MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babudbb1b85c-bd41-47f2-b1e2-05032028d508-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babudbb1b85c-bd41-47f2-b1e2-05032028d508-415x250-IndiaHerald.jpgవెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప, దృశ్యం 2 సినిమాలు త్వరలోనే నేరుగా ఓటీటీ వేదిక రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. దృశ్యం 2 మూవీ డిజిటల్ రైట్స్ ఇప్పటికే హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దృశ్యం 2 ఒరిజినల్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అవైలబుల్ లో ఉంది. దీనిబట్టి ఇప్పటికే ఈ సినిమాని చాలా మంది వీక్షించే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామందికి ఈ సినిమాలోని ట్విస్ట్స్ అన్ని తెలిసిపోయాయి కాబట్టి వారందరూ వెంకటేష్ రీమేక్ సినిమాని చూడక పోవsuresh babu{#}sureshరిలీజ్ విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్న సురేష్ బాబు..?రిలీజ్ విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్న సురేష్ బాబు..?suresh babu{#}sureshTue, 29 Jun 2021 15:00:00 GMTవెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప, దృశ్యం 2 సినిమాలు త్వరలోనే నేరుగా ఓటీటీ వేదిక రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. దృశ్యం 2 మూవీ డిజిటల్ రైట్స్ ఇప్పటికే హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దృశ్యం 2 ఒరిజినల్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అవైలబుల్ లో ఉంది. దీనిబట్టి ఇప్పటికే ఈ సినిమాని చాలా మంది వీక్షించే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామందికి ఈ సినిమాలోని ట్విస్ట్స్ అన్ని తెలిసిపోయాయి కాబట్టి వారందరూ వెంకటేష్ రీమేక్ సినిమాని ప్రత్యేకంగా థియేటర్లకు వచ్చి మరీ చూడక పోవచ్చు. కరోనా నేపథ్యంలో థియేటర్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఓ రీమేక్ సినిమాతో లాభాలు రాబట్టటం అసాధ్యమని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారట. అందుకే దృశ్యం 2 తెలుగు రీమేక్ ని ఓటీటీ సంస్థకు అమ్మేసారట.



ఇక తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ సినిమాకి రీమేక్ గా రూపొందించిన "నారప్ప" సినిమా కూడా భారీ ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేదని సురేష్ బాబు వెంకటేష్ తో చెప్పారట. నిజానికి అసురన్ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై రెండున్నర సంవత్సరాలు గడుస్తోంది. ఈ చిత్రంలో నటించిన ధనుష్ కి జాతీయ పురస్కారం కూడా లభించింది. దీంతో యాక్షన్ డ్రామా అయిన "అసురన్" ని చాలా మంది ఇప్పటికే చూసేసారు. దీంతో అసురన్ రీమేక్ అయిన "నారప్ప" సినిమాని కరోనా సమయంలో థియేటర్స్ వచ్చి చూస్తారా లేదా అనే సందిగ్ధత సురేష్ బాబు లో నెలకొంది. ఇదే విషయాన్ని ఆయన వెంకటేష్ తో చెప్పారట.



మరోపక్క ఈ రెండు చిత్రాలకు ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో నిర్మాత సురేష్ బాబు ఓటీటీ సంస్థలకు సినిమాలను విక్రయించడమే తెలివైన నిర్ణయం అని బలంగా అనుకున్నారట. దీంతో వెంకటేష్ కూడా ఎవరిని రిస్క్ లో పెట్టకుండా ఓటీటీ విడుదలకు ఒప్పుకున్నారట. అయితే త్వరలోనే వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.



రిలీజ్ విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్న సురేష్ బాబు..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరి లో చూడండి.

సురేష్‌బాబూ... నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా సామీ?

పవర్ స్టార్ ని దేవుడ్ని చేసిన వెంకీ మామా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>