MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rakhil-bollywood-235c36c3-e706-4fdb-a09e-aaecf913c2e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rakhil-bollywood-235c36c3-e706-4fdb-a09e-aaecf913c2e5-415x250-IndiaHerald.jpgరకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు పూర్తిగా మకాం మార్చేలా ఉంది. ఉత్తరాదిన వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్ భామగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు ఛాన్స్ లు దూరమైనా.. అక్కడ మాత్రం నాలుగు సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారిపోయింది. ఈలెక్కన రకుల్‌ హైదరాబాద్‌ నుంచి ముంబయ్‌కు మకాం మార్చేస్తుందేమో అనే సందేహం కూడా వచ్చేస్తుంది.rakhil bollywood {#}Trisha Krishnan;ajay;rakul preet singh;Heroine;Telugu;bollywood;Cinemaఏదీ కాదనకుండా చూపిస్తుంది కాబట్టే అన్ని అవకాశాలు..!ఏదీ కాదనకుండా చూపిస్తుంది కాబట్టే అన్ని అవకాశాలు..!rakhil bollywood {#}Trisha Krishnan;ajay;rakul preet singh;Heroine;Telugu;bollywood;CinemaThu, 01 Jul 2021 09:30:00 GMTటాలీవుడ్ లో ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడినా.. పెద్దగా పట్టించుకోవడం లేదు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు ఈ భామను వరించడం లేదు.  క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్ లాంటి కొత్త హీరోతో ఛాన్స్‌ వచ్చినా సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఇలా ఉంటే.. బాలీవుడ్‌ మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఒకేసారి నాలుగు అవకాశాలు ఇచ్చింది.  

ఇక దక్షిణాది భామలు హన్సిక, త్రిష ఉత్తరాదిన ఒకటి, రెండు సినిమాలు చేశారు. కానీ రకుల్‌ మాత్రం అలా కాదు. అక్కడే పాతుకుపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఆరు సంవత్సరాల క్రితం 'యారియన్‌' అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. డెబ్యూ మూవీతోపాటు.. రెండో సినిమా 'అయ్యారే ' కూడా ఓటమి చవిచూసింది. ఇక అజయ్ దేవగణ్‌తో నటించిన ' దే దే ప్యార్‌ దే' హిట్‌ కావడంతో.. బాలీవుడ్‌కు బాగా దగ్గరయింది రకుల్‌.  అజయ్ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తున్న తొలి మూవీ 'మేడే'లో రకుల్‌ హీరోయిన్‌గా ఎంపిక అయింది. అజయ్‌దేవ్‌గణ్‌ మరో సినిమా 'థాంక్యూ గాడ్‌'లో కూడా రకులే హీరోయిన్‌ కావడం విశేషం.  

రకుల్‌కు ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ అవకాశాలు వచ్చినా రాకపోయినా.. పెద్దగా ఫీల్ కావాల్సిన పనిలేదు. వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్ బ్యూటీగా మారిపోయింది రకుల్. 'ఎటాక్' మూవీలో జాన్‌ అబ్రహాంతో కలిసి నటిస్తోంది. అజయ్‌దేవగణ్‌తో రెండు సినిమాలు చేస్తున్న రకుల్‌.. అక్షయ్‌కుమార్‌తో కూడా ఛాన్స్‌ కొట్టేసింది. 'బెల్‌ బాటమ్‌' తీసిన రంజిత్‌ తివారి అక్షయ్‌తో మరో మూవీ కమిట్‌ అయ్యాడు ఇందులో హీరోయిన్‌గా రకుల్‌ అవకాశం దక్కించుకుంది.

బాలీవుడ్‌లో రకుల్‌ కంటే అందగత్తెలు చాలా మందే ఉన్నారు. చాలా టాలెంట్ చూపించేవారూ ఉన్నారు. కానీ అక్కడి వారంతా రకుల్ వెంటే పడుతున్నారు. అజయ్‌దేవగణ్‌.. అక్షయ్‌కుమార్‌ వంటి సీనియర్స్‌  నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. బాలీవుడ్‌ భామలా సన్నగా.. నాజూగ్గా కనిపించడం ఒక ప్లస్‌ అయితే.. గ్లామర్ రోల్స్‌కు అడ్డుచెప్పకపోవడం మరో ప్లస్‌. ఇన్ని ప్లస్‌లు వుంటే.. వదలుకుంటారా? ఈలెక్కన రకుల్‌ హైదరాబాద్‌ నుంచి ముంబయ్‌కు మకాం మార్చేస్తుందేమో అనే సందేహం కూడా వచ్చేస్తుంది.



ర‌వితేజ‌కు సినిమా టైటిల్ ఎమ్మార్వో

ఇంద్రజ భర్త కూడా ఒక నటుడు అని తెలుసా ?

నయనతార- శింబు అందుకే విడిపోయారా ?

మరో మలయాళం రీమేక్ పై కన్నేసిన చిరు,వెంకీ..!!

ర‌ష్మిక రోజుకు ఎన్ని సిగ‌రెట్లు ఊదేస్తుంది...!

సెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !

స్టార్ హీరోలతో చేయాల్సిన సినిమాల పై క్లారిటీ ఇచ్చిన త్రినాథ రావు..

స్మరణ: విజయసాయి చావుకి కారణం ఏంటో తెలుసా..?

టీవీ: మేల్ యాంకర్స్ లో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>