Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc782e6a2-0698-4365-a0dc-8fc4eca70cba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc782e6a2-0698-4365-a0dc-8fc4eca70cba-415x250-IndiaHerald.jpgప్రతి ఏడాది బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా బీసీసీఐ నిర్వహించే దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఎంతగానో గుర్తింపు సంపాదించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి విదేశీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసింది బిసిసిఐ. అనుకున్న సమయానికి ఐపీఎల్ ప్రారంభించింది. ఇక అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో బయో బబుల్ లోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీంతో బిసిసిఐ ప్లాన్ కIpl{#}November;World Cup;BCCI;september;Coronavirus;October;Indian;Cricketఐపీఎల్ 2021 : ఫేస్-2 షెడ్యూల్లో మార్పులు?ఐపీఎల్ 2021 : ఫేస్-2 షెడ్యూల్లో మార్పులు?Ipl{#}November;World Cup;BCCI;september;Coronavirus;October;Indian;CricketWed, 30 Jun 2021 12:00:00 GMTప్రతి ఏడాది బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది.  అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా బీసీసీఐ నిర్వహించే దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఎంతగానో గుర్తింపు సంపాదించింది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి విదేశీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసింది బిసిసిఐ. అనుకున్న సమయానికి ఐపీఎల్ ప్రారంభించింది. ఇక అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో బయో బబుల్ లోకి  కరోనా ఎంట్రీ ఇచ్చింది.


 దీంతో బిసిసిఐ ప్లాన్ కాస్తా ఫెయిల్ అయింది. ఇక వరుసగా పలు జట్ల ఆటగాళ్లు వైరస్ బారిన పడుతూ ఉండటం తో..  చివరికి సజావుగా సాగుతున్న ఐపీఎల్ కాస్తా నిరవధికంగా వాయిదా వేసింది బిసీసీఐ. ఈ క్రమంలోనే ఇటీవల ఇటీవలే యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది బీసీసీఐ .  కానీ ఇటీవలే ఐపీఎల్ రెండవ దశ షెడ్యూల్లో మార్పులు చేసేందుకు బిసిసిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీనికి కారణం టి20 వరల్డ్ కప్.  టి20 వరల్డ్ కప్ కు ఐపీఎల్కు మధ్య కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.




 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఆడే విదేశీ ఆటగాళ్లు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందని బిసిసిఐ భావిస్తోంది. ఇటీవలే టి20 వరల్డ్ కప్ ను అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఓమాన్ తోపాటు యూఏఈ వేదికగా నిర్వహించాలని షెడ్యూలు కూడా విడుదల చేసింది ఐసీసీ  . అయితే అంతకు ముందే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఐపీఎల్ ముగియడానికి అటు టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి మధ్యలో కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పు చేయాలని భావిస్తున్నారట. త్వరలో రెండవ దశ ఐపీఎల్ కు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది



పుష్ప ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!

బాలీవుడ్ లో విషాదం..!

ఆర్ఆర్ఆర్ పోస్టర్‌కి పవన్‌కి ఇలా లింక్ అయ్యిందట..!

హిస్టరీ క్రియేట్ చేసిన ‘వాలిమై’ సినిమా..!

క‌రోనా అప్డేట్..నిన్న గుడ్ నేడు బ్యాడ్ న్యూస్.. !

అరిపించాడు: ఇండియాలో గల్లీ క్రికెట్ షేన్ వార్న్...?

ఆ సినిమాకు 40 రోజుల్లో రూ.5 కోట్ల నష్టం..!?

అనాధ శరణాలయం నుంచి క్రికెటర్ గా ఆమె ఎదిగిన తీరు అసామాన్యం..

గుడ్ న్యూస్ : భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ లకు ప్రేక్షకులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>