MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tagc34462e5-b2d2-421f-a3d2-74255e0e44a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tagc34462e5-b2d2-421f-a3d2-74255e0e44a2-415x250-IndiaHerald.jpgభార‌త‌దేశంలో ఏ భాషా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే లేనివిధంగా అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే క‌థానాయ‌కులంతా మ‌న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే ఉన్నారు. వీరిని చూసి పారితోషికం కోసం తెలుగు సినిమాల్లో న‌టించ‌డానికి దేశ‌వ్యాప్తంగా ఉన్న న‌టీన‌టులు ప్రాధాన్య‌మిస్తుంటారు. పారితోషికం కోస‌మే తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నామ‌ని బ‌హిరంగంగా చెప్పిన ప‌ర‌భాషా న‌టులు కూడా ఉన్నారు. అలాంటి మ‌న క‌థానాయ‌కుల ద‌గ్గ‌ర ల‌క్ష రూపాయలు లేవంటే ఆశ్చ‌ర్య‌మేస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌లో స‌భ్య‌త్వం తీసుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకtag{#}Telugu;Hanu Raghavapudi;Telangana;Cinema;Bharatiya Janata Partyమ‌న తెలుగు హీరోలు.. క‌డు బీద‌వారు సుమా!!మ‌న తెలుగు హీరోలు.. క‌డు బీద‌వారు సుమా!!tag{#}Telugu;Hanu Raghavapudi;Telangana;Cinema;Bharatiya Janata PartyWed, 30 Jun 2021 14:20:12 GMT
భార‌త‌దేశంలో ఏ భాషా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే లేనివిధంగా అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే క‌థానాయ‌కులంతా మ‌న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే ఉన్నారు. వీరిని చూసి పారితోషికం కోసం తెలుగు సినిమాల్లో న‌టించ‌డానికి దేశ‌వ్యాప్తంగా ఉన్న న‌టీన‌టులు ప్రాధాన్య‌మిస్తుంటారు. పారితోషికం కోస‌మే తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నామ‌ని బ‌హిరంగంగా చెప్పిన ప‌ర‌భాషా న‌టులు కూడా ఉన్నారు. అలాంటి మ‌న క‌థానాయ‌కుల ద‌గ్గ‌ర ల‌క్ష రూపాయలు లేవంటే ఆశ్చ‌ర్య‌మేస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌లో స‌భ్య‌త్వం తీసుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. ల‌క్ష రూపాయ‌లు క‌డితే స‌భ్య‌త్వం ఇస్తారు. కానీ ఆ రూ.ల‌క్ష మ‌న‌వారిద‌గ్గ‌ర లేవు..!!

స‌భ్య‌త్వ‌మున్న‌వారే లేరు..!!
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తిస్తోన మా ఎన్నిక‌ల్లో ఐదుగురు న‌టులు అధ్యక్ష స్థానానికి పోటీప‌డుతున్నారు. ప్ర‌కాష్‌రాజ్ ఇప్ప‌టికే త‌న ప్యాన‌ల్‌ను ప్ర‌క‌టించేశారు. మంచు విష్ణు, జీవిత‌, హేమ‌, సీవీల్ న‌ర‌సింహారావు కూడా పోటీలో ఉన్నారు. తెలంగాణ వాదం వినిపిస్తానంటున్న సీవీఎల్‌కు బీజేపీ మ‌హిళానేత విజ‌య‌శాంతి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇంత‌టి హంగామా మ‌ధ్య మ‌న క‌థానాయ‌కులెంద‌రికి మాలో స‌భ్య‌త్వ‌ముంది అంటే స్ప‌ష్ట‌మైన స‌మాధానం రావ‌డంలేదు. కోట్ల రూపాయ‌ల రెమ్యునరేషన్‌ తీసుకునే వారంతా లక్ష రూపాయలు చెల్లించి సభ్యత్వం ఎందుకు తీసుకోలేకపోతున్నారో వారికే తెలియాలి.

కేవ‌లం 900 పై చిలుకు.. అంతే!!
వంద‌ల సంఖ్య‌లో, వేల సంఖ్య‌లో తార‌లున్న సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌భ్య‌లుంతా క‌లిపితే కేవ‌లం వెయ్యిలోపే ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య‌క‌ర‌మైన ప‌రిస్థితిఓ అర్థం చేసుకోవ‌చ్చ‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. ‘మా’ అసోసియేషన్‌లో 900 పైచిలుకు మాత్ర‌మే స‌భ్యులున్నారు. గత ఎన్నికల సమయానికి 750 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 450 నుంచి 470 ఓట్లే పోల‌య్యాయి. ఎవ‌రూ ఓటు వేయ‌లేదు. సాధారణ ఎన్నికల సమయంలో ‘ఓటు హక్కు వినియోగించుకోండి’ అంటూ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ ఊద‌ర‌గొట్టే తార‌లు త‌మ పుట్టినిల్లు లాంటి మాలో మాత్రం ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డంలేదు. దీనిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా మ‌న క‌థానాయ‌కులెవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు. అలాగే ప‌ర‌భాష‌ల‌కు చెందిన క‌థానాయిక‌ల‌కు మాలో స‌భ్య‌త్వ‌మివ్వ‌డంలేదు. ఈ నిబంధ‌న ఎందుకు ఉందో మాకే తెలియాలి..!!








వాళ్ల టీకాల‌న్నీ పీకి పీకి మాకివ్వండి..??

సినిమా చూడటానికి వెళ్లి హీరో అయ్యి తిరిగి వచ్చిన నటుడు

కేసీఆర్ విష‌యంలో అదొక్క‌టే ఆలోచిస్తున్నా : సీఎం జ‌గ‌న్

ఇజ్రాయెల్‌లో విడాకుల రేటు అందుకే తక్కువా?

విజయ్ దేవరకొండతో రిలేషన్ పై ఓపెన్ అయిన రష్మీక..!!

రీమేక్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన 9 సినిమాలు..

అక్కడ వైసీపీకి ఛాన్స్ దొరికినట్లేనా...?

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టుల కోసం ఏర్ప‌డిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టినుంచే వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఎత్తుకు పై ఎత్తులు.. వ్యూహాలు.. ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు.. మీడియా స‌మావేశాలు.. ఒక‌రిపై మ‌రొక‌రి ఆరోప‌ణ‌లు చూస్తుంటే వీరంతా న‌టులేనా.. హావ‌భావాల‌తో న‌వ‌ర‌సాల‌ను పండించి ప్ర‌జ‌ల‌ను అల‌రించింది వీరేనా? లేదంటే ఏదైనా రాజ‌కీయ క‌ళాశాల‌లో ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించారా? అనిపించ‌క‌మాన‌దు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు జ‌మిలి ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదుకానీ.. ఒక‌వేళ జ‌రిగితే దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి కోలాహ‌లం ఉంటుందో అంత‌కుమించిన కోలాహ‌లం కేవ‌లం వెయ్యిలోపు స‌భ్యులున్న మాలో జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

టీఆర్ఎస్‌, వైసీపీక‌న్నా కాంగ్రెస్‌దే పైచేయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>