చంద్రబాబుపై ఏపీ మంత్రులు ఫైర్ … దొంగ దీక్షలన్న బాలినేని, నీఛ రాజకీయాలంటూ వెల్లంపల్లి ధ్వజం

కరోనా కష్ట కాలంలో ఎక్కడికి పోయారో చెప్పండి

కరోనా కష్ట కాలంలో ఎక్కడికి పోయారో చెప్పండి

కరోనా కష్టకాలంలో చంద్రబాబు ఎక్కడికి పోయారు అని ప్రశ్నించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కష్టకాలంలో దాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అప్పుడు ప్రజలకు అండగా ఉండకుండా ఇప్పుడు వచ్చి కరోనా బాధితులకు అండగా అంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు . ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏదో ఒక డ్రామాలాడుతూ చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరించినప్పుడే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని విమర్శించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేకుండా పోయిందన్నారు.

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

చంద్రబాబు టిడిపి బిజెపిలో విలీనం చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.ఇదిలా ఉంటే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం చంద్రబాబు నాయుడుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు విమర్శించటం దారుణమన్నారు. 31 లక్షల మంది పేదలకు ఇల్లు కేటాయించారని, జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు.

పేదల ఇళ్ళపై కూడా చంద్రబాబు నీచ రాజకీయం : వెల్లంపల్లి

పేదల ఇళ్ళపై కూడా చంద్రబాబు నీచ రాజకీయం : వెల్లంపల్లి

అయినా పేదల ఇళ్ల కోసమంటూ చంద్రబాబు నీచ రాజకీయాలకు తెర తీశారని విమర్శించారు. రాజధాని అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల పై కూడా చంద్రబాబు, దేవినేని ఉమ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాద్ధాంతం చేయడం టీడీపీకి ఆనవాయితీగా మారింది అని మండిపడుతున్న మంత్రులు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కనబడకుండా పోతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి నేతలు పద్ధతి మార్చుకోవాలని హితవు చెబుతున్నారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *