PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf52b0e12-5f6e-48b4-9713-3d20018213f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf52b0e12-5f6e-48b4-9713-3d20018213f4-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నారు. అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ తరహా వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడు జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఇకపై ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదు. ఈ రూల్‌ను పటిష్టంగా అమలు చేసే బాధ్యత వైద్య jagan{#}Jagan;School;Ammavodi;Corporate;CM;Parents;Governmentవిద్యార్థుల తల్లిదండ్రులు మెచ్చేలా.. జగన్ మరో కీలక నిర్ణయం..!విద్యార్థుల తల్లిదండ్రులు మెచ్చేలా.. జగన్ మరో కీలక నిర్ణయం..!jagan{#}Jagan;School;Ammavodi;Corporate;CM;Parents;GovernmentTue, 29 Jun 2021 09:51:00 GMTఏపీ సీఎం జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నారు. అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ తరహా వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడు జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.


అదేంటంటే.. ఇకపై ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదు. ఈ రూల్‌ను పటిష్టంగా అమలు చేసే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఏఎన్‌ఎంలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఒక్కో ఏఎన్‌ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగిస్తారు. వారు స్వయంగా  స్కూళ్లకు వెళ్లి.. పాఠశాల  సమీపంలోని పరిస్థితులను పరిశీలిస్తారు. ఇదేదో ఆషామాషీగా చేస్తే కుదరదు.


పాఠశాలకు సంబంధించిన ఫోటోలు కూడా తీయాల్సి ఉంటుంది. ఆ ఫోటోలు ఒక ప్రత్యేక యాప్‌ లో అప్‌లోడ్‌  చేయాలి. ఇకపై ప్రతి స్కూల్‌నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్‌ చేస్తారు. మ్యాపింగ్‌ తర్వాత వీటిని ఆన్‌లైన్‌ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. స్కూల్‌ ఆవరణలో పొగతాగడం వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఎవరైనా సిగరెట్, గుట్కా వంటి షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అంతే కాదు.. స్కూల్‌ సమీపంలో ఎవరైనా పొగతాగినా కూడా చర్యలు తీసుకుంటారు. టీచర్లు పొగతాగినా సరే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు.


ఇక మద్యం షాపులు స్కూళ్ల పరిసరాల్లోనే ఉండకూడదు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో దీనికి సంబంధించిన ఈ యాప్‌ను అందుబాటులోకి  తేనున్నారు.





ఇకపై ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదు. ఈ రూల్‌ను పటిష్టంగా అమలు చేసే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంది.

గోవా వెళ్లాలనుకుంటున్నారా.. గుర్తుంచుకోండి అలా అయితేనే ఎంట్రీ?

కేజ్రీవాల్ అదిరిపోయే హామీ.. గెలిపిస్తే ఉచితంగా?

International mud day : మళ్లీ మట్టి వైపు చూస్తున్న మోడ్రన్ జనాలు?

కోవిద్ ప్రొఫైల్ పరీక్షలు ఇక ఉచితమే...?

టార్గెట్ జగన్‌ : కొత్త సీరిస్‌ మొదలెట్టిన రఘురామ..?

ట్విట్టర్ ఇండియా చీఫ్ మీద మరో కేసు

ఫీజులు పెంచొద్దు.. విద్యామంత్రి వార్నింగ్‌.. స్కూళ్లు వింటాయా..?

భార్యని చంపిన భర్త : పట్టించిన డెల్టా వేరియంట్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>