MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchuvishnufaa5956c-43c1-43cf-a4df-1171ae5ef272-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchuvishnufaa5956c-43c1-43cf-a4df-1171ae5ef272-415x250-IndiaHerald.jpgమా సంస్థ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. అయితే జాతీయ స్థాయి ఎన్నికల వేడిని గుర్తు చేసేలా వ్యూహ ప్రతివ్యూహాలతో కొనసాగుతున్న ఎన్నికల రగడ ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడ సంచలన వార్తలుగా మారుతున్నాయి. ఎప్పుడులేని విధంగా ఈ ఎన్నికల ప్యానల్స్ వెనుక ఒకవైపు చిరంజీవి మరొకవైపు బాలకృష్ణ ఉన్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇండస్ట్రీలోని మరికొందరైతే ప్రస్తుతం మా సంస్థ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్manchuvishnu{#}Chiranjeevi;Balakrishna;manchu vishnu;Industries;Industry;Elections;Service;Telugu;Cinema;Fatherమంచు విష్ణు బహిరంగ లేఖ పై ఆశక్తికర చర్చలు !మంచు విష్ణు బహిరంగ లేఖ పై ఆశక్తికర చర్చలు !manchuvishnu{#}Chiranjeevi;Balakrishna;manchu vishnu;Industries;Industry;Elections;Service;Telugu;Cinema;FatherTue, 29 Jun 2021 08:00:00 GMTమా సంస్థ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. అయితే జాతీయ స్థాయి ఎన్నికల వేడిని గుర్తు చేసేలా వ్యూహ ప్రతివ్యూహాలతో కొనసాగుతున్న ఎన్నికల రగడ ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడ సంచలన వార్తలుగా మారుతున్నాయి.



ఎప్పుడులేని విధంగా ఈ ఎన్నికల ప్యానల్స్ వెనుక ఒకవైపు చిరంజీవి మరొకవైపు బాలకృష్ణ ఉన్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇండస్ట్రీలోని మరికొందరైతే ప్రస్తుతం మా సంస్థ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుని వారికి ఎన్నెన్ని ఓట్లు వస్తాయి అంటూ అప్పుడే అంచనాలు కూడ వేసేస్తున్నారు.



మరొకవైపు ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఒక మహిళను ‘మా’ సంస్థ అధ్యక్షురాలిగా చేయాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులలో మంచు విష్ణు విడుదల చేసిన ఒక బహిరంగ లేఖను చదివిన వారికి మా సంస్థలో పోటీ తప్పదా అన్న సందేహాలు కలగడం సహజం. ‘ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్‌ వేస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా తండ్రి మోహన్‌బాబు ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలయ్యాయి. ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. మీ అందరి సహకారంతో విజయ వంతం కావాలని ఆశిస్తున్నా’ అని మంచు విష్ణు విడుదల చేసిన లేఖను బట్టి జరగబోతున్న మా ఎన్నికలలో పోటీ తప్పదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



ఈ పరిస్థితులు ఇలా ఉండగా వైవిధ్యమైన పాత్రలు పోషించిన సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహారావు కూడ ‘మా’ బరిలో ఉన్నట్లు ప్రకటించడంతో ఎంతమంది అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తారు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు..





ఆహా.. మనోళ్లు ఏం ప్లాన్ వేశారు..!

డైరెక్టర్ల సెలక్షన్ విషయంలో అఖిల్ రూట్ కరెక్టేనా..?

ఓకే ఒక జీవితం.. శర్వానంద్ ఫేట్ మార్చేనా..!

మగధీర -2 సినిమా హీరో ఏవరో తెలుసా ..

ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఏమయిందో..?

మీనాను రిజెక్ట్ చేసిన కమల్.. కారణం అదేనా..?

స్మరణ: స్టార్ హీరోలంతా ఈయన దగ్గరే నట శిక్షణ పొందారు..

ప్రభాస్ రాధే శ్యామ్.. రికార్డులు సలామ్ కొట్టాల్సిందే..!

ఆదిపురుష్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేస్తున్నారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>