ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/anand-mahindrab2f914da-170e-4212-8cad-75c4d415b7ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/anand-mahindrab2f914da-170e-4212-8cad-75c4d415b7ee-415x250-IndiaHerald.jpgప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటారు. ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో వివరిస్తుంటారు. అలాగే ఎవరూ గుర్తించని క్రియేటివిటీని ఆయన నెటిజన్లకు పరిచయం చేసుకుంటారు. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో తరచూ షేర్ చేస్తుంటారు. అలాగే ఆ వీడియోలకు తగిన క్యాప్షన్ పెడుతుంటారు. అయితే తాజాగా ఆయన ఒక వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. అలాగే ఆ వీడియో నుంచి బిజినెస్ కి సంబంధించి ఏం నేర్చుకోవచ్చో కూడా వివరించారుanand mahindra{#}Fidaa;anand malayalam actor;Anand Deverakonda;media;twitter;netizens;Aqua;Tiger;Manamవీడియో: పులిని ఆటాడించిన బాతు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా..!వీడియో: పులిని ఆటాడించిన బాతు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా..!anand mahindra{#}Fidaa;anand malayalam actor;Anand Deverakonda;media;twitter;netizens;Aqua;Tiger;ManamThu, 01 Jul 2021 17:30:00 GMTఆనంద్ మహీంద్రా సోషల్ మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటారు. ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో వివరిస్తుంటారు. అలాగే ఎవరూ గుర్తించని క్రియేటివిటీని ఆయన నెటిజన్లకు పరిచయం చేసుకుంటారు. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో తరచూ షేర్ చేస్తుంటారు. అలాగే ఆ వీడియోలకు తగిన క్యాప్షన్ పెడుతుంటారు. అయితే తాజాగా ఆయన ఒక వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. అలాగే ఆ వీడియో నుంచి బిజినెస్ కి సంబంధించి ఏం నేర్చుకోవచ్చో కూడా వివరించారు. దీంతో నెటిజనులు ఈ వీడియో కి బాగా కనెక్ట్ అయ్యారు.


ఇంతకీ ఈ 34 సెకండ్ల నిడివిగల వీడియోలో ఏముందో తెలుసుకుంటే.. ఒక పెద్దపులి, ఒక బాతు నీటి గుంట లో ఉన్నాయి. అయితే బాతుని పట్టుకొని తినేయాలని పులి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ బాతు మాత్రం తెలివిగా నీటిలో దాక్కుంటూ పులికి చిక్కకుండా తప్పించుకుంది. మళ్లీ ఛాలెంజ్ విసురుతూ నీటి పై భాగానికి వచ్చి బాతు పులిని ఒక ఆట ఆడించింది. అయితే 42 లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన ఈ ఫన్నీ వీడియోకి ఆనంద్ మహీంద్రా ఈ క్రింది విధంగా క్యాప్షన్ జతచేశారు.

" style="height: 332px;">


"ఈ వీడియో.. మేనేజ్మెంట్ లెక్చర్ కంటే చిన్న, అతి చురుకైన, శీఘ్ర-తెలివితో ఉంటే వ్యాపారంలో ప్రయోజనాలను పొందొచ్చని తెలియజేస్తుంది. అందుకే కొత్త కంపెనీలు కొత్త అవకాశాలను పొందడానికి తమలో తాము స్టార్టప్ టీమ్స్, స్టార్టప్ సంస్కృతులను రూపొందించాలి" అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.



మంచి బిజినెస్ లెసన్ చెప్పారని కానీ చివరికి ఏమైందో తమకు తెలుసుకోవాలని ఉందని.. ఫుల్ వీడియో పోస్ట్ చేయండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నీటిలో ఎలా తప్పించుకోవాలో బాతుకి తెలుసు. అదే నేల మీదైతే బాతు తెలివిగా, చురుకుగా తప్పించుకోలేదు. నీటిలో ఉన్నంతసేపు అది ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించుకోగలుగుతుంది. దీన్నిబట్టి మనం పనిచేసే వాతావరణానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థమవుతుంది. అలాగే ఆ వాతావరణాన్ని మనకి అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నామనేది కూడా ముఖ్యమని అర్థమవుతుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.




టాప్ 10 డౌన్లోడెడ్ యాప్స్ ఏంటో తెలుసా?

వీడియో: పులిని ఆటాడించిన బాతు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ వైరల్ కేటగిరి లో చూడండి.

నిఖిల్ సినిమా కూడా ఓటిటికెనా??

సాఫ్ట్ స్కిన్ కోసం ఇలా చెయ్యండి...

'అభిమానమా' ఇది, ఎందుకీ పిచ్చి?

సాగ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం...?

ప్రభాస్ కాజల్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా?

పాపం ష‌ర్మిల ఎర‌క్కుపోయి ఇరుక్కుపోయారే ?

నీటి వివాదం పెద్ద డ్రామా - టీడీపీ ఎంపీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>