PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6006ce74-465f-4e4b-9cee-8050987c78d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6006ce74-465f-4e4b-9cee-8050987c78d3-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ కు వినమ్రతతో నవ సూచనలు పేరుతో లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు తన రెండో లేఖ సంధించారు. ఈసారి ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు జగన్ ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం కింద చేపట్టిన పనులకు మీరు ఇప్పటి వరకూ కూలి బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. రఘురామ తన లేఖలో ఇంకా ఏం రాశారంటే..” గ్రామీణ నిరుపేద కూలీలకు చెల్లించాల్సిన కూలి డబ్బు బకాయిలుJAGAN{#}Mohandas Karamchand Gandhi;Kanna Lakshminarayana;Father;March;king;MP;Letter;Jagan;central government;High court;Governmentజగన్ గాంధీని అవమానిస్తున్నారా..? రఘురామ అనుమానం..?జగన్ గాంధీని అవమానిస్తున్నారా..? రఘురామ అనుమానం..?JAGAN{#}Mohandas Karamchand Gandhi;Kanna Lakshminarayana;Father;March;king;MP;Letter;Jagan;central government;High court;GovernmentWed, 30 Jun 2021 09:00:00 GMTసీఎం జగన్ కు వినమ్రతతో నవ సూచనలు పేరుతో లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు  తన రెండో లేఖ సంధించారు. ఈసారి ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు జగన్ ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం కింద చేపట్టిన పనులకు మీరు ఇప్పటి వరకూ కూలి బకాయిలు కూడా చెల్లించలేదన్నారు.


రఘురామ తన లేఖలో ఇంకా ఏం రాశారంటే..” గ్రామీణ నిరుపేద కూలీలకు చెల్లించాల్సిన కూలి డబ్బు బకాయిలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పడం.. దానిపై రాష్ట్ర హైకోర్టు మండిపడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద నిధులు లేవని చెప్పడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆక్షేపణ కూడా వ్యక్తం చేసింది. 2018-19 సంవత్సరానికి కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు అనే ప్రశ్నలను కూడా రాష్ట్ర హైకోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సంధించింది.”

 
"రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని చెబుతూ... గ్రామీణ పేదలకు బిల్లులు చెల్లించక పోవడం జాతి పిత మహాత్మా గాంధీ ఆలోచనలకు పూర్తిగా భిన్నమైనది. విరుద్ధమైనది. 2018-19 ఆర్ధిక సంవత్సరం నుంచి 2020- 21 ఆర్ధిక సంవత్సరం మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకం కింద మొత్తం రూ.1,12,443.9 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు 2021 మార్చి 31 వరకూ ఉన్న సమాచారం. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 9.21% రూ.10,365.5 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందింది. 2018-19 సంవత్సరానికి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం రూ.1500 కోట్ల కన్నా తక్కువే అన్నారు రఘురామ.

" గత రెండు సంవత్సరాలుగా వస్తున్న ఈ నిధులన్నీ ఏమైనాయని అడుగుతున్న ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. ఈ నిధులన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఎకౌంట్ లో వేసుకున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశంపై తదుపరి వాయిదాకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరింత కూలంకషంగా పరిశీలన చేయాలని సూచించారు. గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని సరిగ్గా అమలు చేయకుండా ఆయన్ను అవమానిస్తున్నారని లేఖలో రాశారు.  





"ఎఫ్ 3" మూవీ నుండి షాకింగ్ న్యూస్ ?

ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ... జ‌గ‌నే టార్గెట్ ?

వ్యాక్సిన్ కోసం వెళ్తే.. కుక్కకాటు టీకా వేసారు.. చివరికి?

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. నీటి వాటాల విషయంలో.. ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఉత్తుత్తి యుద్ధమేనట. ఏపీకి జగన్ వంటి నాయకుడే సీఎంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారట.

గుడ్ న్యూస్ : ఆ రెండు వేరియంట్లపై కోవాక్సిన్ భేష్?

జగన్ గాంధీని అవమానిస్తున్నారని రఘురామ అంటున్నారు. ఆయన పేరుతో ఉన్న పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని లేఖ రాశారు.

రాజోరి తాజా లేఖ లెక్కలు చెప్పాలట!

బాధ్యత గల పత్రికాధినేత రాధాకృష్ణ తన వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ను ఏదో విధంగా ప్రజలను చులకన చేసేందుకు, ఆయన్ను గద్ద దించి చంద్రబాబును సీఎం చేయాలని ఆలోచనతో రాతలు రాస్తున్నారని ఆళ్ల నాని అన్నారు.

జగన్ ఇప్పటికీ జీసస్‌తో, వైఎస్‌తో మాట్లాడతాడా..? ఏంటీ రాతలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>