PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-69684fe0-251e-4250-a09c-75c00b5d8507-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-69684fe0-251e-4250-a09c-75c00b5d8507-415x250-IndiaHerald.jpgభారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ కామ్రేడ్ హిడ్మా, కామ్రేడ్ శారద కరోణ వైరస్ తో చనిపోలేదని, ఆ ప్రచారం అంతా అబద్ధమని అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. పాలకులు, పోలీసులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈనెల 28న చేసిన ప్రచారం దుష్ప్రచారమేనని దాన్ని నమ్మకండని అన్నారు. కామ్రేడ్ శారద, హిడ్మా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం, పాలకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారన్నారు. వాటిని నమ్మి కుటుంబ సభ్యులు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి విషయాలనుPolitical {#}Sharada;hari;hari music;Murder.;central government;police;Telangana;Party;Jaganకామ్రేడ్ హిడ్మా, శారదాలు కరోనాతో చనిపోయారనేది అబద్దమేనా..?కామ్రేడ్ హిడ్మా, శారదాలు కరోనాతో చనిపోయారనేది అబద్దమేనా..?Political {#}Sharada;hari;hari music;Murder.;central government;police;Telangana;Party;JaganTue, 29 Jun 2021 11:43:25 GMTభారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ కామ్రేడ్ హిడ్మా, కామ్రేడ్ శారద కరోణ వైరస్ తో చనిపోలేదని, ఆ ప్రచారం అంతా అబద్ధమని  అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. పాలకులు, పోలీసులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈనెల 28న చేసిన ప్రచారం  దుష్ప్రచారమేనని దాన్ని నమ్మకండని అన్నారు. కామ్రేడ్ శారద, హిడ్మా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

 ప్రభుత్వం, పాలకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని  వారన్నారు. వాటిని నమ్మి కుటుంబ సభ్యులు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి విషయాలను పార్టీ అధికారికంగా తెలియజేస్తుందని, అప్పుడు మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు కరోణ బారినపడి  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దళ సభ్యులను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. బయటకు వస్తే మెరుగైన వైద్యం అందిస్తామని అబద్ద ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి కామ్రేడ్ గంగల్ ను, శోభ్రయిలను తీవ్ర అనారోగ్యంతో దవాఖానకు పంపిస్తే  పక్కా సమాచారంతో అరెస్టు చేసి వారికి వైద్యం అందించకుండా హత్య చేశారని, ఈ కుటిల నీతిమాలిన కసాయి ప్రభుత్వాలు, పోలీసులు మళ్లీ ప్రజలను నమ్మించడానికి శ్రేయోభిలాషిలాగా నీతులు పలుకుతున్నారు.

అదేవిధంగా ప్రజల కోసం పోరాడుతున్న వారికి వైద్య సదుపాయాలు అందించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని వారన్నారు. ఈ కారణంగానే కామ్రేడ్ హరి భూషణ్, భరతక్కలకు సరైన వైద్యం అందించలేక పోయామన్నారు. కామ్రేడ్స్ చనిపోయే ఒకరోజు ముందు ఇన్ఫార్మర్ల ద్వారా పక్కా సమాచారంతో  వందలాది మంది పోలీసులు దాడి చేయడానికి ఆపరేషన్ చేపట్టారన్నారు. మా ప్రజల ద్వారా పోలీసులు వస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకొని మా కామ్రేడ్స్ ని కాపాడుకోవడానికి వారిని మోసుకొని తిరిగామన్నారు. వారిని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేశామని,  చివరికి దూరమయ్యారని తెలిపారు. అదే మాదిరిగా  కామ్రేడ్ హిడ్మా, శారద చనిపోయారని  ప్రచారం చేస్తూ పెద్ద గందరగోళం సృష్టిస్తున్నారని అదంతా అబద్ధమని  మావోయిస్టు పార్టీ తెలిపింది.



జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన ఈ దిగ్గ‌జాల అడ్ర‌స్ చెప్ప‌రూ...!

2020 జాతీయ గణాంకాల దినోత్సవం ప్రత్యేకతలివే ?

సినిమాటోగ్రఫీ చట్ట సవరణ పై మండిపడ్డ లోకనాయకుడు..?

దిశ యాప్ అన్న‌లా ప‌నిచేస్తుంది : సీఎం

ఏపీలో కాంగ్రెస్‌కు కూడా "ప్ర‌త్యేక హోదా" ఉండాలి?

నియోజ‌క‌వ‌ర్గానికే గుడ్ బై చెప్పేసిన టీఆర్ఎస్ నేత ?

భార్యను చెల్లి అని చెప్పి వేరే పెళ్లి చేశాడు భర్త.. చివరికి..?

రేవంత్ ఎంట్రీతోనే ఉత్త‌మ్‌కు అదిరిపోయే షాక్‌..!

దారుణం: డబ్బుల కోసం మిత్రుడిని చంపిన స్నేహితులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>