PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telugu-states-water-issue483e1f62-59ff-4923-bc56-73df527522b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telugu-states-water-issue483e1f62-59ff-4923-bc56-73df527522b3-415x250-IndiaHerald.jpgమాములుగా ఒక ఇంటిలో ఒకరితో మరొకరికి మనస్పర్థలు, విబేధాలు రావడం సహజం. ఈ సందర్భంలో వాదులాటలు లాంటివి ఉంటాయి. అదే మన ఇంటిలో వారిపై పక్కింటివారు గొడవకు వస్తే మనమెలా స్పందిస్తాము. ఖచ్చితంగా ఇంటిలో మనకెన్ని గొడవలున్నా పక్కింటి వారితో వాదులాటకు వెళతాము. మన వారికి సపోర్ట్ గా నిలుస్తాము. TELUGU STATES WATER ISSUE{#}CBN;dr rajasekhar;Aqua;CM;Andhra Pradesh;Telangana;KCR;TDP;Jaganఆ విషయంలో బాబోరు నోరు మెదపరేం ?ఆ విషయంలో బాబోరు నోరు మెదపరేం ?TELUGU STATES WATER ISSUE{#}CBN;dr rajasekhar;Aqua;CM;Andhra Pradesh;Telangana;KCR;TDP;JaganThu, 01 Jul 2021 20:30:00 GMTమాములుగా ఒక ఇంటిలో ఒకరితో మరొకరికి మనస్పర్థలు, విబేధాలు రావడం సహజం. ఈ సందర్భంలో వాదులాటలు లాంటివి ఉంటాయి. అదే మన ఇంటిలో వారిపై పక్కింటివారు గొడవకు వస్తే మనమెలా స్పందిస్తాము. ఖచ్చితంగా ఇంటిలో మనకెన్ని గొడవలున్నా పక్కింటి వారితో వాదులాటకు వెళతాము. మన వారికి సపోర్ట్ గా నిలుస్తాము. కానీ ఇక్కడ ఏపీలో జరిగే పరిస్థితులు చూస్తుంటే ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిననాటి నుండి ఏదో ఒక విషయంలో తెలంగాణతో ఏపీకి విభేదాలు వస్తూనే ఉన్నాయి. కానీ జగన్ తెలివిగా ఏ అంశంలోనూ వివాదం కాకుండా సర్దుకుని కేసీఆర్ తో సాన్నిహిత్యంతో మెలుగుతూ వస్తున్నాడు. అయితే ఇరురాష్ట్రాలను సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంలో పొంతన కుదర్లేదు. దీనితో తెలంగాణ మంత్రులు ఏపీపై ప్రత్యక్ష విమర్శలకు దిగారు. సదరు మంత్రులు ఏ మాత్రం ఆలోచించకుండా దివంగత రాజకీయ నాయకుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ లపై తీవ్రమైన విమర్శలు చేస్తుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

జగన్ అక్రమంగా తెలంగాణ జలాలను దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా ఏపీ మంత్రులు సైతం వారిపై ప్రతి విమర్శలకు దిగారు. మాకు చెందాల్సిన జలాలనే మేము వాడుకుంటున్నామని ప్రతి సమాధానమిచ్చారు. ఈ విషయంపై కేంద్రం వరకు వెళ్లడంతో ఇరు రాష్ట్రాల పరువు పోయినట్టయింది. ఇది ఇలా ఉంటే ఏపీలో ఉన్న మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇటువంటి క్లిష్ట సమయంలో తెలంగాణ మంత్రులు ఏపీని తిడుతుంటే కనీసం ఖండించకపోవడం సగటు మానవుడిని తీవ్రంగా బాధిస్తుందని చెప్పాలి. సమయానికి తగినట్లుగా వ్యవహరించలేని నీ ఫార్టీ ఇయర్స్ రాజకీయ అనుభవం ఎందుకు పనికొస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణను విమర్శించడం మాట అటుంచితే, ఈ విషయంపై మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకు ముందు మనము చెప్పుకుంటున్నట్లుగా అవసరమయినప్పుడు రాష్ట్రానికి మద్దతుగా ఉండలేకపోవడం బాధాకరమని పలువురు విమర్శిస్తున్నారు. బాబోరు తో సహా మిగిలిన టీడీపీ నాయకులు ఎవ్వరూ ఈ సమస్యపై నోరెత్తకపోవడం కక్షపూరిత, స్వార్ధ పూరిత రాజకీయాలకు నిదర్శనం. ఈ ఒక్క విషయంలోనే కాదు జగన్ ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టినా లేదా జగన్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ దోచుకెళ్లిపోయినా చూస్తూ ఊరుకుంటాడే కానీ జగన్ కి సపోర్ట్ గా మాట్లాడడు చంద్రబాబు. ఇకనైనా ఈ వైఖరిని బాబోరితో సహా టీడీపీ అండ్ కో వదిలి కష్ట సమయంలో రాష్ట్రానికి అండగా నిలబడాలని కోరుకుందాము.





జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కీలకం... ?

త్వరలో మహిళల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్

అక్క‌డ టీడీపీ జోరుతో వైసీపీ బేజార‌వుతోందే ?

అఫీషియ‌ల్‌: 2023లో రేవంత్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్‌

డిస్క‌వ‌రీలో "మెఘా" మాయ‌?

వరల్డ్ నెంబర్-5కు చుక్కలు చూపించిన తెలుగోడు

క‌ర‌క‌ట్ట విస్త‌ర‌ణ దానికోస‌మేన‌ట‌...?

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు 8కి వాయిదా?

హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>