PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-congress8a3e3650-027b-475a-9130-f8e1264dcd15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-congress8a3e3650-027b-475a-9130-f8e1264dcd15-415x250-IndiaHerald.jpgఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయిన టీ కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ ఇప్పుడు కాంగ్రెస్ లోకి రివ‌ర్స్ జంప్ చేస్తున్నారు. ఇక తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డా ఉన్న టీడీపీ కీల‌క నేత‌లు కూడా కాంగ్రెస్‌లోకి వ‌చ్చేస్తున్నారు. మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గ పరిధిలో ఉన్న టీడీపీ నేత‌లు అంద‌రూ వ‌రుస పెట్టి సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే మ‌రో కీల‌క నేత చేరిపోతున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో కాంగ్రెస్ లో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌. శ్రీశైలం గౌడ్ వైఎస్ హయాం నుంచి bjp congress{#}Cycle;Leader;Srisailam;Revanth Reddy;revanth;MLA;Bharatiya Janata Party;TDP;Congress;Party;Telanganaరేవంత్ ఎఫెక్ట్‌: కీల‌క నేత బీజేపీ టు కాంగ్రెస్ రివ‌ర్స్ జంప్ ..!రేవంత్ ఎఫెక్ట్‌: కీల‌క నేత బీజేపీ టు కాంగ్రెస్ రివ‌ర్స్ జంప్ ..!bjp congress{#}Cycle;Leader;Srisailam;Revanth Reddy;revanth;MLA;Bharatiya Janata Party;TDP;Congress;Party;TelanganaTue, 29 Jun 2021 13:30:00 GMTతెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడుగా రేవంత్ ఎంట్రీతో తెలంగా ణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ పీసీసీ ప‌ద‌వి ఎవ‌రికి ఇస్తార‌న్న‌ది క్లారిటీ లేక‌పోయిన టైంలో అక్క‌డ టీఆర్ ఎస్‌కు బీజేపీ మాత్ర‌మే ఆల్ట్ర‌నేటివ్ అని ప్రతి ఒక్క‌రు అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెంది న డీకే అరుణ లాంటి వాళ్లు సైతం బీజేపీలోకి వెళ్లిపోయారు. ఒక్క డీకే అరుణ మాత్ర‌మే కాదు.. ఎంతో మంది కాంగ్రెస్ కీల‌క నేత‌లు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం మారుతోంది.

ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయిన టీ కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ ఇప్పుడు కాంగ్రెస్ లోకి రివ‌ర్స్ జంప్ చేస్తున్నారు. ఇక తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డా ఉన్న టీడీపీ కీల‌క నేత‌లు కూడా కాంగ్రెస్‌లోకి వ‌చ్చేస్తున్నారు. మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గ పరిధిలో ఉన్న టీడీపీ నేత‌లు అంద‌రూ వ‌రుస పెట్టి సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే మ‌రో కీల‌క నేత చేరిపోతున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో కాంగ్రెస్ లో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌.

కూన శ్రీశైలం గౌడ్ వైఎస్ హయాం నుంచి స్ట్రాంగ్ కాంగ్రెస్ సపోర్టర్. 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు కాంగ్రెస్ సీటు ఇవ్వ‌క‌పోతే కుత్బుల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో ఆ త‌ర్వాత ఓడిపోయిన శ్రీశైలం త‌ర్వాత ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. రేవంత్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్ కి పీసీసీ ఇవ్వరని, కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని భావించి బీజేపీ గూటికి వెళ్ళారు.

అయితే ఇప్పుడు రేవంత్‌కు పీసీసీ ప‌ద‌వి ఇవ్వ‌డంతో కూన తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  కూన మాత్ర‌మే కాదు మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, గ్రేట‌ర్ ప‌రిధిలో ప‌లువురు బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు.



వైవీకి జ‌గ‌న్ ఇచ్చే గిఫ్ట్ ఇదేనా... వైసీపీలో హాట్ టాపిక్ ?

బీజేపీలో వైసీపీ?.. వైసీపీలో బీజేపీ?

కేంద్ర‌మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌...కాబోయే కేంద్ర‌మంత్రులు ఎవ‌రో.?

రేవంత్ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌లోకి బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ?

వైసీపీ, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు?

మా వార్‌: ప్ర‌కాష్‌రాజ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడెవ‌రు?

సీఎం జ‌గ‌న్‌పై లోకేష్ సంచ‌ల‌న ఆరోపణ‌లు... ఏమ‌న్నారంటే...?

జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన ఈ దిగ్గ‌జాల అడ్ర‌స్ చెప్ప‌రూ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>