PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3a3fc7bd-bd9b-4a76-94bd-3930c2f7196f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3a3fc7bd-bd9b-4a76-94bd-3930c2f7196f-415x250-IndiaHerald.jpgఏ పార్టీ అయినా కొత్తగా అధికారంలోకి వస్తే ముందు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు గతంలో వైఎస్సార్.. ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలని ప్రవేశ పెట్టారు. ఈ రెండిటిని అటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాలు గతంలో కొనసాగించాయి.tdp{#}March;KCR;jayalalitha;Party;Jagan;TDP;CBN;Government;Coronavirusఆ విషయంలో బాబు కరెక్ట్...మరి జగన్‌ ఏం చేస్తారో?ఆ విషయంలో బాబు కరెక్ట్...మరి జగన్‌ ఏం చేస్తారో?tdp{#}March;KCR;jayalalitha;Party;Jagan;TDP;CBN;Government;CoronavirusTue, 29 Jun 2021 16:00:00 GMTపార్టీ అయినా కొత్తగా అధికారంలోకి వస్తే ముందు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు గతంలో వైఎస్సార్.. ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలని ప్రవేశ పెట్టారు. ఈ రెండిటిని అటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాలు గతంలో కొనసాగించాయి.


కానీ గత ఎన్నికల్లో గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చాలా పథకాలని కొనసాగించలేదు. రైతులకు ముఖ్యమైన రుణమాఫీ లాంటి పథకాల ఊసే తీయలేదు. ఇలా చాలా పథకాలకు జగన్ బ్రేక్ వేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు రూ. 5కే భోజనం పెట్టే కార్యక్రమం చేసింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించింది.


ఈ క్యాంటీన్ వల్ల పేదలు, కూలీలు లబ్ది పొందారు. అలాగే నాణ్యమైన ఆహారమే అందించారని అప్పటిలో బాగానే టాక్ వచ్చింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ క్యాంటీన్లని మూసివేశారు. దీంతో చాలాచోట్ల క్యాంటీన్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కనీసం రంగులు, పేరు మార్చి పేదలకు ఆహారం అందించే కార్యక్రమం చేయలేదు.


దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు పోరాడుతూనే వచ్చారు. కరోనా సమయంలో పేదలకు ఉపయోగపడేది అని, వెంటనే క్యాంటీన్లని తెరపించాలని కోరారు. కానీ జగన్ మాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంపై తాజాగా కూడా చంద్రబాబు క్యాంటీన్లు తెరపించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన స్టాలిన్, గతంలో జయలలిత బొమ్మతో అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ క్యాంటీన్లని అలాగే కొనసాగిస్తున్నారని, కానీ జగన్ మాత్రం పేద ప్రజల కడుపుపై కొట్టారని అంటున్నారు.


వాస్తవానికి చెప్పాలంటే క్యాంటీన్లు ఉంటే పేద ప్రజలకు బాగా ఉపయోగపడేవి. కనీసం పేరు మార్చి వాటిని కొనసాగించిన బాగుండేది అని చాలామంది ప్రజలు భావించారు. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. మరి భవిష్యత్‌లోనైనా క్యాంటీన్లని తెరపించి పేద ప్రజలకు ఆహారం అందిస్తారేమో చూడాలి.




కాళేశ్వ‌రం ఘ‌న‌త తెలంగాణ‌దే!!

"సలార్" రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ ఇదే..?

ఎమ్ఆర్ఓపై డీజిల్ పోసిన రైతులు.. కాని అంతలోనే?

కల్యాణలక్ష్మి డబ్బుల కోసం వీఆర్వో కక్కుర్తి.. ఏం చేసాడో తెలుసా?

కేశినేని శ్వేత టార్గెట్ పెద్దదే!

అశోక్ మోసం చేశారు...మరి ఆ వైసీపీ ఎంపీ ఏం చేశారు?

చెల్లి పెళ్లి.. జ‌ర‌గాలి మ‌ళ్లీ మ‌ళ్లీ..!

సిక్కు మ‌హిళ‌ల మ‌త‌మార్పిడి..కిష‌న్ రెడ్డి సీరియ‌స్.. !

బ్రేకింగ్ : T20 వరల్డ్ కప్ అక్కడే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>