BusinessGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tag9ca5ffd4-2fea-4f60-a264-7afe5eb2c3f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tag9ca5ffd4-2fea-4f60-a264-7afe5eb2c3f5-415x250-IndiaHerald.jpg భార‌తీయులు క్రమంగా ఆటో ట్రాన్స్‌మిషన్‌ వైపు మొగ్గుతున్నారు. 2019లో దేశంలో అమ్ముడైన కార్లలో 17.3 శాతం ఆటో ట్రాన్స్‌మిషన్‌వే ఉన్నాయి. గేర్లు మార్చే పని తప్పడంతో కేవలం రోడ్డుపై దృష్టి పెట్టవచ్చని అంద‌రూ ఈ త‌ర‌హా కార్ల‌వైపు మొగ్గుచూపుతున్నారు.ఆటోమేటిక్‌ గేర్‌ షిఫ్టింగ్‌ టెక్నాలజీ నాణ్యంగా ఉండ‌టంతోపాటు రోజురోజుకూ దాని సాంకేతిక‌త మ‌రింత పెరుగుతోంది. గతంలో ఖరీదైన కార్లు మాత్ర‌మే ఆటోమేటిక్‌ గేర్లను ఇస్తుండేవి. ధ‌ర‌లు త‌గ్గ‌డంతో చిన్న‌కార్లు కూడా ఆటోమేటిక్ గేర్లున్న‌వే ఇవ్వ‌డంతోపాటు డీజిల్‌ ఇంజిన్‌ కార్tag{#}TECHNOLOGY;Tesla;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;vegetable market;Carఆటోమేటిక్ గేర్ల‌వైపు మొగ్గుచూపుతోన్న భార‌త్‌?ఆటోమేటిక్ గేర్ల‌వైపు మొగ్గుచూపుతోన్న భార‌త్‌?tag{#}TECHNOLOGY;Tesla;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;vegetable market;CarThu, 01 Jul 2021 17:31:11 GMT
భార‌తీయులు క్రమంగా ఆటో ట్రాన్స్‌మిషన్‌ వైపు మొగ్గుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మాన్యువ‌ల్‌గా గేర్లు మార్చే కార్ల‌కు అల‌వాటుప‌డిన‌వారు నెమ్మ‌దిగా ఆటోమేటిక్ గేర్లు క‌లిగిన కార్ల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్రారంభ మోడ‌ల్‌లో చిన్న కార్లు కూడా ఆటోమేటిక్ గేర్లు ఇస్తుండ‌టంతో రాబోయే రోజుల్లో దాదాపు ఎక్కువ మోడ‌ళ్లు ఈ సిస్ట‌మ్‌వైపే మారే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. 2019లో దేశంలో అమ్ముడైన కార్లలో 17.3 శాతం ఆటో ట్రాన్స్‌మిషన్‌వే ఉన్నాయి. గేర్లు మార్చే పని తప్పడంతో కేవలం రోడ్డుపై దృష్టి పెట్టవచ్చని అంద‌రూ ఈ త‌ర‌హా కార్ల‌వైపు మొగ్గుచూపుతున్నారు.ఆటోమేటిక్‌ గేర్‌ షిఫ్టింగ్‌ టెక్నాలజీ నాణ్యంగా ఉండ‌టంతోపాటు రోజురోజుకూ దాని సాంకేతిక‌త మ‌రింత పెరుగుతోంది. గతంలో ఖరీదైన కార్లు మాత్ర‌మే ఆటోమేటిక్‌ గేర్లను ఇస్తుండేవి. ధ‌ర‌లు త‌గ్గ‌డంతో చిన్న‌కార్లు కూడా ఆటోమేటిక్ గేర్లున్న‌వే ఇవ్వ‌డంతోపాటు డీజిల్‌ ఇంజిన్‌ కార్లలో కూడా ఇస్తున్నాయి. ఒక‌ప్పుడు విలాస‌వంత‌మైన‌ది.. ఇప్పుడు సాధార‌ణ‌మైపోయింది.

ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ గేర్లుంటే..
చేతితో గేర్లు మార్చకుండా ప్రయాణించేలా ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతూ వ‌చ్చింది. కంప్యూటర్‌ చిప్‌లు ఆటోమేటిక్‌గా కారు వేగాన్ని బట్టి గేర్లను మారుస్తుంటాయి. పట్టణాల్లో బంపర్‌ టు బంపర్ డ్రైవ్ చేసే స‌మ‌యంలో ఇది మంచి ప్ర‌యోజ‌న‌కారి. ఆటో ట్రాన్స్‌మిషన్‌లో అనేక‌ర‌కాల సాంకేతిక‌లు అందుబాటులో ఉన్నాయి. అన్ని కంపెనీలు ఒకేర‌క‌మైన సాంకేతిక‌త‌ను ఉప‌యోగించ‌వు. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లో మాయ‌మ‌వుతోంది. విక్ర‌యించే మోడ‌ళ్ల‌లో మాన్యువ‌ల్ కార్ల శాతం వంద‌కు ప‌ద‌మూడుగా ఉంది. 2011లో అయితే మూడోవంతుకు పైగా మోడ‌ళ్ల‌లో మాన్యువ‌ల్ ప‌ద్ధ‌తి అందుబాటులో ఉండేది.

విద్యుత్తు కార్లు అందుబాటులోకి వస్తే..
భవిష్యత్తులో విద్యుత్తు కార్లు వస్తే వాటికి ఇంజిన్లు ఉండవు కాబ‌ట్టి  గేర్లు అవ‌స‌రంలేదు. టెస్లా కంపెనీ త‌యారుచేసే కార్లు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు భార‌త్లో వీటికి మార్కెట్ లేన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తులో పుంజుకునే అవ‌కాశం ఉంది. 2030 చివ‌రినాటికి భార‌త‌దేశంలో ఎక్కువ‌గా విద్యుత్తుకార్లే విక్ర‌య‌మ‌య్యే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. మారుతీ సుజుకీ కార్ల మోడళ్లలో  30 శాతం  ఆటోమేటిక్‌వే అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. టాటామోటార్స్‌ 14శాతం వరకు విక్ర‌యిస్తోంది.



భార‌తీయులు క్రమంగా ఆటో ట్రాన్స్‌మిషన్‌ వైపు మొగ్గుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మాన్యువ‌ల్‌గా గేర్లు మార్చే కార్ల‌కు అల‌వాటుప‌డిన‌వారు నెమ్మ‌దిగా ఆటోమేటిక్ గేర్లు క‌లిగిన కార్ల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్రారంభ మోడ‌ల్‌లో చిన్న కార్లు కూడా ఆటోమేటిక్ గేర్లు ఇస్తుండ‌టంతో రాబోయే రోజుల్లో దాదాపు ఎక్కువ మోడ‌ళ్లు ఈ సిస్ట‌మ్‌వైపే మారే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. 2019లో దేశంలో అమ్ముడైన కార్లలో 17.3 శాతం ఆటో ట్రాన్స్‌మిషన్‌వే ఉన్నాయి. గేర్లు మార్చే పని తప్పడంతో కేవలం రోడ్డుపై దృష్టి పెట్టవచ్చని అంద‌రూ ఈ త‌ర‌హా కార్ల‌వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

ప్ర‌జ‌లంతా నిబంధ‌న‌లు పాటించాల‌ని, ప‌న్నులు క‌ట్టి ప్ర‌భుత్వానికి తోడ్ప‌డాల‌ని ప్ర‌భుత్వాధినేత‌లు చెబుతుంటారు.. ప్ర‌క‌ట‌నలిస్తుంటారు. అంటే వారంతా అవి స‌క్ర‌మంగా చేస్తుంటే ప్ర‌జ‌ల‌ను కూడా క‌ట్టాల‌ని చెప్ప‌వ‌చ్చు. వారే క‌ట్ట‌క‌పోతే ప్ర‌జ‌లు మాత్రం ఎందుకు క‌డ‌తారు. త‌మ‌వైపు ఎవ‌రూ వేలెత్తిచూపేలా చేయ‌కూడ‌దు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం ఈ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డంలేద‌ని అర్థ‌మ‌వుతోంది. అంద‌రూ ఆయ‌న‌వైపు వేలెత్తి చూపించుకునేలా చేస్తున్నారు.

ఇంటి ప‌న్ను ఎగ్గొట్టిన జ‌గ‌న్‌?

కొవిషీల్డ్ టీకా తీసుకున్న‌వారి విష‌యంలో ఏడు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు వివాదానికి తెర‌దించాయి. గ్రీస్‌, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్, ఆస్ట్రియా, జ‌ర్మ‌నీ, స్లొవేనియా దేశాలు సీర‌మ్ త‌యారు చేసిన కొవిషీల్డ్‌కు అంగీక‌రించాయి. స్విట్జ‌ర్లాండ్ కూడా కొవిషీల్డ్ టీకా వేయించుకున్న‌వారిని ప్ర‌యాణాల‌కు అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది. యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ మోడెర్నా, ఫైజ‌ర్‌, ఆస్ట్రాజెనెకా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు చెందిన జాన్సెన్ టీకాల‌కు మాత్రమే ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ నాలుగు ర‌కాల టీకాలు వేయించుకున్న‌వారే ఈయూకి వెళ్లే అవ‌కాశం ఉంది.

భార‌త్ దెబ్బ‌కు దిగివ‌చ్చిన ఈయూ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన కొవిడ్ టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ను యూరోపియన్ యూనియన్ గుర్తించకపోవడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈయూ వైఖరిపై మండిపడింది. ఈ రెండు టీకాలకు గుర్తింపు ఇవ్వకపోతే యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. వీటిని గుర్తించకపోవడంవల్ల యూరప్ వెళ్లే ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వవర్గాలంటున్నాయి.

ఏం తమాషాగా ఉందా? ఈయూకు భారత్ హెచ్చరిక?

బీస్ట్ తో కలవబోతున్న పూజ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>