SportsSanjayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/roger-federer-e64b8279-18a1-41fa-836b-a5f00649ef33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/roger-federer-e64b8279-18a1-41fa-836b-a5f00649ef33-415x250-IndiaHerald.jpgవింబుల్డన్‌ తొలి రౌండ్లో అన్‌సీడెడ్‌ అడ్రియన్‌ మన్నారినోతో పోరులో గట్టెక్కడానికి స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. నాలుగు సెట్లలో చెరో రెండు గెలవగా నిర్ణయాత్మక ఐదో సెట్లో ప్రత్యర్థి మన్నారినో వాకోవర్‌ ఇవ్వడంతో ఫెడరర్‌ ముందంజ వేశాడు. 6వ సీడ్‌ ఫెడెక్స్‌ 6-4, 6-7(3), 3-6, 6-2తో సమంగా ఉన్నప్పుడు.. ఫ్రాన్స్‌ ఆటగాడు అడ్రియన్‌ మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఐదో సెట్‌ ఆడలేక తప్పుకొన్నాడు.roger federer;{#}Germany;Olympic Games;Greece;Australia;bhama;Athaduవింబుల్డన్‌ ఫస్ట్‌ రౌండ్లో ఫెడరర్‌కు వాకోవర్‌వింబుల్డన్‌ ఫస్ట్‌ రౌండ్లో ఫెడరర్‌కు వాకోవర్‌roger federer;{#}Germany;Olympic Games;Greece;Australia;bhama;AthaduWed, 30 Jun 2021 01:19:52 GMTవింబుల్డన్‌ తొలి రౌండ్లో అన్‌సీడెడ్‌ అడ్రియన్‌ మన్నారినోతో పోరులో గట్టెక్కడానికి స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. నాలుగు సెట్లలో చెరో రెండు గెలవగా నిర్ణయాత్మక ఐదో సెట్లో ప్రత్యర్థి మన్నారినో వాకోవర్‌ ఇవ్వడంతో ఫెడరర్‌ ముందంజ వేశాడు. 6వ సీడ్‌ ఫెడెక్స్‌ 6-4, 6-7(3), 3-6, 6-2తో సమంగా ఉన్నప్పుడు.. ఫ్రాన్స్‌ ఆటగాడు అడ్రియన్‌ మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఐదో సెట్‌ ఆడలేక తప్పుకొన్నాడు. ఇక, నాలుగు సంవత్సరాల అనంతరం వింబుల్డన్‌ టైటిల్‌ వేటలో దిగిన బ్రిటన్‌ స్టార్‌ ఆండీ మర్రే 6-4, 6-3, 5-7, 6-3తో నికోల్జ్‌పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.

ఐదో సీడ్ రుబ‌లేవ్ 4-6, 6-4, 6-1, 6-2తో ఫెడ్రికో మీద‌, తొమ్మిదో సీడ్ స్క్వార్జ్‌మ‌న్‌ 6-3, 6-4, 6-0తో పెయిరీపై  నెగ్గారు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ శుభారంభం చేసింది. ఈ ఆసీస్‌ ప్లేయర్‌ 6-1, 6-7(1), 6-1తో సువారెజ్‌ నవారో (స్పెయిన్‌)పై నెగ్గింది. బార్టీకి సువారెజ్‌ గట్టి పోటీనే ఇచ్చి రెండో సెట్‌ను టైబ్రేక్‌లో గెలుచుకుంది. కానీ, మూడో సెట్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బార్టీ జోరు ముందు సువారెజ్‌ నిలవలేకపోయింది. చెక్‌ రిపబ్లిక్‌ భామ ప్లిస్కోవా 7-5, 6-4తో జిదానసెక్‌పై, జర్మనీ తార కెర్బర్‌ 6-4, 6-3తో స్టజనోవిచ్‌ (సెర్బియా)పై, గ్రీస్ క్రీడాకారిని స‌క్కారి 6-1, 6-1తో అరంట‌కా్స‌రుస్‌పై, ఎలీన్ 6-1, 6-3తో హ‌రీట్ డార్ట్‌పై నెగ్గారు. 

ఇక, కెరీర్‌లో 23వసారి వింబుల్డన్‌ బరిలోకి దిగిన 41 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌ 7-5, 4-6, 6-3తో బుజరెస్కూ (రొమేనియా)పై గెలిచింది. మొత్తంగా వీనస్‌ 90వ సారి గ్రాండ్‌స్లామ్‌ బరిలో నిలిచింది. ఇక, మహిళల వరల్డ్‌ నెంబర్‌-3 సిమోనా హలెప్‌, పురుషుల్లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ కైవసం చేసుకున్న స్విట్జర్లాండ్‌ స్టార్‌ స్టాన్‌ వావ్రింకా గాయాల సమస్యలతో ఒలింపిక్స్‌ రేసు నుంచి తప్పుకుంటున్న‌ట్టు ప్రకటించారు.





ఆన్‌లైన్ నిందితుడు...ఫేస్‌బుక్ ప్రేమ....చివరికి..!

పెళ్లికి ముందే తల్లవుతున్న హీరోయిన్.. !

నారప్ప విడుదలపై అభిమాని నిరాహార దీక్ష.. !

ఊపిరిపీల్చుకునే లోపే.. మళ్లీ టెన్షన్..!

దారుణం: డబ్బుల కోసం మిత్రుడిని చంపిన స్నేహితులు..!

పవన్ కళ్యాణ్ పేరులో మార్పులు చేసిన బండ్ల గణేష్ !

హర్డిల్స్‌లో మెక్‌లాలిన్‌ వరల్డ్‌ రికార్డు

వింబుల్డన్‌లో జొకో, సబలెంకా ముందంజ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sanjay]]>