MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-movies-3d57b784-d165-482a-b293-7a26204dd0f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-movies-3d57b784-d165-482a-b293-7a26204dd0f5-415x250-IndiaHerald.jpgసినిమా అన్నది సామాన్యుడి వినోదం. ఒకపుడు నాటకాలు వినోదానికి ఉండేవి. వాటిని దాటుకుని వచ్చిన సాధనం సినిమా. మొదట మూకీతో మొదలై తరువాత టాకీగా వచ్చింది. అనంతరం ఎన్నో రంగులు అద్దుకుని ఈ రోజుకి ఈ స్థాయికి సినిమా చేరింది. big movies {#}Cinemaపెద్ద సినిమాలు టెంప్ట్ అయితే మూసుకోవాల్సిందే... ?పెద్ద సినిమాలు టెంప్ట్ అయితే మూసుకోవాల్సిందే... ?big movies {#}CinemaThu, 01 Jul 2021 20:00:00 GMTసినిమా అన్నది సామాన్యుడి వినోదం. ఒకపుడు నాటకాలు వినోదానికి ఉండేవి. వాటిని దాటుకుని వచ్చిన సాధనం సినిమా. మొదట మూకీతో మొదలై తరువాత టాకీగా వచ్చింది. అనంతరం ఎన్నో రంగులు అద్దుకుని ఈ రోజుకి ఈ స్థాయికి సినిమా చేరింది.

అయితే ఈ సుదీర్ఘ కాల గమనంలో సినిమా సామాన్యుడి వినోదంగా కంటే భారంగా మారుతోంది. ఓ వైపు ధియేటర్లలో టికెట్లు రేట్లు పెంచేశారు. ఐమాక్సులు వచ్చాయి. ఒక సినిమా చూసి రావాలి అంటే ఫ్యామిలీకి వేయి రూపాయలు పైనే అవుతోంది. అది  సినిమాకు ఆడియన్స్ తగ్గిపోవడానికి ఒక కారణం అయితే టీవీ సీరియల్స్ మరో కారణం. దీని వల్ల లేడీస్ సినిమాలు చూడడం మానుకున్నారు.

ఇక టెక్నాలజీ పెరిగి మార్నింగ్ షోకి సినిమా వస్తే చాలు  ఆ వెంటనే దాన్ని డౌన్ లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. పైరసీతో సినిమా అలా  నడ్డి విరిగిపోయింది. ఇవన్నీ చాలవు అన్నట్లుగా కరోనా రెండవ దశ వచ్చి సినిమాను పూర్తిగా కుదేలు చేసింది. ఇక థియేటర్లకు పడిన దెబ్బ అంతా ఇంతా కాదు. సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫారం ఉంది. కానీ ధియేటర్లకు ఏముంది. ఇంతకాలం సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయితేనే మెజారిటీ  జనాలు అయినా   చూసేవారు.

కానీ ఓటీటీ రాకతో థియేటర్లకు కాలం చెల్లేలా సీన్ ఉంది. ఒక వైపు థియేటర్లలో సినిమా వేసినా జనాలు కరోనా భయంతో వస్తారో రారో తెలియదు, ఈ నేపధ్యంలో  కొందరు పెద్ద హీరోల సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోతున్నాయన్న ప్రచారంతో ఎగ్జిబిటర్లు షాక్ తింటున్నారు. పెద్ద సినిమాలే థియేటర్లలోకి రాకుండా ఓటీటీ బాట పడితే ఇక సినిమా హాళ్ళు మూసుకోవాల్సిందే అన్న భయంతో ఎగ్జిబిటర్లు ఉన్నారు. మరి పెద్ద హీరోల సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇస్తూ ఓటీటీ నిర్వాహకులు ఆకట్టుకుంటున్నారు. దీంతో థియేటర్ల మనుగడ ఇపుడు సందేహంలో పడింది. మరి ఈ ముప్పు నుంచి తప్పుకుంటే సినిమా హాలు అన్నది చరిత్రలో నిలుస్తుంది అంటున్నారు.





రజినీకాంత్ ఫాన్స్ కు బంపర్ న్యూస్!

ప్రేమ విఫలం కావడం వల్లే ఈ ఇద్దరు ఒంటరిగా మిగిలిపోయారా.. ?

దేవిశ్రీప్రసాద్ ని హీరోగా పెట్టి ఆ హీరోయిన్ సినిమా తీస్తుందా.. ?

శివగామి పాత్రకి శ్రీదేవి ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

'రాధే శ్యామ్' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!!

'మగధీర' కి సీక్వెల్ రానుందా..?

ఇంత సడన్ గా టాలీవుడ్ పై అరవ హీరోలకు ఎందుకు అంత మోజు

పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

కియారా అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందట..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>