వైసీపీ వైపు రత్నప్రభ అడుగులు..!! బీజేపీకి దూరమైనట్లేనా..కారణం అదే : నియోజకవర్గం సైతం ఫిక్స్..!!

సీబీఐ అభియోగాలు..

సీబీఐ అభియోగాలు..

జగన్ అక్రమాస్తుల కేసుల సమయంలో క్విడ్ ప్రో కో కేసుల్లో రత్నప్రభ పైన సీబీఐ అభియోగాలు మోపింది. ఆ విచారణ సైతం ఎదుర్కొన్నారు. ఇక, కర్ణాటక లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పని చేస్తూ పదవీ విరమణ చేసారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. అనేక తర్జన భర్జనల తరువాత తిరుపతి నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. అయితే, స్థానికంగా బీజేపీ నేతల సహకారం పైన..జనసేన కేడర్ మద్దతు విషయంలో రత్నప్రభ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతారు. జనసేనాని పవన్ ఒక రోజ రత్నప్రభ కు మద్దతుగా ప్రచారం చేసారు. ఆ సమయంలో పవన్ అభ్యర్ధి రత్నప్రభను తన అక్కగా అభివర్ణించారు.

అక్కా..అంటూ పవన్

అక్కా..అంటూ పవన్

రెండో సారి ప్రచారానికి వెల్లే సమయానికి పవన్ కరోనా బారిన పడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రత్నప్రభ ఏపీ రాజకీయాల పైన ఎక్కడా స్పందించలేదు. అయితే, తాజాగా రత్నప్రభ ఏపీలో వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు రత్నప్రభతో చర్చలు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే, రత్నప్రభ ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి సిద్దంగా లేరని…పార్లమెంట్ కు పోటీ పైనే ఆసక్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా… రత్నప్రభ అనుకున్న విధంగా వైసీపీ లో చేరితో లోక్ సభ స్థానం ఇచ్చేందుకు వైసీపీ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

సీమ నుండి లోక్ సభకు పోటీ..

సీమ నుండి లోక్ సభకు పోటీ..

అయితే, ముందుగా పార్టీలో చేరిన తరువాతనే హామీలు ఇవ్వటం ఉంటుందని..ముందుగా షరతులతో పార్టీలో చేరటం సాధ్యం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, కొందరు ముఖ్య నేతలు చెబుతున్న సమాచారం మేరకు రత్నప్రభ వైసీపీ లో చేరితే వచ్చే ఎన్నికల్లో రాయలసీమ నుండి ఒక లోక్ సభ కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉన్నత విద్యా వేత్తగా.. మేధావి వర్గానికి చెందిన మహిళగా రత్నప్రభకు గుర్తింపు ఉంది. ఆమె పార్టీలో చేరిక పార్టీకి మేలు చేస్తుందనే అంచనాలు వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ వ్యవహారం పైన రత్నప్రభ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *