PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bipffa36c77-0326-499a-a1e2-596e8052014c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bipffa36c77-0326-499a-a1e2-596e8052014c-415x250-IndiaHerald.jpgజగన్ బీజేపీల మధ్య మంచి దోస్తీ ఉందని అంతా అభిప్రాయపడతారు. జగన్ నేరుగా కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఏమీ అనడంలేదు. పైగా ఆయన ఢిల్లీకి వెళ్ళినపుడల్లా కేంద్ర మంత్రులను కలుస్తూ వారితోనే గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన ఉన్న రిలేషన్ తప్ప మరోటి కాదు అని ఈ రెండు పార్టీలు అంటున్నా అంతకు మించి ఉందని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. bip{#}Bharatiya Janata Partyజగన్ చేతులు కట్టేసిన బీజేపీ... ?జగన్ చేతులు కట్టేసిన బీజేపీ... ?bip{#}Bharatiya Janata PartyThu, 01 Jul 2021 21:00:00 GMTజగన్ బీజేపీల మధ్య మంచి దోస్తీ ఉందని అంతా అభిప్రాయపడతారు. జగన్ నేరుగా కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఏమీ అనడంలేదు. పైగా ఆయన ఢిల్లీకి వెళ్ళినపుడల్లా కేంద్ర మంత్రులను కలుస్తూ వారితోనే గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన ఉన్న రిలేషన్ తప్ప మరోటి కాదు అని ఈ రెండు పార్టీలు అంటున్నా అంతకు మించి ఉందని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే జగన్ కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా వైసీపీ ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇంతలా కేంద్రానికి సహకరిస్తున్న ఏపీకి కేంద్ర సాయం ఏంటి అంటే అది అర్ధం కాని ప్రశ్నగానే ఉంది. ఏపీకి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వడంలేదు. అంతే కాదు ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు అంతకంటే లేవు, పోలవరానికి సవరించిన మొత్తాన్ని ఆమోదించమని కోరితే ఆ ఊసూ తలవరు.

ఇక అప్పులు చేసుకుంటాం రుణ పరిమితి పెంచండని అంటే దానికి కూడా కొర్రీలు వేస్తున్నారు. ఈ మధ్యనే జగన్ ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలసి వచ్చారు. కానీ కేంద్రం మాత్రం జగన్ కి షాక్ ఇచ్చేలా కీలక  నిర్ణయం తీసుకుంది. ఏపీకి రుణ పరిమితిని 42 వేల పై చిలుకుగా ఉన్న దాన్ని ఒక్కసారిగా 27 వేల కోట్లకు తగ్గించేసింది. అంటే మూడవ వంతు కోత కోసిందన్న మాట. ఇంతకు మించి రుణ పరిమితి లేదు అంటూ కట్టడి చేసింది.


కేంద్రం ఇలా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయట. మొదటిది తీసుకుంటే ఏపీలో జగన్ పంచుడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు. దాంతో ఏపీలో అప్పులు నాలుగు లక్షల కోట్లకు  చేరువలో ఉన్నాయని అంటున్నారు. మరీ శృతి మించితే ఏపీ ఖజానా  డేంజర్ లో పడుతుంది అని కేంద్రం కత్తెర వేసింది అంటున్నారు. రెండవ విషయం ఏంటి అంటే విద్యుత్, వ్యవసాయ సంస్కరణలు ఏపీలో అమలు చేస్తే అయిదు వేల కోట్ల దాకా రుణపరిమితిని పెంచుతామని అంటున్నారు. కానీ విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ఒక్కసారిగా కరెంట్ బిల్లులు పెరిగి షాక్ కొడుతుంది. జనాలు కంప్లీట్ రివర్స్ అవుతారు. అందుకే జగన్ సర్కార్ ఆ పని చేయ‌లేకపోతోంది. వీటిని మించి మరో కారణం ఉందిట . అదేంటి అంటే ఏపీలో పంచుడు కార్యక్రమాలకు బ్రేకులు వేస్తే జగన్ రాజకీయంగా డౌన్ అవుతారు అన్నది. మొత్తానికి అన్నీ కలిపేస్తూ జగన్ చేతులను బీజేపీ కట్టేసింది అంటున్నారు.
   





ప‌వ‌న్ మౌనం వెనుక‌.. బీజేపీ ఒత్తిడి.. విష‌యం ఏంటంటే..!

జ‌గ‌న్ రైట్ హ్యాంట్ ఎంత ప‌నిచేశాడు.. వైసీపీని ఖాళీ చేసి బీజేపీకి చ‌క్కేశాడు..!

ఈ నేతలంతా ఆ పార్టీలోనే చేరనున్నారా..!

గోర‌క్ష‌కుల కోసం రంగంలోకి దిగిన బీజేపీ ఎమ్మెల్యే

ఆ ఎన్నికల ముందో బ్లాస్ట్..ఈ ఎన్నికల ముందో బ్లాస్ట్.. ఏంటిది చెప్మా?

అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమేనా..?

జనసేనాని అజ్ఞాతవాసం వీడే టైమ్ దగ్గరపడిందా..?

ఆ విషయంలో మోదీకంటే యోగి అదృష్టవంతుడు..

కేసీఆర్‌లో కొత్త మార్పు.. కారణం ఆయన ఒక్కడేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>