MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/is-adipurush-director-making-an-irreparable-mistake9c82fe0c-4073-4321-aa70-22e9de24d3f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/is-adipurush-director-making-an-irreparable-mistake9c82fe0c-4073-4321-aa70-22e9de24d3f9-415x250-IndiaHerald.jpgఆదిపురుష్ గురించి ఓ వార్త ఇపుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాలో మొత్తం నార్త్ వారే యాక్ట్ చేయబోతున్నారనే న్యూస్ దక్షిణాది సినిమా అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. ఇలా చేస్తే ఎలా అంటూ దర్శకుడు ఓం రౌత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం. ఇలాంటి నిర్ణయంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సౌత్ సినీ అభిమానులు కలవరానికి గురవుతున్నారు. ఇక్కడ ఆదిపురుష్ కు ఆదరణ దక్కుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.aadipurush{#}Prabhas;krishnam raju;India;bollywood;Cinema;Bahubali;Director;Hero;News;Darsakuduఆదిపురుష్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేస్తున్నారా...?ఆదిపురుష్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేస్తున్నారా...?aadipurush{#}Prabhas;krishnam raju;India;bollywood;Cinema;Bahubali;Director;Hero;News;DarsakuduTue, 29 Jun 2021 06:31:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై రోజురోజుకూ ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. అందులో నటించేవారి విషయంలో దర్శకుడు ఓం రౌత్ తీసుకుంటున్న నిర్ణయాలు సినీ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ అయిన ఆదిపురుష్ లో మొత్తం ఉత్తరాది నటులనే తీసుకోవాలని భావిస్తుట్టు తెలుస్తోంది. దక్షిణాది జాడ కనిపించకుండానే మొత్తం అక్కడి వారితోనే సరిపెట్టుకునే విధంగా ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం. అలా చేస్తే దక్షిణాదిన ఆ సినిమాకు ఆదరణ దక్కుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నట్టు ఏమని ప్రకటించాడో గానీ యంగ్ రెబల్ స్టార్ అభిమానులతో పాటు.. సినీ అభిమానుల్లో ఆసక్తి చెలరేగింది. ఇక పాన్ ఇండియా మూవీ అనగానే..ప్రభాస్ సినిమాపై ఎన్నోఆశలు పెట్టుకున్నారు సినీజనాలు. బాహుబలి రికార్డ్స్ ను మరిచిపోలేకపోతున్నారు. అంతా బాగుంది కానీ ఒక్క విషయమే దక్షిణాది అభిమాలకు మింగుడుపడని అంశం ఒకటి ఉంది. ఆదిపురుష్ లో మొత్తం ఉత్తరాది నటులను తీసుకుంటున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నప్పుడు సౌత్ కు చెందిన నటులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ దిశగా అడుగులు పడటం లేదనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఆదిపురుష్ లో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్, అభిమన్యుడి పాత్రలో నటిస్తున్న సన్నీసింగ్ ఇద్దరూ బాలీవుడ్ నటులు కావడం విశేషం. ఇక మరో ఇంపార్టెంట్ రోల్ కోసం మరాఠీ నటుడైన దేవ్ దత్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. రామాయణంలో హనుమంతుడి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్యారెక్టర్ కు దక్షిణాది నుంచి ఎవరినైనా తీసుకొని ఉంటే బాగుండేదని సినీ జనాలు చెవులుకొరుక్కుంటున్నారు.

సాధారణంగా బాలీవుడ్ నటులకు దక్షిణాదిన ఆశించినంత ప్రాధాన్యత దక్కదు. అందుకు నిదర్శనం కృతిసనన్. తెలుగులో ఈ అమ్మడు రెండు సినిమాలతో అదృష్టం పరీక్షించుకున్నా నిరాశే ఎదురయింది. ఆమెను మనవాళ్లు ఎప్పుడో మరిచిపోయారు. ఆదిపురుష్ లో మొత్తం ఉత్తరాది నటులను తీసుకోవడం ద్వారా దక్షిణాది సినీ అభిమానులను నిరాశపరిచినట్టే అవుతోంది. పైగా అందులో హీరో ప్రభాస్ అయినా.. మిగతా వారిని అంతగా ఆదరించకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అందులో పనిచేసే టెక్నీషియన్లు కూడా అక్కడి వారే కావడంతో మొత్తం బాలీవుడ్ ఫ్లేవర్ గానే ఆసినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఓం రౌత్ సినిమాను ఇక్కడి వారు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.





Samsung Galaxy M32 ఎలా ఉందంటే...?

టీవీ: బిగ్ బాస్ సీజన్-5 కి సిద్ధమవుతున్న కంటెస్టెంట్స్..

మంచి ఫాంలో ఉన్న తమన్ కు మెగాస్టార్ ఛాన్స్.. ఇక చూడండి బాసు అంటూ..!

'రామ్ - లింగుస్వామి' ప్రాజెక్ట్ మరో ఇస్మార్ట్ శంకర్ కానుందా..?

థర్డ్ వేవ్ పేరు చెప్పి.. ప్రజలను భయపెట్టొద్దు : కేంద్ర మంత్రి

అన్న మాసు.. తమ్ముడు క్లాసు.. అదరగొడుతున్న దేవరకొండ బ్రదర్స్..!

విక్రమ్- సదా రిలేషన్ షిప్.. షోలో అసలు విషయం చెప్పేసిన హీరోయిన్?

ఆ ఇద్దరు నాతో రొమాన్స్ చేసేందుకు భయపడ్డారు : తాప్సీ

'ఆచార్య' నుంచి మరో సర్ ప్రైజ్.. ఈసారి చరణ్ వంతు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>