PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth5fc212e4-6226-4e2a-95a0-3898cc013a66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth5fc212e4-6226-4e2a-95a0-3898cc013a66-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి...ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈయనే హాట్ టాపిక్. మొన్నటివరకు ఈటల రాజేందర్ వ్యవహారం బాగా హాట్ టాపిక్ విషయం తెలిసిందే. అయితే సడన్‌గా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై కొందరు కాంగ్రెస్ సీనియర్లు అలకపాన్పు ఎక్కి ఉన్నారు.revanth{#}SoniaGandhi;Eatala Rajendar;TPCC;Delhi;MP;YCP;Telangana Rashtra Samithi TRS;revanth;Congress;Telangana;CBNరేవంత్ ఆ ముద్ర చెరుపుకోవడానికి కష్టపడుతున్నారా?రేవంత్ ఆ ముద్ర చెరుపుకోవడానికి కష్టపడుతున్నారా?revanth{#}SoniaGandhi;Eatala Rajendar;TPCC;Delhi;MP;YCP;Telangana Rashtra Samithi TRS;revanth;Congress;Telangana;CBNThu, 01 Jul 2021 02:00:00 GMTరేవంత్ రెడ్డి...ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈయనే హాట్ టాపిక్. మొన్నటివరకు ఈటల రాజేందర్ వ్యవహారం బాగా హాట్ టాపిక్ విషయం తెలిసిందే. అయితే సడన్‌గా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై కొందరు కాంగ్రెస్ సీనియర్లు అలకపాన్పు ఎక్కి ఉన్నారు.


దీంతో రేవంత్ మొదట అసంతృప్తి నాయకులని బుజ్జగించే పనిలో పడ్డారు. అలాగే టీఆర్ఎస్-బీజేపీలకు ధీటుగా కాంగ్రెస్‌ని నిలబెట్టే ప్రయత్నాలని రేవంత్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ, ఒక్క విషయంలో మాత్రం రేవంత్ ఇమేజ్‌కు దెబ్బపడుతుందని తెలుస్తోంది. అది ఏంటంటే రేవంత్‌, ఇప్పటికీ చంద్రబాబు మనిషి అని పరోక్షంగా విమర్శలు వస్తున్నాయి.


పైగా చంద్రబాబు, కాంగ్రెస్ అధిష్టానంతో చెప్పడం వల్లే రేవంత్‌కు పీసీసీ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. పీసీసీ దక్కని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే తరహాలో విమర్శలు చేశారు. టీపీసీసీ కాస్త టీటీడీపీగా అయిందని, డబ్బులిచ్చి పీసీసీ కొనుకున్నారని ఆరోపణలు చేశారు. అటు ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇలాగే మాట్లాడుతున్నారు. రేవంత్, బాబు మనిషి అని, ఢిల్లీ అధిష్టానాన్ని కొనేసి రేవంత్‌కు పీసీసీ ఇప్పించారని మాట్లాడుతున్నారు. ఇలా ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్ అయింది. పలువురు విశ్లేషకులు సైతం రేవంత్ వెనుక చంద్రబాబు ఉన్నారనే మాట్లాడుతున్నారు.


ఇలా రేవంత్‌కు బాబు మనిషి అని ముద్రపడటం వల్ల భవిష్యత్‌లో మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆంధ్రా-తెలంగాణ అని సెంటిమెంట్ లేపితే రేవంత్‌కు ఇబ్బంది అవుతుంది. అందుకే రేవంత్ ఇప్పటినుంచే బాబు ముద్ర నుంచి బయటపడటానికి సరికొత్త నినాదం ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. తాను సోనియా మనిషి అని, కాంగ్రెస్ బిడ్డని అని రేవంత్ చెబుతున్నారు. అలాగే తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో తెలియదని, తమకు మాత్రం రాష్ట్రం ఇచ్చిన సోనియానే తల్లి అని మాట్లాడుతున్నారు. అంటే  తాను బాబు మనిషిని కాదని సోనియా మనిషి అని రేవంత్ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 




అశోక్ విషయంలోనే ‘మహిళా’ కార్డు ఎందుకు?

ఆ రెండిటిలో టీడీపీకి మైనస్ ఉందా?

ఏపీకి కలకాలం సీఎంగా జగనే ఉండాలట.. కేసీఆర్ కోరిక ఇదేనట..?

రేవంత్ రెడ్డి...ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈయనే హాట్ టాపిక్. మొన్నటివరకు ఈటల రాజేందర్ వ్యవహారం బాగా హాట్ టాపిక్ విషయం తెలిసిందే. అయితే సడన్‌గా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై కొందరు కాంగ్రెస్ సీనియర్లు అలకపాన్పు ఎక్కి ఉన్నారు.

అదిరిపోయే కారు కొన్న 'పవర్ స్టార్'.. రేట్ ఎంతో తెలుసా..?

కళ్ళుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్.?

కేసీఆర్ రాజీనామా చేసి ఉపఎన్నిక‌లకు రావాలి..!

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కష్టాలు పడుతున్న సీరియల్ నటి

మళ్ళీ పేపర్లకే పెట్టుబడులు పరిమితవుతాయా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>