PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgజగన్, కేసీఆర్ ఇద్దరు దొంగలు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు..తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల మంత్రులు ఒకరినొకరు తమిళనాడుకు ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికరంగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడతారేమో అని గట్టిగా మాట్లాడడం లేదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఇప్పుడు ఈ అంశం మీద విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. అసలు తkesineni nani{#}Kesineni Nani;Capital;Vijayawada;Aqua;Thief;Andhra Pradesh;Reddy;Jagan;KCR;Telangana;TDP;Hyderabad;Telugu;CMఇద్దరూ తోడు దొంగలే, జలవివాదం అనేదే పెద్ద డ్రామా!ఇద్దరూ తోడు దొంగలే, జలవివాదం అనేదే పెద్ద డ్రామా!kesineni nani{#}Kesineni Nani;Capital;Vijayawada;Aqua;Thief;Andhra Pradesh;Reddy;Jagan;KCR;Telangana;TDP;Hyderabad;Telugu;CMThu, 01 Jul 2021 11:50:00 GMTజగన్, కేసీఆర్ ఇద్దరు దొంగలు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు..తెలుగు  రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల మంత్రులు ఒకరినొకరు తమిళనాడుకు ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికరంగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడతారేమో అని గట్టిగా మాట్లాడడం లేదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఇప్పుడు ఈ అంశం మీద విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

అసలు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం అనేది పెద్ద డ్రామా అని పేర్కొన్న ఆయన ఎన్నికల ముందు ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య పరస్పర సహకారం అందరికీ తెలిసిందేనని అన్నారు.. తెలంగాణ ప్రజలు కెసిఆర్, ఏపీ ప్రజలకు జగన్ పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారని విమర్శించారు.. హైదరాబాద్ లో తన ఆస్తులు కాపాడుకునేందుకే నీటి వివాదం మీద కేసీఆర్ తో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, బొకేలు ఇచ్చుకుని, ఆలింగనాలు చేసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందేమో అని తాను భావించానని ఆయన అన్నారు. 

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇద్దరి నాటకాలని స్పష్టమైందని, హైదరాబాద్ లో చెల్లి షర్మిలను పెట్టి, ఇక్కడ జగన్ ఆడే డ్రామాలు గమనించలేనంత పిచ్చోళ్లు ప్రజలు కాదని కేశినేని  విమర్శించారు. ఇక 80 శాతం పూర్తయిన రాజధాని నిర్మాణాలు వదిలి కరకట్ట అభివృద్ధి చేస్తాననటాన్ని ఎలా చూడాలి ? అని కేశినేని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే రాజధాని అభివృద్ధిలో భాగంగా అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయం పై రఘురామ చేస్తున్న పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందన్న కేశినేని , కరోనాతో ప్రపంచమంతా ఆర్ధికంగా చితికిపోతే ప్రజలపై పన్నుల భారం మోపిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అని అన్నారు. 



చిన్నమ్మ ఆశ ఇంకా చావలేదా...మళ్ళీ మొదలెట్టినట్టే?

ఆ ఎన్నికల ముందో బ్లాస్ట్..ఈ ఎన్నికల ముందో బ్లాస్ట్.. ఏంటిది చెప్మా?

రష్యాలో డెల్టా వేరియంట్ తో ఇంత మంది మరణించారా..?

ఆ దర్శకులతో సమస్యలు నిజమేనా..?

ఆరడుగుల పొడవు, ఏడడుగుల బంధం వరకు వెళ్లనుందా..?

అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమేనా..?

మనీ: జగన్ ప్రభుత్వం నుండి ఒక్కో ఇంటికి రూ.లక్ష 80 వేలు..

తారక్, సమీర రెడ్డి.. అసలు సంగతి ఏంటి..?

జనసేనాని అజ్ఞాతవాసం వీడే టైమ్ దగ్గరపడిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>