EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr1c170461-1030-47ee-850c-35f0aa9f35e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr1c170461-1030-47ee-850c-35f0aa9f35e4-415x250-IndiaHerald.jpgకేసీఆర్‌లో కొన్ని రోజులుగా ఓ మార్పు కనిపిస్తోంది. సాధారణంగా కేసీఆర్ పెద్దగా బయటకు రారు. ప్రగతిభవన్‌ కో ఫాంహౌస్‌కో పరిమితమం అవుతుంటారు. చివరకు మంత్రులకు సైతం ఆయన దర్శనం అంత సులభంగా దొరకదు. అలాంటిది.. ఇటీవల ఆయన తరచూ బయటకు వస్తున్నారు. అంతే కాదు.. ప్రగతి భవన్‌లోకి ఇతర పార్టీ నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే ఆయన వరంగల్ జిల్లా పర్యటన చేశారు. యాదాద్రి జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని సందర్శించారు. సాధారణంగా కాలు బయటపెట్టని కేసీఆర్.. ఇప్పుడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీల కార్యాలయాలకు నిర్మించిన నూతనkcr{#}pragathi;yadadri;Canada;Warangal;Bharatiya Janata Party;KCR;District;Cinema;Partyకేసీఆర్‌లో కొత్త మార్పు.. కారణం ఆయన ఒక్కడేనా..?కేసీఆర్‌లో కొత్త మార్పు.. కారణం ఆయన ఒక్కడేనా..?kcr{#}pragathi;yadadri;Canada;Warangal;Bharatiya Janata Party;KCR;District;Cinema;PartyThu, 01 Jul 2021 00:00:00 GMTకేసీఆర్‌లో కొన్ని రోజులుగా ఓ మార్పు కనిపిస్తోంది. సాధారణంగా కేసీఆర్ పెద్దగా బయటకు రారు. ప్రగతిభవన్‌ కో ఫాంహౌస్‌కో పరిమితమం అవుతుంటారు. చివరకు మంత్రులకు సైతం ఆయన దర్శనం అంత సులభంగా దొరకదు. అలాంటిది.. ఇటీవల ఆయన తరచూ బయటకు వస్తున్నారు. అంతే కాదు.. ప్రగతి భవన్‌లోకి ఇతర పార్టీ నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే ఆయన వరంగల్ జిల్లా పర్యటన చేశారు. యాదాద్రి జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని సందర్శించారు.


సాధారణంగా కాలు బయటపెట్టని కేసీఆర్.. ఇప్పుడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీల కార్యాలయాలకు నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించడానికి కూడా వస్తున్నారు. ఇక వరంగల్ సభలో కేసీఆర్‌ స్థానికులకు  అరచేతిలో వైకుంఠం చూపించారు. ప్రపంచంలోకెల్లా గొప్ప ఆసుపత్రి కెనడాలో ఉందనీ, వరంగల్‌లో 33 అంతస్థులతో నిర్మిస్తున్న ఆసుపత్రి ఆ స్థాయిలో ఉంటుందని కేసీఆర్‌ సినిమా చూపించారు. కెనడాలోని జనరల్‌ ఆసుపత్రి వంటి దాన్ని వరంగల్‌లో నిర్మిస్తానని, ఆ ఆస్పత్రి ఎలా ఉందో చూసి రావడానికి కెనడా వెళ్లాలని కూడా అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అంతేకాదు.. ఏడాదిన్నరలోపే సదరు బృహత్తర ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేయాలని కూడా ఆయన ఆదేశించారు.


మరి కేసీఆర్‌లో ఇంత మార్పుకు కారణం ఏంటి..? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇదంతా హూజూరాబాద్ ఉప ఎన్నికల మహత్యమేనంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక చాలా కీలకం. ఇప్పటికే టీఆర్‌ఎస్ దుబ్బాక ఉపఎన్నికలో పరాభవం కారణంగా కాస్త ఇబ్బంది పడింది. ఆ తర్వాత సాగర్ ఉపఎన్నిక ద్వారా కాస్త  పుంజుకున్నా.. మరోసారి దుబ్బాక సీన్ రిపీటైతే.. బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి.


అందుకే చిన్న కర్రనైనా పెద్ద కర్రతో కొట్టాలన్న వ్యూహంతో కేసీఆర్.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తూ మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.





ఆ రెండిటిలో టీడీపీకి మైనస్ ఉందా?

ఏపీకి కలకాలం సీఎంగా జగనే ఉండాలట.. కేసీఆర్ కోరిక ఇదేనట..?

అక్కడ సెల్ఫీలు తీసుకోవడం నేరమట...

ఆయన్ను మరో గుణశేఖర్ అంటున్నారు..!

నెవర్ బిఫోర్ లుక్ తో ప్రభాస్.. ఆ స్టైల్ కే పడిపోతారట..!

హెయిర్ స్టైల్ కోసం ప్రభాస్ అన్ని లక్షలు ఖర్చు చేస్తాడా..?

దోపిడి దొంగగా మారిన మహానటి.. కారణం..

సదాకు చుక్కలు చూపించిన ఆ హీరో...

క్రిష్ణ సెలెక్ట్ చేసిన ఆమె సూపర్ స్టార్ అయింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>