PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpb259e7a4-db2a-4217-bc43-ff657f55442e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpb259e7a4-db2a-4217-bc43-ff657f55442e-415x250-IndiaHerald.jpgదీనికితోడు. చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామిల దూకుడు చూస్తున్న రెడ్డ‌ప్ప‌.. అయ్యో.. నేను కూడా ఎమ్మెల్యే అయి.. ఏ మంత్రి ప‌ద‌వో ద‌క్కించుకుంటే.. బాగుండేది క‌దా! అని లోలోన భావిస్తున్నార‌ని.. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గం ద్వారా బ‌య‌ట‌కు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. మంత్రులు పాల్గొనే ప్ర‌తికార్య‌క్ర‌మంలోనూ పాల్గొంటు న్నారు. అదే స‌మ‌యంలో కుప్పం స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రెడ్డ‌ప్ప చ‌క్రం తిప్పుతున్నారు. అధికారుల‌ను త‌న చేతిలో పెట్టుకున్నార‌నే వాద‌న కూడా విysrcp{#}kuppam;Dookudu;MLA;Chittoor;Minister;Partyవైసీపీ ఎంపీగారి ఎమ్మెల్యే కోరిక‌.. నెర‌వేరుతుందా..?వైసీపీ ఎంపీగారి ఎమ్మెల్యే కోరిక‌.. నెర‌వేరుతుందా..?ysrcp{#}kuppam;Dookudu;MLA;Chittoor;Minister;PartyWed, 30 Jun 2021 08:05:00 GMTఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా విజయం ద‌క్కించుకున్నారు. త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే.. ఎంపీగా క‌న్నా.. ఎమ్మెల్యే అయితేనే బెట‌ర్ అని, అప్పుడు రాష్ట్ర పాలిటిక్స్‌లో, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో మ‌రింత ప‌ట్టు బిగించ‌వ‌చ్చ‌ని త‌ల‌పొస్తున్నా రట‌. ఆయ‌నే చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌. ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఆయ‌న ఇదే ఆలోచ‌న‌తో ఉన్నార‌ని అనుచ‌రులు స‌హా జిల్లాకు చెందిన కీల‌క నేత‌లు కూడా చెబుతున్నారు.ఇక‌, రెడ్డ‌ప్ప వ్య‌వ‌హారం చూసినా.. ఇదే నిజ‌మ‌ని అనిపిస్తోంది. చిత్తూరు ఎంపీనే అయినా.. ఆయ‌న కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు,  ఇత‌ర‌త్రా అంశాల‌పై కంటే కూడా రాష్ట్ర సర్కారు చేస్తున్న ప‌నుల‌పైనే దృష్టి పెడుతున్నారు.

దీనికితోడు. చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామిల దూకుడు చూస్తున్న రెడ్డ‌ప్ప‌.. అయ్యో.. నేను కూడా ఎమ్మెల్యే అయి.. ఏ మంత్రి ప‌ద‌వో ద‌క్కించుకుంటే.. బాగుండేది క‌దా! అని లోలోన భావిస్తున్నార‌ని.. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గం ద్వారా బ‌య‌ట‌కు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. మంత్రులు పాల్గొనే ప్ర‌తికార్య‌క్ర‌మంలోనూ పాల్గొంటు న్నారు. అదే స‌మ‌యంలో కుప్పం స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రెడ్డ‌ప్ప చ‌క్రం తిప్పుతున్నారు. అధికారుల‌ను త‌న చేతిలో పెట్టుకున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. అంటే.. ఆయ‌న అప్ప‌క‌టిత‌ మంత్రి మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా ఉంది.

అయితే.. ప్ర‌స్తుతం ఎంపీగా ఉంటూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. గ‌తంలోనూ క‌ర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుక కూడా ఎమ్మెల్యేగా వెళ్తాను అంటే..స‌సేమిరా అన్న జ‌గ‌న్‌.. ఆమె పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అయిన‌ప్ప‌టికీ.. త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోలేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడు రెడ్డ‌ప్ప ఆశ‌ను జ‌గ‌న్ ఏమేర‌కు తీరుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం జిల్లాపై మంత్రులు పెద్దిరెడ్డి, నారాయ‌ణ‌స్వామి హ‌వా న‌డుస్తున్న నేప‌థ్యంలో ముఖ్యంగా పెద్దిరెడ్డి నిర్ణ‌యం మేర‌కే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రెడ్డ‌ప్ప‌కు ఎమ్మెల్యే ఆశ నెర‌వేర‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రెడ్డ‌ప్ప‌కు ఛాన్స్ ఇస్తే.. జిల్లాలో త‌న‌ను అధిగ‌మించే అవ‌కాశం ఉంటుంద‌ని పెద్దిరెడ్డి యోచించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదీ.. సంగ‌తి..!

 



తెలంగాణ వైఎస్సార్ పార్టీకి లైన్ క్లియర్..!

ఫోన్లో కూడా దొర‌క‌ని కృష్ణా వైసీపీ ఎమ్మెల్యే ?

కైక‌లూరు ఎమ్మెల్యే దూలం ఫోన్లో కూడా కార్య‌క‌ర్త‌ల‌కు దొర‌క‌ట్లేదా..!

రాజోరి తాజా లేఖ లెక్కలు చెప్పాలట!

జగన్ ఇప్పటికీ జీసస్‌తో, వైఎస్‌తో మాట్లాడతాడా..? ఏంటీ రాతలు..?

ఎమ్మెల్యే సీటుపై క‌న్నేసిన వైసీపీ ఎంపీ రెడ్డ‌ప్ప‌

సాధన దీక్షను లైట్ తీసుకున్న లోకేష్.. కారణం ఏంటి..?

వావ్.. ఇక ఏపీకి పరిశ్రమలే పరిశ్రమలు..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పవన్ ప్రత్యర్ధికి అదే ప్లస్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>