MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinuvaitlac8e9aa04-ed2a-4594-b6be-67f6d236886b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinuvaitlac8e9aa04-ed2a-4594-b6be-67f6d236886b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్లి ఆ తర్వాత చతికిల లో పడిపోయిన డైరెక్టర్ ఎవరంటే శ్రీనువైట్ల అని చెప్పవచ్చు. నీకోసం సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఆయన మంచి గుర్తింపు సాధించుకోగా ఆ తరువాత రెండు సంవత్సరాలకు ఆయన చేసిన ఆనందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆ తరువాత సొంతం, వెంకీ, అందరివాడు, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశా , దూకుడు, బాద్ షా వంటి చిత్రాలతో తనదైన యాక్షన్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.srinuvaitla{#}Dubai;Aagadu;Mister;Anandam;mahesh babu;Ravi;ravi teja;Comedy;Ram Charan Teja;Blockbuster hit;Director;manchu vishnu;Hero;Cinemaఆ సినిమా ఫ్లాప్ తో ఇప్పటికీ కోలుకోలేకపొతున్నాడు.. పాపం శ్రీనువైట్ల..!!ఆ సినిమా ఫ్లాప్ తో ఇప్పటికీ కోలుకోలేకపొతున్నాడు.. పాపం శ్రీనువైట్ల..!!srinuvaitla{#}Dubai;Aagadu;Mister;Anandam;mahesh babu;Ravi;ravi teja;Comedy;Ram Charan Teja;Blockbuster hit;Director;manchu vishnu;Hero;CinemaTue, 29 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్లి ఆ తర్వాత చతికిల లో పడిపోయిన డైరెక్టర్ ఎవరంటే శ్రీనువైట్ల అని చెప్పవచ్చు. నీకోసం సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఆయన మంచి గుర్తింపు సాధించుకోగా ఆ తరువాత రెండు సంవత్సరాలకు ఆయన చేసిన ఆనందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆ తరువాత సొంతం, వెంకీ, అందరివాడు, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశా , దూకుడు,  బాద్ షా వంటి చిత్రాలతో తనదైన యాక్షన్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

అప్పట్లో స్టార్ హీరోలందరూ శ్రీనువైట్లతో పని చేయాలనుకునేవారు. ఒకటి కాదు మినిమం రెండు సినిమాలు అయినా ఆయనతో చేయాలని హీరోలు ఆశపడుతూ ఉండేవారు. ఆ విధంగానే రవితేజతో మూడు సినిమాలు ఆయన చేయగా, మహేష్ బాబు తో రెండు సినిమాలు చేశారు.  అయితే ఆయన సినిమాల్లో యాక్షన్ కంటే ఎక్కువగా కామెడీ ప్రధానంగానే సాగుతుండడంతో హీరోలు అందరూ ఆయన తో సినిమాలు చేయాలని ఆశ పడుతూ ఉండేవారు. హీరోలను సరికొత్తగా చూపించడంలో శ్రీనువైట్ల ప్రత్యేక శైలి.

అయితే ఆయన చేసిన ఆగడు సినిమా తర్వాత ఆయన కెరీర్ మలుపు తిరిగింది. గతంలో ఎప్పుడు చూడని డౌన్ ఫాల్ ఆయన చూశారు. ఆ సినిమా భారీ ఫ్లాప్ గా మిగిలి పోవడంతో ఆయనకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి హీరోలు కొంత తటపటాయించారు. అయితే ధైర్యం చేసి రామ్ చరణ్ బ్రూస్ లీ ద్వారా అవకాశాన్ని ఇవ్వగా ఆ సినిమాను కూడా హిట్ చేసుకోలేకపోయారు శ్రీనువైట్ల. దాంతో ఆయనకు స్టార్ హీరోల మాట పక్కన పెడితే మినిమం స్థాయి ఉన్న హీరోలు కూడా సినిమాలు ఇవ్వడానికి భయపడ్డారు.  అలా మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్ అవి కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక చేసేదేమి లేక కొంత గ్యాప్ ఇచ్చి సినిమా చేద్దామని ఆగి మంచి కథతో వస్తున్నానని చెప్పి రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేశాడు.  ఆ సినిమా కూడా  ఫ్లాప్ అవడంతో ఆయనకు ఇప్పటి వరకు మరో సినిమా స్టార్ హీరో సినిమా అవకాశం ఇవ్వలేదు. మంచు విష్ణు తో ఢీ అండ్ ఢీ అనే సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం. 



"సలార్" రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ ఇదే..?

'గోవిందుడు అందరివాడేలే' సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..??

బాలయ్య కు ఇక సింహ పదం కలిసి రాదేమో

"నారప్ప" కి సెన్సార్ రిపోర్ట్..!

వాళ్ళు పావలా చేస్తే వీళ్ళు రూపాయ్ యాడ్ చేస్తున్నారు..!

పెళ్లి తర్వాత కూడా రెమ్యూనరేషన్ పెంచుతున్న కాజల్

RRR ను కూడా వదలని సైబరాబాద్ పోలీసులు..

మాకో 'మా' ఉందంటున్న డైరెక్టర్!

మాకో 'మా' ఉందంటున్న డైరెక్టర్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>