PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/diesel-blow-to-rtc-telugu-states0164ff15-7e6a-43ba-a09c-f0b7f5b8ba34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/diesel-blow-to-rtc-telugu-states0164ff15-7e6a-43ba-a09c-f0b7f5b8ba34-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఆర్టీసీపై ఆ ప్రభావం బాగా పడనుంది. ఇప్పటికే కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీ.. తాజాగా డీజిల్ పెరుగుదలతో మరింత కుంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యవసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజల జేబుల్లో దగ్గర డబ్బులు బాగా ఉన్నట్లు... చమురు సంస్థలు బాదేస్తున్నాయి. diesel rtc{#}Petrol;RTC;June;Application;Diesel;central government;oil;Andhra Pradesh;Telugu;Coronavirus;Telanganaఆర్టీసీకి డీజిల్ దెబ్బ..!ఆర్టీసీకి డీజిల్ దెబ్బ..!diesel rtc{#}Petrol;RTC;June;Application;Diesel;central government;oil;Andhra Pradesh;Telugu;Coronavirus;TelanganaThu, 01 Jul 2021 13:00:00 GMTరోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని రోడ్డ రవాణా సంస్థలపై భారాన్ని మోపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీసుకుంటే గతేడాది జూన్ తో పోలిస్తే.. ప్రస్తుత ఏడాది సంస్థపై 594కోట్ల రూపాయల అదనపు భారం పడింది. 2020లో డీజిల్ ధర 70రూపాయలు ఉండగా.. ఈ ఏడాది ఈ ధర 92రూపాయలుగా ఉంది. అంటే లీటరుకు గతేడాదితో పోలిస్తే 22రూపాయలు అధికం. ఆర్టీసీకి పెట్రోల్ సరఫరా చేసే ఆయిల్ సంస్థలు 15రోజులకొకసారి దరఖాస్తు చేస్తాయి.  

ఇప్పటికే కరోనా దెబ్బకు ఆర్టీసీ విలవిలలాడింది. కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. కరోనా భయంతో ప్రజలు అప్పటిలా బయటకు రావడం లేదు. కరోనా థర్డ్ వవ్ దెబ్బకు వణికిపోతున్నారు.  

ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. అత్యవసరమైతే తప్ప ప్రయాణీకులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. దాదాపు సొంత వాహనాల్లోనే వెళుతున్నారు. దీంతో కనీసం డీజీల్‌కు కూడ డబ్బులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఇటీవల  ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులను తగ్గించారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆర్టీసీ సేవలు ప్రారంభించారు. డీజిల్ ధరలు భయపెడుతుండటంతో.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల ఛార్జీలపై భారం పడే అవకాశముంది. పట్టణంలో కాస్తో కూస్తో ఆదాయం ఉన్నా..గ్రామీణ ప్రాంతాల్లో అయితే సగానికి పైగా ఆదాయం పడిపోయింది.  నిత్యవసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజల జేబుల్లో దగ్గర డబ్బులు బాగా ఉన్నట్లు... చమురు సంస్థలు బాదేస్తున్నాయి.

మరోవైపు పెట్రోల్ ధరలు సెంచరీని దాటి పయనిస్తున్నాయి. సామాన్యుడు జేబులు తడుముకునే పరిస్థితి ఎదురవుతోంది. చమురు సంస్థల తీరుతో కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. చూద్దాం ఈ పెరుగుదల కేంద్రంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.



 



బిగ్ బ్రేకింగ్‌: ఈట‌ల‌తో ట‌చ్‌లోకి ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ?

రష్మిక మందన సిగరెట్ కహనీ..!

ఉద్యోగుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన టీటీడీ...కార‌ణం ఇదే...?

కత్తి మహేష్ పై పోస్టులు..వారికి ఐపీఎస్ స్ట్రాంగ్ కౌంటర్.. !

ఈ ముదురు భామ కి ఇప్పుడు క్రేజీ ఛాన్స్ లు వస్తున్నాయేంటి?

ఆరోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ కుమారి ల మధ్య అంత నడిచిందా..!!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసికి మరో దెబ్బ, పెరిగిన డీజిల్ ధరలు

టీడీపీ బతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే...బాబు మోహన్ సంచ‌ల‌నం... !

మా పిల్ల‌లు ఇంకా గొర్రెలు,బ‌ర్రెలు కాచుకోవాల్సిందేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>