PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-f427424c-5353-473f-8fae-ce66b2db501d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-f427424c-5353-473f-8fae-ce66b2db501d-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఓ చరిత్ర సృష్టించిన నేతలంతా గత కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉండిపోయారు. గత ఏడేళ్ల నుంచి పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడంతో చాలామంది నేతలు కార్యకర్తలు ఆ పార్టీ వైపే చూసారు. కానీ అందులో ఉన్న కొంతమంది సీనియర్లకు సరైన గుర్తింపు లేక ఇప్పటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇన్ని రోజుల నుంచి టిఆర్ఎస్కు ఎదుర్కొనే పార్టీ లేఖ ఆ పార్టీలోనే ఉండి ఏం మాట్లాడకుండా మిన్నకుండి పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసిగా ఎన్నిక కావడంతో వీరందరికీ ఒక ధైర్యం వచ్చింది. రేవంత్ సొంత జిల్లాPolitical {#}palamuru;Thota Chandrasekhar;Jupally Krishna Rao;history;revanth;Revanth Reddy;Congress;Assembly;Telangana Chief Minister;Party;Reddy;TDP;Bharatiya Janata Partyఈ నేతలంతా ఆ పార్టీలోనే చేరనున్నారా..!ఈ నేతలంతా ఆ పార్టీలోనే చేరనున్నారా..!Political {#}palamuru;Thota Chandrasekhar;Jupally Krishna Rao;history;revanth;Revanth Reddy;Congress;Assembly;Telangana Chief Minister;Party;Reddy;TDP;Bharatiya Janata PartyThu, 01 Jul 2021 13:05:00 GMT
 రాజకీయాల్లో ఓ చరిత్ర సృష్టించిన నేతలంతా గత కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉండిపోయారు. గత ఏడేళ్ల నుంచి పాలమూరు జిల్లాలో  టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడంతో  చాలామంది నేతలు  కార్యకర్తలు ఆ పార్టీ వైపే చూసారు. కానీ అందులో ఉన్న కొంతమంది  సీనియర్లకు  సరైన గుర్తింపు లేక ఇప్పటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇన్ని రోజుల నుంచి  టిఆర్ఎస్కు ఎదుర్కొనే  పార్టీ లేఖ ఆ పార్టీలోనే ఉండి ఏం మాట్లాడకుండా మిన్నకుండి పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసిగా ఎన్నిక కావడంతో  వీరందరికీ ఒక ధైర్యం వచ్చింది. రేవంత్ సొంత జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి అధికార పార్టీని ఎదిరించే సత్తా కలవాడు కాబట్టి, ఇన్ని రోజుల నుంచి సైలెంట్ గా  ఉన్న లీడర్లంతా తమ అనుచరగణలతో  చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

టిడిపి ప్రభుత్వంలో  ఒకేసారి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. వారు  కొత్తపేట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి  వీరు ఇప్పటికి టీడీపీలోనే కొనసాగు తున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనుకున్నవి సాధించలేకపోతున్నారు. ఈ దంపతులు ఇద్దరూ తమ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరదామ, లేక బిజెపిలో చేరదామ అని సమాలోచనలు చేస్తున్నట్టు  వారి అనుచరులు చెబుతున్నారు. ఇంకో నాయకుడు రావుల గుర్నాథ్ రెడ్డి. ఈయన చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత టిఆర్ఎస్లో చేరారు. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత తమ నియోజకవర్గంలో  మంచి ఫలితాలు సాధించాడు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా పదవి ఇస్తారు అని అనుకున్నాడు. కానీ ఇన్ని రోజుల నుంచి ఎలాంటి పదవి లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బిజెపి నేతలతో టచ్లో ఉన్నారని సమాచారం. కానీ ఆయన ఇప్పటికీ కాంగ్రెస్లో చేరతారా, బీజేపీలో చేరతారా అనేది తేలాల్సి ఉంది.

రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈయన టిడిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం  రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు ఈయన కాంగ్రెస్ లో వెలుగు వెలిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  ఆయన ఓటమి పాలు కావడంతో తన రాజకీయ ప్రయాణానికి ఆటంకాలు వచ్చాయి. దీంతో ఆయన ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఆయన టిఆర్ఎస్లోనే ఇప్పటికీ ఉన్నారు. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహకారం అందిస్తున్నారు. అయితే టిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో  టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.



బిగ్ బ్రేకింగ్‌: ఈట‌ల‌తో ట‌చ్‌లోకి ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ?

ఒక్క సీటు వైసీపీలో మూడు ముక్క‌లాట‌...!

టీడీపీ బతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే...బాబు మోహన్ సంచ‌ల‌నం... !

గోర‌క్ష‌కుల కోసం రంగంలోకి దిగిన బీజేపీ ఎమ్మెల్యే

చిన్నమ్మ ఆశ ఇంకా చావలేదా...మళ్ళీ మొదలెట్టినట్టే?

ఆ ఎన్నికల ముందో బ్లాస్ట్..ఈ ఎన్నికల ముందో బ్లాస్ట్.. ఏంటిది చెప్మా?

రష్యాలో డెల్టా వేరియంట్ తో ఇంత మంది మరణించారా..?

ఇద్దరూ తోడు దొంగలే, జలవివాదం అనేదే పెద్ద డ్రామా!

అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>