MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala20757332-8221-4c58-aa89-bd7f8153ac0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala20757332-8221-4c58-aa89-bd7f8153ac0a-415x250-IndiaHerald.jpgనందమూరి బాలక్రిష్ణ అంటేనే పవర్ బ్యాంక్ అని చెబుతారు. ఎమోషన్స్ కి ఆయన పెట్టింది పేరు. ఆయన సినిమాలో ఆవేశం ఉంటే అది సూపర్ డూపర్ హిట్. ఇక బాలయ్యకు సరైన పాత్రలు పడితే ఆ సినిమా రేంజి కూడా ఎవరూ ఊహించనంతగా ఉంటుంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. bala{#}Balakrishnaఆ చేంజి చేసి ఉంటే బాలయ్య మూవీ బ్లాక్ బస్టరే... ?ఆ చేంజి చేసి ఉంటే బాలయ్య మూవీ బ్లాక్ బస్టరే... ?bala{#}BalakrishnaThu, 01 Jul 2021 19:02:26 GMTనందమూరి బాలక్రిష్ణ అంటేనే పవర్ బ్యాంక్ అని చెబుతారు. ఎమోషన్స్ కి ఆయన పెట్టింది పేరు. ఆయన సినిమాలో ఆవేశం ఉంటే అది సూపర్ డూపర్ హిట్. ఇక బాలయ్యకు సరైన పాత్రలు పడితే ఆ సినిమా రేంజి కూడా ఎవరూ ఊహించనంతగా ఉంటుంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది.

ఇదిలా ఉంటే బాలయ్య ఫ్రాక్షన్ కధలతో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మూవీస్ తరువాత ఇండస్ట్రీ మొత్తం ఆ వైపుగా చూసింది. మిగిలిన హీరోలు కూడా అవే కధాంశాలు ఎంచుకున్నారు. ఈ టైమ్ లో బాలయ్య వద్దకు మంచి పవర్ ఫుల్ కధతో డైరెక్టర్ వినాయక్ వచ్చారు. ఆయన అప్పటికే ఆది మూవీని జూనియర్ ఎన్టీయార్ తో తీసి సూపర్ హిట్ కొట్టారు.

రెండవ సినిమాయే బాలయ్యది కావడంతో ఫ్రాక్షన్ కధతోనే వినాయక్ రెడీ అయ్యారు. ఆ మూవీ కధ నచ్చి బాలయ్య ఓకే చెప్పేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా తీసిన ఈ మూవీలో రెండు పాత్రలలో బాలయ్య కనిపిస్తారు. తండ్రి ఫ్రాక్షనిస్ట్ అయితే కొడుకు పోలీస్ అధికారి. ఇక ఈ మూవీ షూటింగ్ కి ముందే రిలీజ్ డేట్ అనుకున్నారు. దాంతో చాలా స్పీడ్ గానే షూటింగ్ చేశారు. ఇక ఈ మూవీ లో తండ్రి పాత్ర అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. దానికి సమానంగా కొడుకు పాత్రను కూడా డిజైన్ చేశారు కానీ అనుకున్నట్లుగా కొన్ని సీన్లు తీయడానికి టైమ్ లేకపోయింది. దాంతో రిలీజ్ చేసేశారు. సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినా అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఈ సినిమాలో కొడుకు పాత్రను కూడా పెంచి రిలీజ్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అని అంటారు. మొత్తానికి బాలయ్య కెరీర్ లో టాప్ రేంజి సినిమాలలో చెన్నకేశవరెడ్డి కూడా ఒకటి అని చెప్పుకోవాల్సిందే.





ఫ్లాప్ లు వస్తున్నా బాలయ్య తీరు మారదేంటి?

బాలకృష్ణ ,విజయశాంతి ల మధ్య ఉన్న సంబంధం అదేనా..?

ఇంద్రజ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి కారణం అదేనా..??

బాలయ్య ద్విపాత్రాభినయం.. ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్టు.. ?

NTR,NBK లపై తన మనసులో మాట తెలిపిన సదా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>