MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-birthday-specialed9681ea-90ed-4ef3-99e0-9ba4464c23c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-birthday-specialed9681ea-90ed-4ef3-99e0-9ba4464c23c0-415x250-IndiaHerald.jpgహీరో అల్లరి నరేష్ ...తెలుగు చలన చిత్ర సీమ ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వితీయ పుత్రుడు అన్న విషయం తెలిసిందే. మూవీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్. తన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన జోన్ ని ఏర్పాటు చేసుకున్నాడు. "అల్లరి" సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ కథానాయకుడు, ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి అల్లరి నరేష్ గా ప్రఖ్యాతి పొందాడు. ALLARI NARESH BIRTHDAY SPECIAL{#}Naresh;allari naresh;maharshi;rajendra prasad;Rayalaseema;Maharshi;Audience;Comedy;Hero;babu rajendra prasad;Sudigaadu;Posters;Industry;Tollywood;Darsakudu;Director;Cinemaటాలీవుడ్ కి మరో "నట కిరీటి" ఇతనే ?టాలీవుడ్ కి మరో "నట కిరీటి" ఇతనే ?ALLARI NARESH BIRTHDAY SPECIAL{#}Naresh;allari naresh;maharshi;rajendra prasad;Rayalaseema;Maharshi;Audience;Comedy;Hero;babu rajendra prasad;Sudigaadu;Posters;Industry;Tollywood;Darsakudu;Director;CinemaWed, 30 Jun 2021 13:00:00 GMTహీరో అల్లరి నరేష్ ...తెలుగు చలన చిత్ర సీమ ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వితీయ పుత్రుడు అన్న విషయం తెలిసిందే. మూవీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్. తన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన జోన్ ని ఏర్పాటు చేసుకున్నాడు. "అల్లరి" సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ కథానాయకుడు, ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి అల్లరి నరేష్ గా ప్రఖ్యాతి పొందాడు. హాస్యాన్ని పండించే హీరోలలో అల్లరి నరేష్ ఎప్పుడూ ముందే ఉంటాడు. హాస్య ప్రధానమైన చిత్రాలను ఎంచుకొని దానికి అభినయాన్ని జోడించి ప్రేక్షకులను మెప్పించగల టాలెంట్ ఇతని సొంతం. నటనలో రాజేంద్రప్రసాద్ వారసుడిగా ప్రఖ్యాతి పొందిన ఘనత అల్లరి నరేష్ కు దక్కింది. టాలీవుడ్ లో నట కిరీటి గా ఆదరణ పొందుతున్న రాజేంద్ర ప్రసాద్ తర్వాత అల్లరి నరేష్ ఆ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. అల్లరి, తొట్టి గ్యాంగ్, ప్రాణం, సీమటపాకాయ్, సుడిగాడు ఇలా ఇప్పటివరకు తన కెరీర్ లో 50కి పైగానే సినిమాలు తీశాడు ఈ సీమ శాస్త్రి. 
అల్లరి నరేష్ సినిమా అంటేనే నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత హాస్యం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ హీరో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 19 ఏళ్ళు గడుస్తోంది. అయితే ఈ మద్యకాలంలో వరుస ప్లాపులు అతన్ని వెంటాడి తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయినా అతను ఏమాత్రం కుంగిపోకుండా ప్రయత్నిస్తూనే వచ్చాడు. కొత్త తరహాగా మహర్షి సినిమాలో ఓ సీరియస్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అందించిన హిట్ తో కాస్త ఊరట అందుకున్న అల్లరినరేష్ నాంది చిత్రంతో చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాతో గతంలో మునుపెన్నడూ లేని విధంగా పూర్తి భిన్నమైన, ఉద్వేగభరితమైన పాత్ర పోషించి ప్రేక్షకులకు తనలోని మరో కోణాన్ని చూపించి మెప్పించాడు. విజయ్‌ కనకమేడల ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, సతీష్‌ వేగేశ్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  

ఈ మూవీతో నరేష్ అంటే కామెడీ ఒకటే కాదు సీరియస్ పాత్రలోనూ సిన్సియర్ గా నటించి ఆడియన్స్ ని అబ్బురపరచగలడు అని నిరూపించాడు. ప్రస్తుతం తన 58వ చిత్రాన్ని మల్లంపాటి సతీష్‌ డైరెక్షన్ లో ఈస్ట్‌ కోస్ట్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మించనున్నారు. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సభకు నమస్కారం అనే టైటిల్ ను ఖరారు చేసి అభిమానులకు ఫస్ట్ పోస్టర్ గిఫ్ట్ గా విడుదల చేసింది చిత్రబృందం.




మరో హిస్టోరికల్ స్క్రిప్ట్ తో కళ్యాణ్ రామ్..?

RRR సందడి లో పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!!

జయసుధ ఏకగ్రీవం అంటున్న మెగా బ్రదర్..?

బాలయ్య ద్విపాత్రాభినయం.. ఎన్ని హిట్టు.. ఎన్ని ఫట్టు.. ?

Comedy King Allari Naresh Birthday Special Images

హీరో అల్లరి నరేష్ ...తెలుగు చలన చిత్ర సీమ ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వితీయ పుత్రుడు అన్న విషయం తెలిసిందే. మూవీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్. తన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన జోన్ ని ఏర్పాటు చేసుకున్నాడు. "అల్లరి" సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ కథానాయకుడు, ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి అల్లరి నరేష్ గా ప్రఖ్యాతి పొందాడు.

హిలేరియస్ ఎంటర్టైనెర్ ప్రకటించిన అల్లరి నరేష్..!

ఇండస్ట్రీకి అల్లరి నరేష్ ఇవివి సత్యనారాయణ కొడుకుగా పరిచయమైయ్యారు. ఆయన ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లరి నరేష్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

పుష్ప ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>