Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mamathab7acd627-5ea2-4dfd-b21f-b61cb81f1738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mamathab7acd627-5ea2-4dfd-b21f-b61cb81f1738-415x250-IndiaHerald.jpgఇటీవలే పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా హాట్ హాట్ గా మారిపోయాయి. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి భారీ మెజారిటీ సాధించి విజయం సాధించింది. ఇక మరోవైపు బీజేపీ తమ సీట్ల సంఖ్యను పెంచుకునీ బలమైన ప్రతిపక్ష పార్టీగా మారి పోయింది. ఇకపోతే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అప్పటి నుంచి ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాMamatha{#}West Bengal - Kolkata;Telangana Chief Minister;politics;Governor;kusuma jagadish;Mamta Mohandas;war;court;Party;Congress;Assembly;Bharatiya Janata Partyతగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ.. గవర్నర్ ని కూడా వదల్లేదు?తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ.. గవర్నర్ ని కూడా వదల్లేదు?Mamatha{#}West Bengal - Kolkata;Telangana Chief Minister;politics;Governor;kusuma jagadish;Mamta Mohandas;war;court;Party;Congress;Assembly;Bharatiya Janata PartyTue, 29 Jun 2021 09:45:00 GMTఇటీవలే పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా హాట్ హాట్ గా మారిపోయాయి. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి.  అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి భారీ మెజారిటీ సాధించి విజయం సాధించింది.  ఇక మరోవైపు బీజేపీ తమ సీట్ల సంఖ్యను పెంచుకునీ బలమైన ప్రతిపక్ష పార్టీగా మారి పోయింది.  ఇకపోతే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అప్పటి నుంచి ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.  ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ అరాచకమే సృష్టిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇప్పటికే కోల్కత్తా నగరాన్ని మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులో కి మార్చాలి అంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.  అదే సమయంలో ఇక ఎన్నికల ముందు తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లోకి వెళ్ళిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  బిజెపికి ఎక్కువ మెజారిటీ వచ్చిన ప్రాంతాలలో ఏకంగా బిజెపి నేతలందరికీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సంచలనం నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఇక ఇటీవలే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ ని కూడా వదల్లేదు.



 కొన్ని రోజుల నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గవర్నర్ జగదీష్ ధన్కర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీష్ ధన్కర్ అవినీతిపరుడని 1996లో హవాలా కేసులో ఆయనపై చార్జిషీటు కూడా దాఖలు అయింది అంటూ విమర్శలు చేశారు మమతా బెనర్జీ. ఇక మమతా విమర్శల పై స్పందించిన గవర్నర్ నా పేరు ఏ ఛార్జిషీటులో లేదని..  ఏ కోర్టు నుంచి కూడా స్టే తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మమత నుంచి ఇలాంటి విమర్శలు  ఊహించలేదు అంటూ వ్యాఖ్యానించారు గవర్నర్. ఇలా ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారిపోయింది.



టీకా లాగానే ఉద్దీపన కూడా.. నమ్మకంతోనే కేంద్రం కనికట్టు..

మరో సరిహద్దు ప్రేమికుడు.. దేశం దాటి వెళ్లి పెళ్లి.. కానీ?

భారత్ సిద్ధమైంది.. అక్కడికి 50 వేల మంది సైన్యం?

ఆ ప‌నిచేశావా.? నీముసుగు తొల‌గిపోతోంది.. !

గోవా వెళ్లాలనుకుంటున్నారా.. గుర్తుంచుకోండి అలా అయితేనే ఎంట్రీ?

కేజ్రీవాల్ అదిరిపోయే హామీ.. గెలిపిస్తే ఉచితంగా?

తెలంగాణ‌లో సూప‌ర్ క్యాస్ట్ స్ట్రాట‌జీ.. ఈ కులానికి చెక్ ప‌డిన‌ట్టే ?

మోడి కేబినెట్లో వైసీపీ మంత్రులు వీళ్లేనా..!

డ్రోన్ వార్ తో భారత్ కు పెనుముప్పు రాబోతోందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>