PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrfca694bf-651c-4a53-a1bd-1b32e420ebe0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrfca694bf-651c-4a53-a1bd-1b32e420ebe0-415x250-IndiaHerald.jpgఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల యుద్ధం ముదురుతోంది. ప్రధానంగా తెలంగాణ ఈ విషయంలో దూకుడుగానే వెళ్తోంది. తెలంగాణ మంత్రుల విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఏపీ నుంచి మాత్రం సంయమనం పాటిస్తూ విమర్శలకు బదులిస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కోను ఆదేశించారు. ఈ మేరకు ఆదేశాలిస్తూ తెలంగామ ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తికి కృష్ణా జలాలను తెలంగాణ అధిkcr{#}KCR;Krishna River;Andhra Pradesh;war;Letter;Srisailam;Telangana;electricity;Aquaఏపీ, తెలంగాణ వాటర్ వార్‌.. కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం..?ఏపీ, తెలంగాణ వాటర్ వార్‌.. కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం..?kcr{#}KCR;Krishna River;Andhra Pradesh;war;Letter;Srisailam;Telangana;electricity;AquaTue, 29 Jun 2021 07:16:00 GMTఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల యుద్ధం ముదురుతోంది. ప్రధానంగా తెలంగాణ ఈ విషయంలో దూకుడుగానే వెళ్తోంది. తెలంగాణ మంత్రుల విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఏపీ నుంచి మాత్రం సంయమనం పాటిస్తూ విమర్శలకు బదులిస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ సీఎం  కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వంద శాతం విద్యుత్  ఉత్పత్తి చేయాలని జెన్‌కోను ఆదేశించారు.


ఈ మేరకు ఆదేశాలిస్తూ తెలంగామ ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తికి కృష్ణా జలాలను తెలంగాణ అధికంగా వినియోగిస్తోందని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌కేంద్రంలో విద్యుదుత్పత్తికి అధికంగా నీటిని వాడుకుంటున్నారని ఏపీ ప్రభుత్వం ఇటీవల కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.


శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం.. 854 అడుగులకు పెరిగేదాకా విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోకుండా  తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని ఏపీ కోరింది. ఈ ఫిర్యాదు మేరకు...శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో తక్షణం ఉత్పత్తి నిలపాలంటూ బోర్డు తెలంగాణ జెన్‌కోకు లేఖ రాసింది. నీటి  విడుదలపై తామిచ్చే ఆదేశాలు పాటించాలంటూ సూచించింది. అయినా కేసీఆర్ సర్కారు మాత్రం విద్యుత్ ఉత్పత్తికే మొగ్గు చూపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.


రైతుల అవసరాల కోసమే తెలంగాణలోని అన్ని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వందశాతం విద్యుత్‌ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ సర్కారు జెన్‌కోకు ఉత్తర్వులిచ్చింది. సంపూర్ణ సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ ఇంధనశాఖ జెన్‌కోను ఆదేశించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇంధనశాఖ ఉత్తర్వులు వెలువరించిందని చెబుతున్నారు. లెక్కలు చూస్తే.. తెలంగాణలో అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2500 మెగావాట్లు. ఇందులో కృష్ణానదిపైనే 2,369 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న జల విద్యుత్ కేంద్రాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తే రోజుకు 50 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరుగుతుందని అంచనా.





డ్రోన్ వార్ తో భారత్ కు పెనుముప్పు రాబోతోందా..?

ఫీజులు పెంచొద్దు.. విద్యామంత్రి వార్నింగ్‌.. స్కూళ్లు వింటాయా..?

మరో అద్భుతం ఆవిష్కరించిన చైనా..?

కలుపుకుపోతున్న రేవంత్.. ఏకతాటిపైకి తెస్తాడా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కోను ఆదేశించారు.

హైకమాండ్ వార్నింగ్‌తో దారి కొచ్చిన కోమటిరెడ్డి..?

హైపర్ ఆది మరీ దిగజారిపోతున్నాడా..?

యమా రంజుగా వైఎస్‌ షర్మిల, వైఎస్‌ జగన్‌ పోరాటం..!

టీచర్ల జీతం అంతెక్కువా?.. మరి ఈ ఆత్మహత్యలు ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>