PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sasikala-annadmk236ed103-2612-4afd-8ba0-845547a6cbfb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sasikala-annadmk236ed103-2612-4afd-8ba0-845547a6cbfb-415x250-IndiaHerald.jpgతమిళనాడు రాజకీయాలు ప్రధానంగా రెండు ప్రధాన పార్టీల నడుమనే సాగుతూ ఉంటాయి. ఒకటి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే మరియు పనీర్ సెల్వం - పళనిస్వామి ప్రాతినిథ్యంలో ముందుకు వెళుతున్న అన్నాడీఎంకే పార్టీలు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేని ఓడించి డీఎంకే విజయ కేతనాన్ని ఎగురవేసిన సంగతి తెలిసిందే.SASIKALA-ANNADMK{#}jayalalitha;udhayanidhi stalin;Palani;Tamilnadu;Stalin;politics;Letter;Smart phone;Assembly;CM;Telangana Chief Minister;Partyచిన్నమ్మ ఆశ ఇంకా చావలేదా...మళ్ళీ మొదలెట్టినట్టే?చిన్నమ్మ ఆశ ఇంకా చావలేదా...మళ్ళీ మొదలెట్టినట్టే?SASIKALA-ANNADMK{#}jayalalitha;udhayanidhi stalin;Palani;Tamilnadu;Stalin;politics;Letter;Smart phone;Assembly;CM;Telangana Chief Minister;PartyThu, 01 Jul 2021 12:00:00 GMTతమిళనాడు రాజకీయాలు ప్రధానంగా రెండు ప్రధాన పార్టీల నడుమనే సాగుతూ ఉంటాయి. ఒకటి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే మరియు పనీర్ సెల్వం - పళనిస్వామి ప్రాతినిథ్యంలో ముందుకు వెళుతున్న అన్నాడీఎంకే పార్టీలు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేని ఓడించి డీఎంకే విజయ కేతనాన్ని ఎగురవేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డీఎంకే నుండి స్టాలిన్ ముఖ్యమంత్రిగా తన పాలనను కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టో లో చెప్పిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇలా అధికార పార్టీ పరిస్థితి ఆనందకరంగా ఉంది. కాగా ప్రతి పక్ష పార్టీ అయిన అన్నాడీఎంకేలో ఎప్పుడూ ఉన్నట్టే అభిప్రాయ బేధాలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. పార్టీలో ప్రధాన నాయకులైన పనీర్ సెల్వం మరియు పళని స్వామి ఎలాగోలా నెట్టుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు అన్నాడీఎంకేలో ముసలాన్ని రేపేలా ఉన్నాయి. 

తమిళనాడు మాజీ సీఎం మరియు దివంగత రాజకీయ నాయకురాలు జయలలిత నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకేని తన చేతుల్లోకి తీసుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే ఎక్కడ పార్టీ శశికళ చేతుల్లోకి వెళుతుందో అని పార్టీలోని ముఖ్య నాయకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం ముందుగానే నిర్వహించాల్సిన సంస్థాగత ఎన్నికల నిర్వహణకు అదనపు సమయం కోరుతూ సీఈసీ కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే చిన్నమ్మ ఎన్నికలకు ముందే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించినా, మాట మార్చుకుని ఇప్పుడు అన్నాడీఎంకే లో అధికారాన్ని చెలాయించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధిచిన ప్రయత్నాల్లో ఉందని సమాచారం.

అన్నాడీఎంకే లో ఉన్నపలువురు నేతలతో ఫోన్ లోనే సంప్రదింపులు జరుపుతోందని వినికిడి. అయితే ఆమె ఆశలు అడియాసలు అవ్వడం పక్కా అని మాజీ ముఖ్యమంత్రి మరియు అన్నాడీఎంకే నేత పళని స్వామి మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది. శశికళ ఎంత ప్రయత్నించినా పార్టీలో ఎంతమందితో మంతనాలు జరిపినా పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం శశికళ ఏ విధమైన స్టెప్ తీసుకుంటుందో చూడాలి. 



ఇద్దరూ తోడు దొంగలే, జలవివాదం అనేదే పెద్ద డ్రామా!

అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమేనా..?

మనీ: జగన్ ప్రభుత్వం నుండి ఒక్కో ఇంటికి రూ.లక్ష 80 వేలు..

ఏపీ జీవిత‌బీమా అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌?

రేవంత్‌ను వ‌ద‌ల‌ని ష‌ర్మిల‌... టీడీపీకి లింక్ పెట్టి సెటైర్లు....!

ఆ రిపోర్టు చూసి బాబు మాట ప‌డిపోయిందా... ఇంత బ్యాడ్‌గానా...!

ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా.. అయితే మీ వాట్సాప్ పనిచేయదు..

ఆ విషయంలో మోదీకంటే యోగి అదృష్టవంతుడు..

జాతీయ వైద్యుల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>