Wife: ఇద్దరు పెళ్లాల ముద్దులమొగుడు, మూడో పెళ్లికి ?, రెండో భార్య షార్ప్, గుత్తి కోసి చేతిలో పెట్టింది !

 మతగురువుకు ఇద్దరు భార్యలు

మతగురువుకు ఇద్దరు భార్యలు

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని షికార్పూర్ లో వకీల్ అహమ్మద్ (57) అనే ఆయన నివాసం ఉంటున్నారు. వకీల్ అహమ్మద్ మతగురుగా పని చేస్తున్నాడు. మతగురువు వకీల్ అహమ్మద్ కు ఇంతకు ముందే వివాహం అయ్యింది. మొదటి భార్య బతికుండగానే వకీల్ అహమ్మద్ హజ్రా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.

 ఇద్దరు పెళ్లాల ముద్దులమొగుడు వకీల్

ఇద్దరు పెళ్లాల ముద్దులమొగుడు వకీల్

మొదటి భార్య, రెండో భార్య హజ్రాతో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్న వకీల్ అహమ్మద్ వారితో సంసారం చేస్తూ సంతోషంగా కాపురం చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో మతగురువు వకీల్ అహమ్మద్ తీరులో మార్పులు వచ్చాయి. తాను మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించానని వకీల్ అహమ్మద్ అతని ఇద్దరు భార్యలకు చెప్పాడు.

 బుద్దిమాటలు చెప్పిన రెండో భార్య

బుద్దిమాటలు చెప్పిన రెండో భార్య

ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకున్నావని, మనకు పిల్లలు ఉన్నారని, ఇప్పుడు మూడో పెళ్లి ఎందుకు అని రెండో భార్య హజ్రా ఆమె భర్త వకీల్ అహమ్మద్ కు బుద్దిమాటలు చెప్పింది. లేదు, నాకు ఇద్దరు భార్యలు సరిపోరు, కచ్చితంగా మూడోపెళ్లి చేసుకోవాలని, ఎవ్వరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోనని వకీల్ అహమ్మద్ అతని ఇద్దరు భార్యలకు తేల్చి చెప్పాడు.

 ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తావ్ ?

ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తావ్ ?

ఇప్పుడే నీకు 57 సంవత్సరాలు దాటిపోయింది, మూడో పెళ్లి చేసుకుని నువ్వు ఏమి ఉద్దరిస్తావు, మతగురువుగా నీకు ఉన్న మంచిపేరు చెడిపోతుందని, ఈ వయసులో పెళ్లి చేసుకుని నువ్వు ఏమి సాదిద్దామని అనుకుంటున్నావని రెండో భార్య హజ్రా కొన్ని రోజులుగా భర్త వకీల్ అహమ్మద్ తో గొడవ పడుతూనే ఉందని సమాచారం.

 భర్త పై రెండో భార్య దాడి

భర్త పై రెండో భార్య దాడి

భర్త వకీల్ అహమ్మద్ మాత్రం పదేపదే తాను మూడో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి ఒంటికాలి మీద నిలబడ్డాడు. సహనం కోల్పోయిన అతని రెండో భార్య హజ్రా రగిలిపోయింది. శుక్రవారం రాత్రి పని ముగించుకున్న వకీల్ అహమ్మద్ ఇంట్లో నిద్రపోయాడు. ఆ సమయంలో వంటగదిలో ఉన్న పదునైన కత్తి తీసుకున్న రెండో భార్య హజ్రా భర్త వకీల్ అహమ్మద్ మీద కుర్చుని అతను కదలకుండా చేసి నిమిషంలో మర్మాంగం కోసేసింది.

 మతగురువు హత్యతో కలకలం

మతగురువు హత్యతో కలకలం

మర్మాంగం, గుత్తి పూర్తిగా తెగిపోవడంతో వకీల్ అహమ్మద్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మతగురువు వకీల్ అహమ్మద్ హత్యకు గురైనాడని తెలుసుకున్న భోరా కలాన్ పోలీసులు లోతుగా విచారణ చేశారు. రాత్రి ఇంట్లో వకీల్ అహమ్మద్ మర్మాంగం కింద ఉన్న గుత్తికోసి చంపేయడం, ఆ సమయంలో అతని రెండో భార్య హజ్రా ఇంట్లోనే ఉండటంతో ఆమె మీద పోలీసులకు అనుమానం వచ్చింది.

 అవును చంపేశాను..... మూడో భార్యతో నా భర్త ఏం చేస్తాడు ?

అవును చంపేశాను….. మూడో భార్యతో నా భర్త ఏం చేస్తాడు ?

తన భర్త వకీల్ అహమ్మద్ కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని, మూడో పెళ్లి చేసుకుని ఆయన మమ్మల్ని ఏం ఉద్దరిద్దామనుకున్నాడో మాకు అర్థం కావడంలేదని, ఆయన తీరుతో విసిగిపోయి తానే హత్య చేశానని రెండో భార్య హజ్రా అంగీకరించిందని పుగాన్ డీఎస్పీ శరత్ చంద్ శర్మా మీడియాకు చెప్పారు.

 మొదటి భార్య ఇంట్లో లేని టైమ్ లో ?

మొదటి భార్య ఇంట్లో లేని టైమ్ లో ?

వకీల్ అహమ్మద్, హజ్రా దంపతుల మద్య గొడవ తారాస్థాయికి చేరడం వలనే హత్య జరిగిందని, రెండో భార్య హజ్రాను అరెస్టు చేసి జైలుకు పంపించామని డీఎస్పీ శరత్ చంద్ శర్మా మీడియాకు చెప్పారు. వకీల్ అహమ్మద్ హత్యకు గురైన సమయంలో ఆయన మొదటి భార్య ఇంట్లో లేదని, ఆ విషయం విచారణలో వెలుగు చూసిందని భోరా కలాన్ పోలీస్ స్టేషన్ అధికారి జితేంద్ర సింగ్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. మూడో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన మతగురువు ఆయన రెండో భార్య చేతిలోనే దారుణ హత్యకు గురి కావడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *