PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag57a91d58-b27e-4784-bc2d-a3c95b729083-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag57a91d58-b27e-4784-bc2d-a3c95b729083-415x250-IndiaHerald.jpgఇప్ప‌టివ‌ర‌కు మ‌నం కిలో రెండు రూపాయ‌ల‌కే బియ్యం అంటే ఓటేశాం.. న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం ఉంటుంది అంటే ఓటేశాం.. రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తామంటే ఓటేశాం.. కానీ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ త‌మ పార్టీకి ఓటేస్తే ప్ర‌తి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అర్హులైన‌వారెవ‌రు? కానివారెవ‌రు? అనేది ఉండ‌ద‌ని ప్ర‌తి ఒక్క ఇంటికీ 300 యూనిట్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీకి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోపాటtag{#}Arvind Kejriwal;Punjab;MP;Party;Congressప్ర‌తి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు?ప్ర‌తి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు?tag{#}Arvind Kejriwal;Punjab;MP;Party;CongressTue, 29 Jun 2021 20:38:26 GMT
ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం కిలో రెండు రూపాయ‌ల‌కే బియ్యం అంటే ఓటేశాం.. న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం ఉంటుంది అంటే ఓటేశాం.. రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తామంటే ఓటేశాం.. కానీ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ త‌మ పార్టీకి ఓటేస్తే ప్ర‌తి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అర్హులైన‌వారెవ‌రు?  కానివారెవ‌రు? అనేది ఉండ‌ద‌ని ప్ర‌తి ఒక్క ఇంటికీ 300 యూనిట్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీకి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ, అకాలీద‌ళ్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీ పోటీప‌డ‌నున్నాయి. అకాలీద‌ళ్‌-బీజేపీ మ‌ధ్య పొత్తు లేక‌పోవ‌డంతో ఈ రెండుపార్టీలు ఒంట‌రిగానే త‌ల‌ప‌డి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. ఒక‌ర‌కంగా ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేయ‌డంవ‌ల్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీకి కూడా లాభం చేకూర‌నుంది.

పంజాబ్‌లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆమ్ ఆద్మీ!
ఆమ్ఆద్మీ స్థాపించిన‌ప్పుడు దేశ రాజ‌ధాని ఢిల్లీతోపాటు పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో కూడా పార్టీ బ‌లంగా ఉంది. ఎంపీ సీట్లు గెలుచుకోవ‌డంతోపాటు రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తుందేమోన‌నిపించింది. అయితే  ఢిల్లీలో ప‌రిపాల‌నా ప‌రంగా వేసిన త‌ప్ప‌ట‌డుగుల‌తో క్ర‌మంగా ప‌ట్టు కోల్పోయిన‌ప్ప‌టికీ మంచి ఓటుబ్యాంక్ మాత్రం ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో ఇంటికి ఉచిత విద్యుత్తు ప్ర‌క‌టించిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో కొన్ని నెల‌లుగా నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ధ‌ర్నా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అకాలీద‌ళ్‌, బీజేపీకి ప్ర‌జ‌లు ఓట్లు వేసే ప‌రిస్థితి లేదు. దీంతో ప్ర‌త్యామ్నాయంగా మార‌దామ‌నుకున్న కేజ్రీవాల్ అందుకు అనుగుణంగా ఎన్నిక‌ల పాచిక విసిరారు. ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జాక‌ర్ష‌క ప్ర‌క‌ట‌న‌లేవీ రావ‌నుకునేవారికి ఒక్క‌సారిగా షాకిచ్చారు.

దేశ‌మంతా విస్త‌రించ‌బోతున్న ప‌థ‌కం?
దేశంలో ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌క‌టించే విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందుంటాయి. ఇక్క‌డ ఉచిత విద్యుత్తు ఇచ్చినా అది రైతులకు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అలాంటిది కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న‌తో ఈ ప‌థ‌కాన్ని అన్ని రాష్ట్రాలు అమ‌లుచేసే అవ‌కాశం ఉండొచ్చ‌ని రాజ‌కీయ‌వేత్త‌లంటున్నారు. సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించుకొని అవ‌స‌ర‌మైతే ఇంటికి 100 యూనిట్ల వ‌ర‌కైనా ఉచిత విద్యుత్తు ఈసారి ఎన్నిక‌ల్లో ఇవ్వ‌వ‌చ్చంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఆమ్ ఆద్మీ ఒక్క ప‌త‌కం ప్ర‌క‌ట‌న‌తో దేశ‌మంతా త‌న‌వైపు చూసుకునేట‌ట్లు చేసుకోవ‌డ‌మే కాకుండా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ఒక దిశా నిర్ధేశం చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.












ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ పిటిష‌న్లు విచార‌ణ‌కు వ‌చ్చే స‌మ‌యానికి వెన‌క్కి త‌గ్గుతున్న ప్ర‌భుత్వం వాయిదాలు కోరుతోంది. దేనికైనా వాయిదా ప‌ద్ద‌తుంది అనే కోణంలో ప్ర‌తి పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఎందుకు వాయిదా కోరుతుంద‌నేది అంతుప‌ట్ట‌కుండా ఉంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే నాలుగు కేసులు విచార‌ణ‌కు రాగా.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న న్యాయ‌వాదుల‌ద్వారా స‌మ‌యం కావాలంటూ అభ్య‌ర్థించింది. దీంతో ఈ కేసుల‌న్నీ మూడువారాల‌కు వాయిదా ప‌డ్డాయి.

అయిన‌నూ పోయిరావ‌లె హ‌స్తిన‌కు..!!

2024 పాలిటిక్స్ అంతా మెగా బ్రదర్స్ దేనా... ?

సోనియమ్మ - చిరంజీవి వాయా చంద్రబాబు...?

బ్రతికినన్ననాల్లు ఇలా బ్రతకాలని చూపించారు.. చివరికి..!!

గెలుపు మ‌ర్చిపోయిన ప్లేస్‌లో టీడీపీ సెట్ అవుతుందా?

కాళేశ్వ‌రం ప్రాజెక్టును మూడు సంవ‌త్స‌రాల్లో పూర్తి చేసిన ఘ‌న‌త తెలంగాణదేన‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కోర్కల్ రైతువేదికను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగం గొప్ప ఉపాధి క‌ల్పిస్తోంద‌ని, అద్భుత‌మైన కార్య‌క్ర‌మంగా రైతుబంధు అంద‌రిచేత కొనియాడ‌బ‌డుతోంద‌న్నారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోను రైతుబంధు ప‌థ‌కాన్ని కొన‌సాగించామ‌ని, భార‌తీయ జ‌న‌తాపార్టీ పాలించే రాష్ట్రాల్లో ఎక్క‌డైనా రైతుబంధును అమ‌లు చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు.

కాళేశ్వ‌రం ఘ‌న‌త తెలంగాణ‌దే!!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌తో స‌మావేశ‌మ‌య్యారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో డ్రోన్ల దాడికి సంబంధించిన విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జ‌మ్ములోని వైమానిక స్థావ‌రంలో ఆదివారం తెల్ల‌వారుజామున రెండు డ్రోన్లు బాంబులు జార‌విడిచిన సంగ‌తి తెలిసిందే. రెండు బాంబు పేలుళ్లు సంభ‌వించ‌గా ఒక భ‌వ‌నం పైక‌ప్పుకు రంధ్రం ప‌డింది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>