SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitya389bf08-59ca-425f-94cd-b796df00cffc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitya389bf08-59ca-425f-94cd-b796df00cffc-415x250-IndiaHerald.jpgభారతదేశం దేవాలయాలకు పెట్టింది పేరు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాలు సైతం ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా భక్తుల కోలాహలంతో కళకళలాడుతున్నాయి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయిSPIRITUALITY{#}Madhya Pradesh - Bhopal;history;Ghee;oil;Aqua;District;Coronavirusఆ గుడిలో దీపం ఎప్పటికీ ఆరిపోదట... ఎక్కడో తెలుసా ?ఆ గుడిలో దీపం ఎప్పటికీ ఆరిపోదట... ఎక్కడో తెలుసా ?SPIRITUALITY{#}Madhya Pradesh - Bhopal;history;Ghee;oil;Aqua;District;CoronavirusWed, 30 Jun 2021 08:06:58 GMTభారతదేశం దేవాలయాలకు పెట్టింది పేరు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాలు సైతం ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా భక్తుల కోలాహలంతో కళకళలాడుతున్నాయి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వింతైన దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దీపాన్ని వెలిగించాలి అంటే నూనె లేదా నెయ్యి అవసరం. కానీ ఈ దేవాలయంలో మాత్రం దీపాన్ని నీటితోనే వెలిగిస్తారు. ఆ దీపం కూడా ఎంతో కాంతివంతంగా వెలుగును వెదజల్లడమే కాకుండా అసలు కొండ ఎక్కదు అట, అదే అక్కడి ప్రత్యేకత. అదే గడియాఘాట్ మాతాజీ మందిరం.
ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది అంటే. మధ్యప్రదేశ్ లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ లోని నది ఒడ్డున ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఈ గుడిలో కళ్లకు కనిపించే ఎన్నో వింతలు భక్తులకు కనువిందు చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ గుడిలోని దీపం నెయ్యితోనో లేదా నూనె తోనో కాకుండా నీటితోనే వెలుగుతుంది. అంతే కాకుండా ఐదేళ్ల నుంచి ఆ దీపం కొండెక్కకుండా వెలుగుతూనే ఉంది. ఈ ప్రతిష్టాత్మకమైన దేవాలయం నదీ తీరంలో ఉండడం చేత వర్షకాలం వచ్చిందంటే పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అందుకే వర్షాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు.
వర్షాలు తగ్గి నీటి మట్టం తగ్గిన తర్వాత తిరిగి మళ్లీ నవరాత్రులకే ఈ ఆలయాన్ని తెరుస్తారు. కానీ ఆ దేవాలయంలో దీపం మాత్రం అప్పటి కూడా ఆరక పోవడం గమనార్హం. ఇప్పటికీ ఈ వింతను ఎవరూ చేధించలేక పోయారు. ఇది ఒక దైవ సృష్టిగా ఆలయం యొక్క మహిమగా భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం వీక్షకులకు కూడా ఒక చూడ చక్కని ప్రదేశం. చుట్టూ ఎంతో అందమైన పరిసరాలతో భక్తులకు కనువిందు చేస్తోంది ఈ ఆలయం. వీలైతే కరోనా తగ్గిన తరువాత మీరు కూడా వెళ్లి చూసి తరించండి.