MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishn-a1fa6cec8-29ea-4377-840c-ed6cc47cb391-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishn-a1fa6cec8-29ea-4377-840c-ed6cc47cb391-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో బాలకృష్ణ స్పీడ్ కు యంగ్ హీరోలు కూడ ఆశ్చర్యపోతున్నారు. ‘అఖండ’ మూవీలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తూ అంచనాలు పెంచేస్తున్న బాలకృష్ణ ఈమూవీ విడుదల లోపే తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘క్రాక్’ మూవీతో మంచి జోష్ లో ఉన్న గోపీచంద్ మలినేని తో తీయబోతున్న మూవీ షూట్ కు బాలకృష్ణ రెడీ అవుతున్నాడు.సాధారణంగా బాలకృష్ణ తన సినిమాల స్క్రిప్ట్ విషయంలో ఏమాత్రం కలగచేసుకోడు. దర్శకుడు ఎలా చెపితే అలా చేయడం బాలయ్య అలవాటు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని తీయబోతున్న మూవీ స్క్రిప్ట్ విషయంలో బాలకృష్ణ ఎbalakrishn a{#}Shruti Haasan;Mythri Movie Makers;Josh;Industry;Hero;Darsakudu;Balakrishna;Director;Heroine;Cinema;Newsగోపీచంద్ చంద్ మలినేనికి కళ్ళెం వేస్తున్న బాలకృష్ణ !గోపీచంద్ చంద్ మలినేనికి కళ్ళెం వేస్తున్న బాలకృష్ణ !balakrishn a{#}Shruti Haasan;Mythri Movie Makers;Josh;Industry;Hero;Darsakudu;Balakrishna;Director;Heroine;Cinema;NewsTue, 29 Jun 2021 10:00:00 GMTసీనియర్ హీరో బాలకృష్ణ స్పీడ్ కు యంగ్ హీరోలు కూడ ఆశ్చర్యపోతున్నారు. ‘అఖండ’ మూవీలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తూ అంచనాలు పెంచేస్తున్న బాలకృష్ణ ఈమూవీ విడుదల లోపే తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘క్రాక్’ మూవీతో మంచి జోష్ లో ఉన్న గోపీచంద్ మలినేని తో తీయబోతున్న మూవీ షూట్ కు బాలకృష్ణ రెడీ అవుతున్నాడు.

సాధారణంగా బాలకృష్ణ తన సినిమాల స్క్రిప్ట్ విషయంలో ఏమాత్రం కలగచేసుకోడు. దర్శకుడు ఎలా చెపితే అలా చేయడం బాలయ్య అలవాటు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని తీయబోతున్న మూవీ స్క్రిప్ట్ విషయంలో బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా ఎక్కువగా కల్పించుకుంటున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తీయబడుతున్న ఈమూవీలో ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని వివాదాస్పద సంఘటనలు ఈ మూవీ స్క్రిప్ట్ లో ఉన్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న ఈ హై ఓల్టేజ్ డ్రామాలో చాల యాక్షన్ సన్నివేశాలు ఉండే విధంగా ఈ స్క్రిప్ట్ ను రెడీ పెట్టానని తెలుస్తోంది.

అయితే మరీ ఇంత యదార్థ సంఘటనలతో ఈమూవీని తీస్తే తరువాత కొన్ని సమస్యలు ఏర్పడతాయని అందువల్ల ఆ సంఘటనలు మరీ యదార్థంగా కాకుండా కొద్దిగా లైట్ చేసి చూపించే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేయమని బాలయ్య గోపీచంద్ మలినేనికి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాలయ్య 107వ సినిమాగా నిర్మాణం ప్రారంభం కాబోతున్న ఈమూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా ఆమె వద్ద నుండి సరైన స్పందన రాకపోవడంతో ఈమూవీ నిర్మాతలు మరో హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు టాక్. బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్ దొరకడం ఎంత కష్టంగా ఉందో ఈ విషయం బట్టి అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి..





బక్కచిక్కిన కిమ్.. కన్నీరు పెట్టుకుంటున్న ప్రజలు?

హ‌నుమాన్ గుడి క‌ట్టిన యాక్ష‌న్ హీరో...ఎక్క‌డంటే.. ?

ఫ్లాప్ లు అవుతున్నా ఈ హీరో స్పీడ్ మాములుగా లేదు

క‌మ‌ల్‌కి జోడీగా న‌దియా నటించబోతుందా..??

నిర్ణయం అఖిల్ మీద పెట్టేశారు.. బ్యాచ్ లర్ సినిమాకు ఓటిటి భారీ డీల్..!

సిల్క్ స్మిత కెరీర్ ఎలా పతనం అయ్యిందో తెలుసా..?

మీకు దండం పెడతాం.. కత్తితో పొడవండి.. కానీ వ్యాక్సిన్ మాత్రం వద్దు?

రోజా కొడుకును చూశారా..? కృష్ణం లోహిత్ ఫోటో వైరల్..

భారత్ సిద్ధమైంది.. అక్కడికి 50 వేల మంది సైన్యం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>