అని బండి విమ‌ర్శించారు. jagan bjp{#}srikanth;Huzurabad;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCR;Party;Telangana;YCPజ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!జ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!jagan bjp{#}srikanth;Huzurabad;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCR;Party;Telangana;YCPThu, 01 Jul 2021 15:21:00 GMT2014 ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన వెంట‌నే వైసీపీ ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేసింది. అయితే జ‌గ‌న్ తెలంగాణ పార్టీ శాఖ బాధ్య‌త‌ల‌ను గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డికి అప్ప‌గించారు. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో హుజూర్ న‌గ‌ర్ నుంచి పోటీ చేసి 35 వేల ఓట్లు తెచ్చుకోవ‌డంతో పాటు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌, శంక‌ర‌మ్మ‌, గ‌ట్టు మ‌ధ్య గ‌ట్టి పోటీయే జ‌రిగింది. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ పోటీ చేయ‌క‌పోవ‌డంతో నిరాశ ప‌డ్డ శ్రీకాంత్ రెడ్డి జ‌గ‌న్‌పై న‌మ్మకం పెట్టుకుంటూనే ఉన్నారు.

ఇక తాజా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న కొద్ది రోజుల క్రిత‌మే వైసీపీని వీడారు. ఈ రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్ష‌డు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్‌ మాట్లాడుతూ కేసీఆర్ ను తెలంగాణలో రాజకీయంగా కనుమరుగు చేస్తామని.. కేసీఆర్‌కు ద‌మ్ముంటే హుజురాబాద్ లో టీఆర్ఎస్  అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓటమి భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొడ్తున్నారు అని బండి విమ‌ర్శించారు.

హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకటం లేద‌ని... ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు అవుతుంద‌ని బండి జోస్యం చెప్పారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం పెట్టే ఇబ్బందుల‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉంద‌ని.. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను సైతం టీఆర్ ఎస్ కొంటోంద‌ని బండి విమ‌ర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ని రాజకీయంగా సమాధి చేస్తామ‌ని బండి చెప్పారు. ఏదేమైనా గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవ‌డంతో తెలంగాణ లో వైసీపీ గురించి జ‌గ‌న్ పూర్తిగా మ‌ర్చిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇక ఇక్క‌డ జ‌గ‌న్‌కు ఆశ‌ల్లేవ‌నే చెప్పాలి.

 



ఇంటి ప‌న్ను ఎగ్గొట్టిన జ‌గ‌న్‌?

చంద్ర‌బాబు అక్క‌డ త‌ప్ప ఎక్క‌డా క‌నిపించ‌డు..?

తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌ల్లేవ్ - మంత్రి హ‌రీష్‌రావు

కోవిడ్ మ‌ర‌ణాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం త‌ప్పుడు లెక్క‌లు..?

సాగ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం...?

బీజేపీలో చేరిన తెలంగాణ వైసీపీ మాజీ అధ్యక్షుడు గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి

గుడికి డ‌బ్బులు ఇవ్వ‌ను : కేటీఆర్

ప్లీజ్ : మా ప‌ద‌వులు కొన‌సాగించండి...?

రేవంత్ టీంలో మరో ఫైర్ బ్రాండ్‌.. కారు పార్టీకి దబిడి దిబిడే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>