SportsSanjayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kyle-jamieson-e434f6a0-3783-428e-b1a6-79fb723de1ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kyle-jamieson-e434f6a0-3783-428e-b1a6-79fb723de1ef-415x250-IndiaHerald.jpgవరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ క్రీజులో పాతుకుపోకుండా అవుట్‌ చేసిన న్యూజిలాండ్‌ పేసర్‌ జేమిసన్‌ ఉత్కంఠ తట్టుకోలేక ఆఖరి రోజు బాత్‌రూమ్‌లో దాక్కున్నాడంటా. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత్‌ను చావుదెబ్బ కొట్టిన ఈ పొడగరి పేసర్‌ మొత్తంగా ఏడు వికెట్ల నేలకూల్చి బ్లాక్‌క్యాట్స్‌ విజయంలోkyle jamieson;{#}New Zealand;Audi;televisionజేమిస‌న్ బాత్‌రూమ్‌లో దాక్కున్నాడంటా!జేమిస‌న్ బాత్‌రూమ్‌లో దాక్కున్నాడంటా!kyle jamieson;{#}New Zealand;Audi;televisionWed, 30 Jun 2021 01:54:26 GMTవరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ క్రీజులో పాతుకుపోకుండా అవుట్‌ చేసిన న్యూజిలాండ్‌ పేసర్‌ జేమిసన్‌ ఉత్కంఠ తట్టుకోలేక ఆఖరి రోజు బాత్‌రూమ్‌లో దాక్కున్నాడంటా. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత్‌ను చావుదెబ్బ కొట్టిన ఈ పొడగరి పేసర్‌ మొత్తంగా ఏడు వికెట్ల నేలకూల్చి బ్లాక్‌క్యాట్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను వణికించిన జేమిసన్‌ మ్యాచ్‌ చివరి రోజు టెన్షన్‌ భరించలేక కొద్దిసేపు బాత్‌రూమ్‌లో దాక్కోవాల్సి వచ్చిందని తెలిపాడు.

‘ఇంత నరాలు తెగే ఉత్కంఠతో నా కెరీర్‌లో ఎప్పుడూ మ్యాచ్‌ చూడలేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చుని మేం టీవీల్లో మ్యాచ్‌ వీక్షిస్తున్నాం. అయితే, మైదానానికి, ప్రత్యక్ష ప్రసారానికి కాస్త ఆలస్యం ఉండడంతో బాల్‌ టూ బాల్‌కి టెన్షన్‌ రెండింతలు అవుతుంది. ఎందుకంటే భారత అభిమానులు బంతి బంతికీ గోల గోల చేసేవారు. దీంతో వికెట్‌ పడిందేమోనని అనుమానంతో టీవీ ముందు నుంచి లేచి బయటకి వచ్చి చూసేవాణ్ణి. తీరా చూస్తే అక్కడ బ్యాట్స్‌మన్‌ బంతిని అడ్డుకోవడమో లేదా సింగిల్‌ తీయడమో జరిగేది. దీంతో కాస్త ప్రశాంతత కోసం పలుమార్లు బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడంతా నిశ్శబ్దంగా ఉండడంతో కొద్దిసేపు ఉండి వచ్చేవాణ్ణి. 

అయితే ఊహించినట్టుగానే ఒత్తిడిని తట్టుకుంటూ మా కెప్టెన్‌ కూల్‌ కేన్‌ విలియమ్సన్‌, వెటరన్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. మేము వరల్డ్‌ టెస్టు చాంపియన్స్‌ అవ్వగానే డ్రెసింగ్‌ రూమ్‌లో కోలాహలం మొదలైంది. ఆటగాళ్లంతా ఎగిరి గెంతారు’ అని ఈ టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన జేమిసన్‌ తెలిపాడు. ఇక‌, వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ విజ‌యంతో న్యూజిలాండ్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 123 పాయింట్ల‌తో అగ్ర‌స్థానాన్ని ప‌దిలం చేసుకోగా భార‌త్ 121 పాయింట్ల‌తో రెండో స్థానంలో నిలిచింది.





వాళ్లు తాగి ఉన్నారా! ఏంటి?

సిసి టివి ఫుటేజ్ విడుదల.. యాక్సిడెంట్ ఎంత ఘోరమో?

ప్ర‌కాష్‌రాజ్‌పై "కోట" ఆగ్ర‌హం?

2020 జాతీయ గణాంకాల దినోత్సవం ప్రత్యేకతలివే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sanjay]]>