LifeStyleMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/inspiration-55b8e4f4-2204-45fc-a9b2-5752d2f1b0ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/inspiration-55b8e4f4-2204-45fc-a9b2-5752d2f1b0ae-415x250-IndiaHerald.jpgకృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే నానుడిని నిజం చేస్తూ మహిళా లోకానికి ఈ తల్లి ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. అటు అమ్మగా, చదువుల తల్లిగా, సమాజంతో పోరాడే రాణీ రుద్రమదేవిగా, బతుకు బండిని మోస్తూ భగీరతిగా కష్టాలను మోసే కాళికాదేవిగా ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదని, సమాజ పుట్టుకకు పునర్జన్మ అని నిరూపించింది ఈ మహిళ. ప్రస్తుత కాలంలో కూడా ఆడపిల్ల అంటే కడుపులోనే చిదిమేస్తున్నారు. కొంతమంది పసిపాపలను రోడ్డుపై, చెత్తకుప్పల పై వదిలేసి వెళుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఆడది అంటే ఎందులో తక్కువ కాదని ఆడపిల్లకు ఆకాశమేInspiration {#}facebook;Thiruvananthapuram;vidya;Nijam;Husband;Degree;Parents;job;Girl;prema;Love;Kerala;marriage;Minister;Traffic policeఆమె నిమ్మరసం అమ్మిన చోటే ఎస్సైగా విధులు..!ఆమె నిమ్మరసం అమ్మిన చోటే ఎస్సైగా విధులు..!Inspiration {#}facebook;Thiruvananthapuram;vidya;Nijam;Husband;Degree;Parents;job;Girl;prema;Love;Kerala;marriage;Minister;Traffic policeMon, 28 Jun 2021 13:05:00 GMT
 కృషి ఉంటే  మనుషులు రుషులవుతారు అనే నానుడిని  నిజం చేస్తూ మహిళా లోకానికి ఈ తల్లి ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. అటు అమ్మగా, చదువుల తల్లిగా, సమాజంతో పోరాడే రాణీ రుద్రమదేవిగా, బతుకు బండిని మోస్తూ భగీరతిగా కష్టాలను మోసే కాళికాదేవిగా ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదని, సమాజ పుట్టుకకు పునర్జన్మ అని నిరూపించింది ఈ మహిళ.  ప్రస్తుత కాలంలో కూడా ఆడపిల్ల అంటే కడుపులోనే చిదిమేస్తున్నారు. కొంతమంది పసిపాపలను రోడ్డుపై, చెత్తకుప్పల పై వదిలేసి వెళుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఆడది అంటే ఎందులో తక్కువ కాదని ఆడపిల్లకు ఆకాశమే హద్దు అని, అలాంటి ఆడపిల్లలను  కొంతమంది తల్లిదండ్రులు అమ్మకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి ఓ ఆడ తల్లి సంఘటనే ఇది. పేద కుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాలకోర్చి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంది. సుఖంగా బ్రతుకుదాం అనుకున్న ఈ సమయంలో కట్టుకున్న భర్త కూడా వదిలేసి వెళ్లడంతో ఆ తల్లి రోడ్డున పడింది. ఎన్నో కష్టాలను ఓర్చుకుంది. కష్టపడి సాధన చేసింది చివరికి పోలీస్  శాఖలో అధికారిగా ఎంపికయింది. అంటే ఆడపిల్ల అంటే ఎక్కడ తక్కువ కాదని నిరూపించింది ఈ మహిళ.

 తిరువనంతపురం జిల్లా కాంజిరాంక్లంకు చెందిన  ఆణి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న  ఈ సమయంలో తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి వేరే కాపురం పెట్టింది. రెండు సంవత్సరాల తర్వాత వారికి కొడుకు పుట్టాడు. ఆ తర్వాత  ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఒంటరి అయిపోయింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను ఆదరించలేదు. దీంతో అమ్మమ్మ దగ్గర ఉంటూ గ్రాడ్యుయేషన్  పూర్తి చేసింది. కొద్దిరోజులు ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కొద్దిరోజులు ప్లాస్టిక్  వస్తువులు కూడా  అమ్మింది. ఇలా తన కొడుకును సాదుకుంటూ వస్తుంది.  ఇదే సమయంలో వర్కర పట్టణంలో  నిమ్మరసం అమ్మడం ప్రారంభించింది. ఆ నిమ్మరసం అమ్ముతూనే  దూర విద్య ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  2015లో  కేరళ రాష్ట్ర పోలీస్ శాఖలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని తమ బంధువు ఎవరో తెలియజేశారు. ముందు ఆమె పోస్ట్ అప్లై చేయడానికి సుముఖత చూపింది. ఆమెకు ఎలాగోలా నచ్చజెప్పి ఈ పోస్టు అప్లై చేయించాడు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్,  మెడికల్ టెస్ట్ మొత్తం పూర్తి చేసుకుని 2016 బ్యాచ్ లో ఎస్ఐగా ఎంపికయ్యారు. 18 నెలల ట్రైనింగ్ తర్వాత ఆమె ఎక్కడైతే నిమ్మరసం అమ్మారో ఆ పట్టణంలోనే ఎస్సైగా  విధులు నిర్వహించేందుకు వచ్చారు.

ఈ విషయం అంతా ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టును చూసిన చాలా మంది ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. మీ జీవితం ఎంతో మంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తుందని కామెంట్స్ ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకొని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కన్న వాళ్ళు వదిలేసారు, నమ్ముకున్న భర్త వదిలేశాడు. తన బిడ్డను స్వయంగా పెంచుకుంటూ ఎన్నో కష్టాలు పడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం సాధించిందని ఈమె జీవితం ఎంతోమంది మహిళలకు ఆదర్శమంటూ మంత్రి ప్రశంసలు కురిపించారు.



వీహెచ్ వద్దకు రేవంత్.. కలిసి సోనియా వద్దకు వెళ్తారట!

టీటీడీ చైర్మ‌న్ మ‌ళ్లీ రెడ్డికేనా... జ‌గ‌న్ ఈక్వేష‌న్ రాంగా ?

చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తోన్న అమెజాన్‌, వాల్‌మార్ట్‌?

బీజేపీని టార్గెట్ చేసిన నాని...టీడీపీకి ఆ సత్తా ఉందా?

మీరా జాస్మిన్ ఇప్పుడు ఎంత అందంగా మరిపోయిందో చూడండి

ఈట‌ల తూటాల‌కు.. కేసీఆర్ ప‌డిపోయారే.. ఫుల్ ఛేంజ్‌..!!

సల్మాన్ ఇపుడు పశ్చాత్తాపపడితే ఏం లాభం..!

కేసీఆర్‌పై ర‌గులుతోన్న హైద‌రాబాద్ కారు పార్టీ లీడ‌ర్ ?

ఆ విషయంలో పీవీని కొట్టేవారే లేరు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>