- Puneet Rajkumar’s Movie Produced By Hombale Films Titled Dvitva (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Puneet Rajkumar’s Movie Produced By Hombale Films Titled Dvitva (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Puneet Rajkumar’s Movie Produced By Hombale Films Titled Dvitva (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Puneet Rajkumar’s Movie Produced By Hombale Films Titled Dvitva (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా హోంబలే ఫిలింస్ నిర్మిస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ద్విత్వ'
కె.జి.యఫ్ చాప్టర్ 1, కె.జి.యఫ్ చాప్టర్ 2, సలార్ .. వంట పాన్ ఇండియా రేంజ్ భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తాజాగా మరో భారీ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి 'ద్విత్వ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ద్విత్వ అంటే ఓ వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించటం. లూసియా, యూ టర్న్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమార్ దరకత్వం వహించనున్నఈ చిత్రానికి విజయ్ కిరగందూర్ నిర్మాత. ఐదు భాషల్లో వర్క్ చేసిన ప్రీతా జయరామన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఇది వరకు పవన్ కుమార్ చిత్రాలకు సంగీతం అందించిన పూర్ణ చంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కనున్న 'ద్విత్వ' సెప్టెంబర్ నుంచి చిత్రీకరణను జరుపుకోనుంది. హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సందర్భంగా..
నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ "మరోసారి పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఇది వరకు పునీత్‌తో చేసిన చిత్రానికి భిన్నమైన జోనర్‌లో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ చిత్రానికి 'ద్విత్వ' అనే టైటిల్‌ను ఖరారు చేశాం. లూసియా, యూ టర్న్ తరహాలో డైరెక్టర్ పవన్‌కుమార్ గొప్ప సైకలాజికల్ థ్రిల్లర్‌ను అందిస్తాడని భావిస్తున్నాం. ఇప్పటి వరకు పునీత్‌గారు చేసిన చిత్రాలకు డిఫరెంట్‌గా ఉండే క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి సినిమా సెట్స్‌పైకి వెళుతుంది" అన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ " హోంబలే ఫిలింస్ నాకు మరో ఇల్లులాంటి సంస్థ. ఈ సంస్థలో మరో కొత్త జర్నీని స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాత విజయ్‌కిరగందూర్ టీమ్‌తో కలిసి పనిచేయడం అంటే మన ఇంటిసభ్యులతో పనిచేసినట్లే. పవన్‌కుమార్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నన్ను నేను సరికొత్త అవతారంలో చూసుకోవాలని చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. సహకరిస్తోన్న అందరికీ థాంక్స్" అన్నారు.
దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ "'ద్విత్వ' సినిమా స్క్రిప్ట్‌పై చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఓ పాత్ర తనలోని మరో క్యారెక్టర్‌ను ఎలా కనుగొన్నాడనే కథను చెప్పాలనుకున్నాను. అదే ఈ సినిమా. ముందు కథ రాసుకుని, టైటిల్ ఏం పెట్టాలని ఆలోచించాను. చివరకు 'ద్విత్వ' అని నిర్ణయించుకున్నాను. నేనేదైతే టైటిల్ గురించి భావించానో దాంతో పునీత్ రాజ్‌కుమార్, విజయ్ కిరగందూర్ ఏకీభవించారు. నేను మా పోస్టర్ డిజైనర్ ఆదర్శ్‌ను కలిసి నా కాన్సెప్ట్ ఏంటో వివరించాను. తను సినిమాతో నేనేం చెప్పాలనకున్నాను..జోనర్ ఏంటి? అనే దాన్ని అర్థం చేసుకున్నారు. ఇదొక సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్. సెప్టెంబర్‌లో షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అన్నారు.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.