PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-anti-bodiesd2a06d53-ec95-4991-9923-2183b33fef99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-anti-bodiesd2a06d53-ec95-4991-9923-2183b33fef99-415x250-IndiaHerald.jpgఇక మూడో వేవ్ పిల్ల‌ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌ని కూడా ప‌లువురు హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే క‌రోనా రెండో వేవ్‌కు ప్ర‌ధాన కార‌ణం డెల్టా (బీ.1.617) వేరియంట్‌ మరికొన్ని మార్పుల‌తో కప్పా (బీ.1.617.1), లంబ్డా (బీ.1.617.3) , డెల్టా ప్లస్‌ (బీ.1.617.2 లేదా ఏవై.1) రకాలుగా మార్పు చెందింది. అయితే మిగిలిన వాటికి ఈ డెల్టా ప్ల‌స్ వేరియంట్‌కు చాలా తేడాలు ఉన్నాయి. ఇది శ‌ర‌వేగంగా ఊపిరితిత్తుల‌కు, అందులోని క‌ణాల‌కు అతుక్కు పోతుంద‌ని చెపుతున్నారు. ఇక వ్యాక్సిన్ వ‌ల్ల శ‌రీరంలో ఏర్ప‌డిన రోగ నిరోధ‌క శ‌క్తి నుంDelta Corona{#}Mass;central governmentక‌రోనా డేంజ‌ర్ వేరియంట్ల త‌ప్పించుకునేందుకు ఇదొక్క‌టే మార్గం..!క‌రోనా డేంజ‌ర్ వేరియంట్ల త‌ప్పించుకునేందుకు ఇదొక్క‌టే మార్గం..!Delta Corona{#}Mass;central governmentThu, 01 Jul 2021 10:03:00 GMTప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న రూపాంత‌రం మార్పు చెందుతోంది. వేవ్ వేవ్‌కు ప్రమాద‌క‌రంగా రూపాంత‌రం చెందుతోంది. తొలి వేవ్‌తో పోలిస్తే క‌రోనా రెండో వేవ్ దేశాన్నే కాకుండా.. ప్ర‌పంచాన్ని ఎంత‌లా అత‌లా కుత‌లం చేసిందో మ‌నం చూశాం. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి థ‌ర్డ్ వేవ్ పైనే ఉంది. మ‌రో మూడు నెల‌ల్లో థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని కొంద‌రు చెపుతుంటే.. ఎయిమ్స్ వైద్యులు ర‌ణ‌వ‌త్ అయితే 6- 8 వారాల మ‌ధ్య‌లోనే క‌రోనా మూడో వేవ్ వ‌చ్చేస్తుంద‌ని.. ఇది చాలా ప్ర‌మాద క‌రంగా మారుతుంద‌ని.. ఈ ప్ర‌మాదాన్ని ఎవ్వ‌రూ ఊహించ‌లేర‌ని ప‌లువురు నిపుణులు చెపుతున్నారు.

ఇక మూడో వేవ్ పిల్ల‌ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌ని కూడా ప‌లువురు హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే క‌రోనా రెండో వేవ్‌కు ప్ర‌ధాన కార‌ణం  డెల్టా (బీ.1.617) వేరియంట్‌ మరికొన్ని మార్పుల‌తో కప్పా (బీ.1.617.1), లంబ్డా (బీ.1.617.3) , డెల్టా ప్లస్‌ (బీ.1.617.2 లేదా ఏవై.1) రకాలుగా మార్పు చెందింది. అయితే మిగిలిన వాటికి ఈ డెల్టా ప్ల‌స్ వేరియంట్‌కు చాలా తేడాలు ఉన్నాయి. ఇది శ‌ర‌వేగంగా ఊపిరితిత్తుల‌కు, అందులోని క‌ణాల‌కు అతుక్కు పోతుంద‌ని చెపుతున్నారు. ఇక వ్యాక్సిన్ వ‌ల్ల శ‌రీరంలో ఏర్ప‌డిన రోగ నిరోధ‌క శ‌క్తి నుంచి కూడా ఇది త‌ప్పించుకుంటుంద‌ని చెపుతున్నారు.

అయితే ఇక పై మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఈ వేరియంట్లు మారి థ‌ర్డ్ వేవ్‌కు కార‌ణ‌మ‌వుతుంద‌న్న అంచ‌నాలు ఇప్ప‌టికే ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ల నుంచి ఎలా త‌ప్పించు కోవాల‌నే అనే దానిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచ‌న‌లు చేసింది. ఈ కేసులు వ‌చ్చిన ప్రాంతాల‌ను డేంజ‌ర్ కంటోన్మైంట్ జోన్ల‌గా గుర్తించాలి. బాధితుల‌ను ప్ర‌త్యేకంగా ఐసోలేట్ చేయ‌డంతో వారి కాంటాక్టుల‌ను కూడా క్వారంటైన్ చేయాలి. ఆ ప్రాంతాల్లో భారీగా వ్యాక్సినేష‌న్ చేప‌ట్టాలి. ప్ర‌తి ఒక్క‌రు మాస్ ధ‌రించాలి.. వీలైతే రెండు మాస్క్‌లు ధ‌రిస్తే మంచిది. ఇక జ‌నం గుంపులు గుంపులుగా ఉండ‌కుండా చూడాలి అని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.

 



క‌రోనా డెల్టా వేరియంట్ వార్నింగ్‌: రెండు మాస్కులు మ‌రింత సేఫ్‌

సెకండ్ డోస్ పై తెలంగాణ కీలక నిర్ణయం.. !

క్రిష్ణ సెలెక్ట్ చేసిన ఆమె సూపర్ స్టార్ అయింది... ?

గ‌ర్భ‌ణీల‌కు వ్యాక్సినేష‌న్ గైడ్‌లైన్స్ విడుద‌ల‌

వాళ్ల టీకాల‌న్నీ పీకి పీకి మాకివ్వండి..??

టీఆర్ఎస్‌, వైసీపీక‌న్నా కాంగ్రెస్‌దే పైచేయి?

చంద్ర‌బాబుది బ్రేక్‌ఫాస్ట్ దీక్ష అంటున్న వైసీపీ ఎమ్మెల్సీ

బుల్లి పిట్ట : మీ పేరు మీద వున్న సిమ్ ను ఎవరైనా వాడుతుంటే ఇలా బ్లాక్ చేయవచ్చు..

సాయిరెడ్డి త‌న ఉచ్చులో తానే ప‌డ్డారా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>