MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/am-rathanam-71eaa11e-6578-414f-bed9-73ce7f340fdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/am-rathanam-71eaa11e-6578-414f-bed9-73ce7f340fdf-415x250-IndiaHerald.jpgవిజయశాంతి మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం కర్తవ్యం. ఈమె సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటూనే, మరోపక్క లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ స్టార్ హీరోలకు పోటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమెను "లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్" అని బిరుదు కూడా ఇచ్చారు. కేవలం ఈ ఒకే ఒక్క సినిమా ద్వారా ఈమెకు మంచి ఇమేజ్ వచ్చిందని చెప్పవచ్చు. 1990వ సంవత్సరం జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జీవిత చరిత్AM RATHANAM {#}vinod kumar;Makeup;A M Rathnam;INTERNATIONAL;kiran;jeevitha rajaseskhar;Vijayashanti;June;Chiranjeevi;Chitram;Pawan Kalyan;Traffic police;producer;Producer;Heroine;Cinemaకర్తవ్యం..మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న నిర్మాత..కర్తవ్యం..మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న నిర్మాత..AM RATHANAM {#}vinod kumar;Makeup;A M Rathnam;INTERNATIONAL;kiran;jeevitha rajaseskhar;Vijayashanti;June;Chiranjeevi;Chitram;Pawan Kalyan;Traffic police;producer;Producer;Heroine;CinemaWed, 30 Jun 2021 19:07:58 GMT
విజయశాంతి మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం కర్తవ్యం. ఈమె సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటూనే, మరోపక్క లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ స్టార్ హీరోలకు పోటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమెను "లేడీ సూపర్ స్టార్,  లేడీ అమితాబ్"  అని బిరుదు కూడా ఇచ్చారు. కేవలం ఈ ఒకే ఒక్క సినిమా ద్వారా ఈమెకు మంచి ఇమేజ్ వచ్చిందని చెప్పవచ్చు. 1990వ సంవత్సరం జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జీవిత చరిత్ర గా తెరకెక్కింది.


సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తన నిజస్వరూపాన్ని  ఈ చిత్రంలో బయటపెట్టారు. ఇక ప్రముఖ నటుడు వినోద్ కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రంలో విలన్ గా సీనియర్ నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య నటించి మెప్పించారు. ఈ సినిమాలో హీరోయిన్ మీనా కూడా ప్రముఖ పాత్ర పోషించడం విశేషం. కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా ఏడు కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.

విజయశాంతి ఈ  సినిమాకు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలను రెమ్యూనరేషన్ కింద తీసుకోవడం గమనార్హం. ఈ సినిమా తర్వాత ఆమె సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మొట్టమొదటి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హర హర వీరమల్లు ఈ సినిమాను నిర్మించిన ఏ ఎమ్ రత్నం ఈ సినిమాను మొదటి సారిగా నిర్మించారు. ఈయన మొదటిసారిగా నిర్మించినప్పటికీ, ఈ చిత్రానికి గాను ఉత్తమ నిర్మాత ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం నిర్మించడం ముందు ఏఎం రత్నం మేకప్ మెన్ గా పనిచేసేవారు.

ఇక మొదటి సారిగా విజయశాంతి ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు 14వ  అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రధాన స్రవంతి  విభాగంలో కూడా ప్రదర్శించడం విశేషం. 1990లో జాతీయ చలన చిత్ర అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందుకుంది ఈ సినిమా.





అల్లరి నరేష్ సభకు నమస్కారం కథ అదేనా?

పవన్ కు ఏమాత్రం తగ్గని రానా..!

బాలీవుడ్ లో సౌత్ అందాలు.. !!

చెర్రీ ఇంటి కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?

అదిరిపోయే కారు కొన్న 'పవర్ స్టార్'.. రేట్ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ సూపర్ హిట్ సినిమాలివే..!

కళ్ళుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్.?

తాజాగా పవన్ కల్యాణ్ ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ కొన్న కారు పేరు రేంజ్ రోవర్.దీని ఖరీదు దాదాపు 4 కోట్లు అని సమాచారం. రేంజ్ రోవర్ లో ఇది సరికొత్త మోడల్ అని.. పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా ఈ కారుని కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..

హీరోయిన్ తాప్సీ దగ్గర అన్ని కోట్ల ఆస్తి ఉందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>