PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye867aa73-f37c-48a2-b417-79533b9a797b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye867aa73-f37c-48a2-b417-79533b9a797b-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే రేవంత్ త‌న టీంలో మ‌హిళల‌ను కూడా సెట్ చేసుకుంటున్నారు. మ‌హిళా నాయ‌కుల్లో బ‌ల‌మైన వాయిస్ ఉన్న వారిని ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇక ములుగు ఎమ్మెల్యే సీత‌క్క ఎలాగూ ముందు నుంచి రేవంత్ స‌పోర్ట‌ర్‌. ఆమె రేవంత్ సూచ‌న మేర‌కే టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉండి కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఆమె టీర్ ఎస్ ప్ర‌భంజ‌నంలో కూడా ములుగు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డంతో పాటు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో మ‌హిళా ఫైర్ బ్రాండ్ నేత‌ను రేవంత్ టీంలో Revanth Reddy{#}surekha vani;Mulugu;revanth;District;Backward Classes;Congress;TDP;Telangana;Ministerరేవంత్ టీంలో మరో ఫైర్ బ్రాండ్‌.. కారు పార్టీకి దబిడి దిబిడే...!రేవంత్ టీంలో మరో ఫైర్ బ్రాండ్‌.. కారు పార్టీకి దబిడి దిబిడే...!Revanth Reddy{#}surekha vani;Mulugu;revanth;District;Backward Classes;Congress;TDP;Telangana;MinisterThu, 01 Jul 2021 15:03:47 GMTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి ముఖ్య నాయకులందరినీ క‌లుస్తోన్న రేవంత్ వారంద‌రిని ఏకం చేసే పనిలో ఉన్నారు. పార్టీలో ఓ వైపు ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా సైలెంట్ గా ఉంటున్న వాళ్ల నుంచి.. తనను తిడుతోన్న వారంద‌రి విష‌యంలో రేవంత్ చిన్న మాట కూడా మాట్లాడ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే త‌న‌కంటూ స‌ప‌రేట్ టీంను కూడా రేవంత్ రెడీ చేసుకుంటున్నాడు. పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు రేవంత్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ త‌న‌తో క‌లిసి వ‌చ్చే.. త‌న‌ను అభిమానించే వారితో ఓ టీం అయితే రెడీ చేసుకుంటోన్న ప‌రిస్థితి.

ఈ క్ర‌మంలోనే రేవంత్ త‌న టీంలో మ‌హిళల‌ను కూడా సెట్ చేసుకుంటున్నారు. మ‌హిళా నాయ‌కుల్లో బ‌ల‌మైన వాయిస్ ఉన్న వారిని ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇక ములుగు ఎమ్మెల్యే సీత‌క్క ఎలాగూ ముందు నుంచి రేవంత్ స‌పోర్ట‌ర్‌. ఆమె రేవంత్ సూచ‌న మేర‌కే టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉండి కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఆమె టీర్ ఎస్ ప్ర‌భంజ‌నంలో కూడా ములుగు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డంతో పాటు మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో మ‌హిళా ఫైర్ బ్రాండ్ నేత‌ను రేవంత్ టీంలో చేర్చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ లో ఫైర్‌ బ్రాండ్‌ గా ముద్రపడిన మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ మీట్ అయ్యారు. ఆమె కూడా ముందు నుంచి రేవంత్‌కు స‌పోర్ట్ చేస్తూనే వ‌చ్చారు. అయితే రేవంత్ పాదయాత్ర చేసిన టైమ్ లో ఆమె అన్న మాటలు ఓ వర్గానికి కోపం తెప్పించాయి.

అయితే ఆ త‌ర్వాత కూడా ఆమె తాను రేవంత్‌కే స‌పోర్ట్ అని.. కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే అది రేవంత్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుందంటూ ఆమె కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇక ఇప్పుడు టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కం కావ‌డంతో బీసీ + మ‌హిళ‌గా ఉన్న కొండా సురేఖ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో కీల‌కం కానున్నారు.



ప్లీజ్ : మా ప‌ద‌వులు కొన‌సాగించండి...?

ప్ర‌భుత్వ ఆస్తులు త‌న‌ఖాపై హైకోర్టులో పిటిష‌న్‌

పాపం ష‌ర్మిల ఎర‌క్కుపోయి ఇరుక్కుపోయారే ?

నీటి వివాదం పెద్ద డ్ర‌మా - టీడీపీ ఎంపీ

విహెచ్ ఆరోగ్య ప‌రిస్థితిపై సోనియా ఆరా

బిగ్ బ్రేకింగ్‌: ఈట‌ల‌తో ట‌చ్‌లోకి ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ?

ఒక్క సీటు వైసీపీలో మూడు ముక్క‌లాట‌...!

ఈ నేతలంతా ఆ పార్టీలోనే చేరనున్నారా..!

ఆర్టీసీకి డీజిల్ దెబ్బ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>