PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/pneumococcal-1b0686d7-aa14-4d74-834a-3d574a9881d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/pneumococcal-1b0686d7-aa14-4d74-834a-3d574a9881d5-415x250-IndiaHerald.jpgథర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సహజంగా పిల్లల్లో వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అరికట్టేందుకు ఇచ్చే 'న్యుమోకోకల్' వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యాక్సిన్ ను ఏడాదిలోపు వయసున్న పిల్లలకు రెండు మూడు సార్లు వేస్తారని చెబుతున్నారు వైద్య నిపుణులు. కరోనాతో దీనికి సంబంధం లేకపోయినా థర్డ్ వేవ్ ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. pneumococcal {#}Government;Coronavirusథర్డ్ వేవ్ అలెర్ట్.. ఏడాది పిల్లలకు వ్యాక్సిన్..థర్డ్ వేవ్ అలెర్ట్.. ఏడాది పిల్లలకు వ్యాక్సిన్..pneumococcal {#}Government;CoronavirusMon, 28 Jun 2021 06:25:00 GMTథర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సహజంగా పిల్లల్లో వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అరికట్టేందుకు ఇచ్చే 'న్యుమోకోకల్' వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యాక్సిన్ ను ఏడాదిలోపు వయసున్న పిల్లలకు రెండు మూడు సార్లు వేస్తారని చెబుతున్నారు వైద్య నిపుణులు. కరోనాతో దీనికి సంబంధం లేకపోయినా థర్డ్ వేవ్ ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఈ 'న్యుమోకోకల్' వ్యాక్సిన్ ను సరఫరా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా 8లక్షలమంది చిన్నారులు చనిపోతున్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం అనేది చిన్నారుల్లో తరచూ కనిపించే అనారోగ్యం. సాధారణ జలుపు, దగ్గుని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. పిల్లల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరితో వారికి చిికిత్స కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే అప్పటికే వారు 'న్యుమోకోకల్' వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఈ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ 'న్యుమోకోకల్' వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉన్నా.. ప్రస్తుతం ఏడాది వారికే పరిమితం చేస్తున్నారు.

భారత దేశంలో ప్రతి వెయ్యి మందిలో 37మంది చిన్నారులు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా చిన్న వయసులోనే చనిపోతున్నారు. 2019-20 కాలంలో ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో 12,520 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. వీటిని నివారించేందుకు 'న్యుమోకోకల్' వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. అందులోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ముందస్తుగా పిల్లలకు టీకా ఇవ్వడం మంచిదని భావించారు. త్వరలో రాష్ట్రాలకు టీకా సరఫరాచేయబోతున్నారు.

థర్డ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న కేంద్రం చిన్నారుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కొవిడ్ వైరస్ కూడా ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి, దానికి సంబంధించిన మిగతా ఇబ్బందుల్ని కూడా చిన్నారులకు దూరం చేసే ఉద్దేశంతో 'న్యుమోకోకల్' టీకా పంపిణీ చేయబోతోంది.



స్టార్ హీరోల ఫ్యాన్స్ కు ఇక పండుగే..!

నేరుగా అకౌంట్లో రూ.10లక్షలు.. సంచలన పథకం ప్రకటించిన కేసీఆర్ ?

పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ చాలా ముఖ్యం : ఎయిమ్స్ చీఫ్....

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక..

ఇలా పానీపూరి చేసుకోవడం చాలా మంచిదట..

చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?

డోంట్ డిస్టర్బ్ అంటున్న ప్రభాస్..?

ఆ పాట వింటే ద‌ళితుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది :కేసీఆర్

అంగరంగ వైభవంగా శంకర్ కుమార్తె వివాహం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>