MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tammareddy-bharadwajabd7ff8a4-1883-43e7-9c71-b568da830c73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tammareddy-bharadwajabd7ff8a4-1883-43e7-9c71-b568da830c73-415x250-IndiaHerald.jpgప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నేడు అనగా జూలై 30వ తేదీన తన 79వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి గోపాల కృష్ణమూర్తికి కుమారుడు అవుతారు. భరద్వాజ తన పాఠశాల విద్యను సికింద్రాబాద్ లోని వెస్లీ హైస్కూల్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువు పూర్తి చేసిన భరద్వాజ ఆంధ్రప్రదేశ్ tammareddy bharadwaja{#}jeevitha rajaseskhar;Tollywood;producer;School;University;Andhra Pradesh;Hyderabad;Cinema;kadapa;Annayya;Antahpuram;Silver;George Reddy;Hero;Varshamతమ్మారెడ్డి భరద్వాజ జీవిత విశేషాలు ఇవే..!తమ్మారెడ్డి భరద్వాజ జీవిత విశేషాలు ఇవే..!tammareddy bharadwaja{#}jeevitha rajaseskhar;Tollywood;producer;School;University;Andhra Pradesh;Hyderabad;Cinema;kadapa;Annayya;Antahpuram;Silver;George Reddy;Hero;VarshamWed, 30 Jun 2021 11:00:00 GMTటాలీవుడ్ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నేడు అనగా జూలై 30వ తేదీన తన 79వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి గోపాల కృష్ణమూర్తికి కుమారుడు అవుతారు. భరద్వాజ తన పాఠశాల విద్యను సికింద్రాబాద్ లోని వెస్లీ హైస్కూల్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువు పూర్తి చేసిన భరద్వాజ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల విభాగంలో సివిల్ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేశారు. అంతేకాకుండా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కొద్ది సంవత్సరాల పాటు కొనసాగారు.

ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేశారు. దర్శకుడిగా, నిర్మాతగా చలన చిత్ర పరిశ్రమలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. 1979లో మొట్ట మొదటిగా ఆయన కోతలరాయుడు అనే సినిమాని నిర్మించారు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు నిర్మించి.. ఆపై దర్శకునిగా మారారు. కడప రెడ్డమ్మ, రౌడీ అన్నయ్య వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన భరద్వాజ్ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సూపర్ డూపర్ హిట్ అయిన అంతఃపురం చిత్రానికి ఆయన కో-ప్రొడ్యుసర్ గా వ్యవహరించారు. 2014లో వచ్చిన ప్రతిఘటన సినిమా కి ఆయన నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఆయన డైరక్ట్ చేసిన "పోతే పోనీ" సినిమాకి 2015లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నంది అవార్డు లభించింది. "ఈ రోజుల్లో" సినిమాతో ఆయన నటుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు.

ఇకపోతే భరద్వాజ అనేక అంశాలపై మాట్లాడుతుంటారు. విప్లవవాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడు జార్జి రెడ్డి తన స్నేహితుడు అని ఆయన వెల్లడించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని టాలీవుడ్ హీరోల గురించి ఆయన అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇటీవల రియల్ హీరో సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపించి వార్తల్లో నిలిచారు.


ఆ పాత్ర అమీర్ ఖాన్ చేసుంటేనా...?

తమ్మారెడ్డి భరద్వాజ జీవిత విశేషాలు ఇవే..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

"స‌భ‌కు న‌మ‌స్కారం" అంటున్న బ‌ర్త్ డే బాయ్.. !

వావ్ : బాత'మ్మ' దాగుడుమూతలు.. !

అవికా గోర్ సినీ ఇండస్ట్రీలో వెనుకబడటానికి కారణం ఇదేనా..

సాహో న‌టి ఇంట తీవ్ర‌విషాదం.. !

ఆ సినిమాకు 40 రోజుల్లో రూ.5 కోట్ల నష్టం..!?

హ్యాపీ బర్త్ డే : నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అల్లరి నరేష్ కే సాధ్యం..!

మహర్షి సినిమా లో అల్లరి నరేష్ ఫస్ట్ ఛాయిస్ కాదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>