PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp19f10d30-2f75-4aa8-8dba-4679902234e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp19f10d30-2f75-4aa8-8dba-4679902234e5-415x250-IndiaHerald.jpgనిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీ అవ‌కాశం ఇవ్వ‌లేదు.. అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఫుల్లుగా రెచ్చిపోమ‌ని.. పార్టీ నుంచి ఆదేశాలు అందినా..కూడా ఆ నేత స్పందించ‌డం లేద‌ని అంటున్నారు కార్య‌క‌ర్త‌లు. ఆయ‌నే చిత్తూరు జిల్లాకు చెందిన న‌గ‌రి నియోజ‌కవ‌ర్గం టీడీపీ ఇంచార్జ్.. గాలి భాను ప్ర‌కాశ్ నాయుడు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. త‌ర్వాత కొన్నాళ్లు పార్టీ నుంచి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. భాను దూకుడుగా లేడ‌ని.. ఆయ‌న వ‌ల్ల పార్టీ పుంజుకునే ప‌రిtdp{#}bhanu;Nara Lokesh;Chittoor;Air;Dookudu;MLA;TDP;Partyటీడీపీలో ఉద‌యించ‌ని `భాను`డు..టీడీపీలో ఉద‌యించ‌ని `భాను`డు..tdp{#}bhanu;Nara Lokesh;Chittoor;Air;Dookudu;MLA;TDP;PartyWed, 30 Jun 2021 17:00:00 GMTనిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీ అవ‌కాశం ఇవ్వ‌లేదు.. అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఫుల్లుగా రెచ్చిపోమ‌ని.. పార్టీ నుంచి ఆదేశాలు అందినా..కూడా ఆ నేత స్పందించ‌డం లేద‌ని అంటున్నారు కార్య‌క‌ర్త‌లు. ఆయ‌నే చిత్తూరు జిల్లాకు చెందిన న‌గ‌రి నియోజ‌కవ‌ర్గం టీడీపీ ఇంచార్జ్.. గాలి భాను ప్ర‌కాశ్ నాయుడు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. త‌ర్వాత కొన్నాళ్లు పార్టీ నుంచి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. భాను దూకుడుగా లేడ‌ని.. ఆయ‌న వ‌ల్ల పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతో ఇక్క‌డ నేత‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పార్టీలో చ‌ర్చ‌వ‌చ్చింది.


అయితే.. ఏమ‌నుకున్నారో.. ఏమో.. మ‌ళ్లీ భానుకు ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చేసి.. అంద‌రూ భాను చెప్పిన‌ట్టే న‌డ‌వాల‌ని.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నుంచి న‌గ‌రికి ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. దీంతో అప్ప‌టి నుంచి భాను మ‌ళ్లీ యాక్టివ్ అవుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి ఇప్పుడు.. క‌నిపిస్తోంది. గాలి భాను ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఇటీవ‌ల ఎమ్మెల్యే రోజాపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఆమెకు వ్య‌తిరేకంగా కొంద‌రు పోస్టులు పెట్టారు. దీంతో వారిపై కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకుని త‌మ‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించాల‌ని.. స‌ద‌రు కార్య‌క‌ర్త‌లు.. భానును కోర‌గా.. ఆయ‌న అదిగో ఇదిగో అంటూ కాల‌యాప‌న చేశార‌ని.. దీంతో కార్య‌క‌ర్త‌లు ఒక్కొక్క‌రుగా దూర‌మ‌వుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.


ఇక‌, ఎమ్మెల్యే రోజా కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన రోజా.. మూడో సారి ముచ్చ‌ట‌గా విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాను లేక‌పోయినా.. ప‌నులు జ‌రిగేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోజాకు దీటుగా రాజ‌కీయం దూకుడు పెంచాల్సిన భాను.. వెనుక‌బడిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదే ప‌రిస్థితి మ‌రికొన్నాళ్లు కొన‌సాగితే.. భానుకు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. పార్టీ ఇచ్చిన స్వేచ్ఛ‌ను ఆయ‌న వినియోగించుకుని ముందుకు సాగితేనే ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.




కేసీఆర్ రాజీనామా చేసి ఉపఎన్నిక‌లకు రావాలి..!

బాబోరు మామ ఎన్టీఆర్ ను అలా వాడితే - చినబాబోరు మామ బాలయ్యను ఇలా..

మళ్ళీ పేపర్లకే పెట్టుబడులు పరిమితవుతాయా?

జాబ్ క్యాలెండ‌ర్లో జాబుల్లేవ్ - అచ్చెన్నాయుడు

నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీ అవ‌కాశం ఇవ్వ‌లేదు.. అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఫుల్లుగా రెచ్చిపోమ‌ని.. పార్టీ నుంచి ఆదేశాలు అందినా..కూడా ఆ నేత స్పందించ‌డం లేద‌ని అంటున్నారు కార్య‌క‌ర్త‌లు. ఆయ‌నే చిత్తూరు జిల్లాకు చెందిన న‌గ‌రి నియోజ‌కవ‌ర్గం టీడీపీ ఇంచార్జ్.. గాలి భాను ప్ర‌కాశ్ నాయుడు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. త‌ర్వాత కొన్నాళ్లు పార్టీ నుంచి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. భాను దూకుడుగా లేడ‌ని.. ఆయ‌న వ‌ల్ల పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతో ఇక్క‌డ నేత‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పార్టీలో చ‌ర్చ‌వ‌చ్చింది.

ఏవోబీలో నిఘా పెంచిన పోలీసులు

తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టున్న నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా కొండపి ఒకటి. ఇక్కడ ఎక్కువసార్లు తెలుగుదేశమే గెలుస్తూ వచ్చింది. ఇక గత రెండు పర్యాయాలుగా ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తుంది. టీడీపీ తరుపున డోలా బాల వీరాంజనేయస్వామి గెలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈయన జూపూడి ప్రభాకర్ రావుపై గెలవగా, 2019 ఎన్నికల్లో మాదసి వెంకయ్యపై గెలిచారు.

అక్కడ వైసీపీకి ఛాన్స్ దొరికినట్లేనా...?

టీఆర్ఎస్‌, వైసీపీక‌న్నా కాంగ్రెస్‌దే పైచేయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>