PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag19268ebb-42d0-4f2b-b55e-3915532a6258-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag19268ebb-42d0-4f2b-b55e-3915532a6258-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు.. వాటి తీరుతెన్నులు.. పోరాడాల్సిన అంశాల‌పై చ‌ర్చించేందుకు స‌మావేశ‌మైన భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు ఏమీ తేల్చ‌కుండానే స‌మావేశాన్ని ముగించారు. ప్ర‌భుత్వంలో లోటుపాట్లు ఎన్నో ఉన్నాయి. ఇసుక కొర‌త రాష్ట్రాన్ని తీవ్రంగా వేధిస్తోంది. అలాగే రెండు సంవ‌త్స‌రాల నుంచి ఎటువంటి ఉద్యోగాల క‌ల్ప‌న లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌రుగుతున్న అవినీతి, అక్ర‌మాల‌పై పోరాటం చేయ‌డానికి అవ‌కాశం ఉంది. దీనికితోడు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అమ‌రావ‌తి రాజ‌ధానికి శంకుస్థాప‌న చేశారు. ఇప్పుడు రాష్ట్రtag{#}Telugu Desam Party;Sujana Choudary;CM;Andhra Pradesh;Amaravathi;Y. S. Rajasekhara Reddy;YCP;Bharatiya Janata Party;TDP;Party;media;central governmentబీజేపీలో వైసీపీ?.. వైసీపీలో బీజేపీ?బీజేపీలో వైసీపీ?.. వైసీపీలో బీజేపీ?tag{#}Telugu Desam Party;Sujana Choudary;CM;Andhra Pradesh;Amaravathi;Y. S. Rajasekhara Reddy;YCP;Bharatiya Janata Party;TDP;Party;media;central governmentTue, 29 Jun 2021 13:44:27 GMT
రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు.. వాటి తీరుతెన్నులు.. పోరాడాల్సిన అంశాల‌పై చ‌ర్చించేందుకు స‌మావేశ‌మైన భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు ఏమీ తేల్చ‌కుండానే స‌మావేశాన్ని ముగించారు. ప్ర‌భుత్వంలో లోటుపాట్లు ఎన్నో ఉన్నాయి. ఇసుక కొర‌త రాష్ట్రాన్ని తీవ్రంగా వేధిస్తోంది. అలాగే రెండు సంవ‌త్స‌రాల నుంచి ఎటువంటి ఉద్యోగాల క‌ల్ప‌న లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌రుగుతున్న అవినీతి, అక్ర‌మాల‌పై పోరాటం చేయ‌డానికి అవ‌కాశం ఉంది. దీనికితోడు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అమ‌రావ‌తి రాజ‌ధానికి శంకుస్థాప‌న చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోన్న మూడు రాజ‌ధానుల‌పై పోరాటం చేయ‌డానికి అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఎవ‌రూ మాట్లాడ‌టంలేదు. కొవిడ్ టీకాల కొర‌త‌, దిగ‌జారిపోతున్న రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ త‌దిత‌ర అంశాల‌పై పోరాటాలు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డంలేదు. ఇప్ప‌టికి ఎన్ని స‌మావేశాలైతే జ‌రిగాయా అన్ని స‌మావేశాల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడాలంటూ తీర్మానాలు చేస్తారు. జ‌గ‌న్ స‌ర్కార్‌పై మీడియా ఎదుట చేసే విమ‌ర్శ‌లే కానీ క్షేత్ర‌స్థాయికి వ‌చ్చిన పోరాడిన సంద‌ర్భం ఒక్క‌టి కూడా లేదంటే అతిశ‌యోక్తి కాదు.

విజ‌య‌సాయిరెడ్డి గుప్పిట్లో బీజేపీ నేత‌లు?
బీజేపీలో కొంత మంది నేత‌లు ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టేవారు. కన్నా, సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటివారంతా  వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుపడేవారు. మ‌మ్మ‌ల్ని విమర్శిస్తే తెలుగుదేశం పార్టీకి లాభమ‌ని, వారందరూ టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్రచారం చేశారు. ఈ త‌ర‌హా ప్రచారంతో విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీపై పట్టు సాధించారు. ఒక‌ర‌కంగా ఏపీకి చెందిన బీజేపీ నేత‌లంతా విజయసాయిరెడ్డి చేతిలో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఇక్క‌డి నేత‌ల వ్య‌వ‌హారం ఉండ‌టంతో క్షేత్ర‌స్థాయిలోని కార్య‌క‌ర్త‌లు ఏమీ మాట్లాడ‌టంలేదు. కేంద్ర ప్ర‌భుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాజీలేని పోరాటం అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ప్ప‌టికీ ఆ పోరాటాలు మాత్రం చేయ‌రు. స‌మావేశాల‌తోనే ముగిస్తుంటారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌రీతిలో ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.





వైవీకి జ‌గ‌న్ ఇచ్చే గిఫ్ట్ ఇదేనా... వైసీపీలో హాట్ టాపిక్ ?

ప్రతి మహిళా ఆ పని చేయండి: సీఎం జగన్

కేంద్ర‌మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌...కాబోయే కేంద్ర‌మంత్రులు ఎవ‌రో.?

రేవంత్ ఎఫెక్ట్‌: కీల‌క నేత బీజేపీ టు కాంగ్రెస్ రివ‌ర్స్ జంప్ ..!

వ‌న్ నేష‌న్‌..వ‌న్ రేష‌న్ కార్డు అమ‌లు చేయాలి - సుప్రీం

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన నటీన‌టుల కోసం ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల కోసం రంగం సిద్ధ‌మ‌వుతోంది. సెప్టెంబ‌రులో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా అధ్య‌క్ష స్థానానికి ఐదుగురు పోటీప‌డుతుండ‌టంతో ఈ ఎన్నిక‌లు కూడా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డిచే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. దీంతో సినిమా ఎన్నిక‌లు కాస్తా రాజ‌కీయ రంగు పులుముకొని అసాధార‌ణ ఎన్నిక‌లుగా మారాయి.

వైసీపీ, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు?

ఈ పావురాల రేస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మయం ఉన్నా ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు ఎవ‌రికివారే త‌మ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టింప‌చేసుకున్నారు. వీరికితోడు సీవీఎల్ న‌ర‌సింహారావు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ కూడా బ‌రిలోకి దిగడంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా మా ఎన్నిక‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతాయేమోన‌న్న అనుమానాలు కూడా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>