WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/aniye-shivab22c2b19-a952-4635-a4ff-5ec6eef181c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/aniye-shivab22c2b19-a952-4635-a4ff-5ec6eef181c4-415x250-IndiaHerald.jpgకొంతమంది జీవితాలు ఎప్పుడూ ఎలా మలుపులు తిరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఈ మలుపులు తిరగడానికి కారణం వారి స్వశక్తి, పట్టుదల, నిరాడంబరత అని అందరికీ తెలియదు. కొంతమంది ఎన్నో కష్టాలు పడి జీవితంలో పైకి వస్తారు అలా వచ్చిన వారు ఎంతో స్టాండర్డ్ గా ఉంటారు. ఇంకొంత మంది జీవితాలు బయోగ్రఫీలు గా, బయోపిక్ గా తీసే అంత కష్టాలతో నిండి ఉంటాయి. ఎన్నో కష్టనష్టాలను అనుభవించి ఇప్పుడు శాసించే స్థాయికి ఎదిగి వారి జీవితం బయోపిక్ అవ్వక ఏమవుతుంది.aniye shiva{#}chanti;Ice cream;Degree;lord siva;Thiruvananthapuram;Santosham;Shiva;Traffic police;marriage;Husbandనిమ్మరసం, ఐస్ క్రీం అమ్మిన నగరంలోని పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న మహిళా..!!నిమ్మరసం, ఐస్ క్రీం అమ్మిన నగరంలోని పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న మహిళా..!!aniye shiva{#}chanti;Ice cream;Degree;lord siva;Thiruvananthapuram;Santosham;Shiva;Traffic police;marriage;HusbandTue, 29 Jun 2021 10:08:00 GMTకొంతమంది జీవితాలు ఎప్పుడూ ఎలా మలుపులు తిరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు.  ఈ మలుపులు తిరగడానికి కారణం వారి స్వశక్తి, పట్టుదల, నిరాడంబరత అని అందరికీ తెలియదు. కొంతమంది ఎన్నో కష్టాలు పడి జీవితంలో పైకి వస్తారు అలా వచ్చిన వారు ఎంతో స్టాండర్డ్ గా ఉంటారు. ఇంకొంత మంది జీవితాలు బయోగ్రఫీలు గా, బయోపిక్ గా తీసే అంత కష్టాలతో నిండి ఉంటాయి. ఎన్నో కష్టనష్టాలను అనుభవించి ఇప్పుడు శాసించే స్థాయికి ఎదిగి వారి జీవితం బయోపిక్ అవ్వక ఏమవుతుంది.

అలా చంటి బిడ్డతో నిమ్మకాయరసం ఐస్ క్రీం అమ్ముకున్న నగరంలోనే ఓ మహిళా పోలీస్ ఇన్స్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు ఈ పరిణామాన్ని.  ఆమె జీవితం సినిమాకు ఏమాత్రం తీసిపోదు అని ఈ ఒక్క లైన్ ను బట్టి చెప్పవచ్చు. కుటుంబసభ్యులు వదిలేస్తే ఎన్నో కష్టాలను అనుభవించి చదువుకొని అదే నగరానికి ఇన్స్ స్పెక్టర్ గా వచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అనియే శివ. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో వర్కల అనే నగరంలో తరచూ పర్యాటకులు వస్తూ ఉంటారు అక్కడే అనియే శివ ఉండేది. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా కుటుంబ సభ్యులను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బిడ్డకు కూడా జన్మనిచ్చింది. 18 ఏళ్ల ఆమెను నడిరోడ్డుపై వదిలేసి భర్త వెళ్లిపోయాడు.  సహాయం కోసం ఇంటికి వెళితే ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. 

దీంతో తన కుమారుడు శివ సూర్యతో కలిసి అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉండేది. జీవనాధారం కోసం వచ్చే పర్యాటకులకు ఐస్ క్రీం, నిమ్మరసం అమ్మి పొట్ట నింపుకునేది. కట్ చేస్తే ఇప్పుడు ఆమెకు 31 ఏళ్లు. ఏ నగరంలో అయితే అష్టకష్టాలు అనుభవించిందో ఆ వర్కల నగరంలోనే ఇన్స్పెక్టర్ గా చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను సాధించిన ఈ ఘనత పెద్ద విషయం కాదని అందరూ సాధించగలుగుతారు అని తనలా ఏ మహిళ అయిన తన కాళ్ళమీద తాను నిలబడగలిగితే చాలా సంతోషం అని చెప్పుకొచ్చారు. 



ఈ కంప్లైంట్ చూసి పోలీసులకే దిమ్మ తిరిగింది.. అదేంటో చూడండి..?

క‌మ‌ల్‌కి జోడీగా న‌దియా నటించబోతుందా..??

మరో సరిహద్దు ప్రేమికుడు.. దేశం దాటి వెళ్లి పెళ్లి.. కానీ?

రోజా కొడుకును చూశారా..? కృష్ణం లోహిత్ ఫోటో వైరల్..

మాస్ మహరాజ్.. మళ్లీ కలిసొచ్చిన రోల్ లో?

టార్గెట్ జగన్‌ : కొత్త సీరిస్‌ మొదలెట్టిన రఘురామ..?

అమెరికాలో ఎన్నారై కుటుంబం గల్లంతు..?

ఒకే బైక్‌పై 130 చలాన్లు.. వీడు మామూలోడు కాదు..?

ట్విట్టర్ ఇండియా చీఫ్ మీద మరో కేసు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>