PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy2a6e19b4-294d-4c08-8e3d-e546e67752c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy2a6e19b4-294d-4c08-8e3d-e546e67752c3-415x250-IndiaHerald.jpgతెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తొలిరోజునుంచీ రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తానని చెబుతూనే వైరిపక్షాలకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీని ఒకే గాటన కట్టేస్తూ రెండిటినీ ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతానంటే కొంతమంది సీనియర్లు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఏ హోదాలో, తమ ప్రాంతంలో యాత్ర చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడాయన పీసీసీ అధ్యక్షుడిహోదాలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నారు. కాంగ్రrevanth reddy{#}revanth;Bharatiya Janata Party;Mohandas Karamchand Gandhi;Revanth Reddy;Y. S. Rajasekhara Reddy;Congress;local language;Yatra;Sharmila;Telanganaరేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే నష్టం ఎవరికి..?రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే నష్టం ఎవరికి..?revanth reddy{#}revanth;Bharatiya Janata Party;Mohandas Karamchand Gandhi;Revanth Reddy;Y. S. Rajasekhara Reddy;Congress;local language;Yatra;Sharmila;TelanganaMon, 28 Jun 2021 08:00:00 GMTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తొలిరోజునుంచీ రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తానని చెబుతూనే వైరిపక్షాలకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీని ఒకే గాటన కట్టేస్తూ రెండిటినీ ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతానంటే కొంతమంది సీనియర్లు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఏ హోదాలో, తమ ప్రాంతంలో యాత్ర చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడాయన పీసీసీ అధ్యక్షుడిహోదాలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని పునరేకీకరణ చేస్తామంటున్నారు.

వాస్తవానికి బీజేపీకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉంది. తెలంగాణ ఏర్పాటుకి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం అన్న సింపతీ కూడా ఉంది. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు కృషిచేస్తోంది. ఆ క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతల్ని తమవైపు తిప్పుకుంది. ఒక్కొక్కరే హస్తం పార్టీని వీడుతున్నా.. కొంతమంది లాయలిస్ట్ లు మాత్రం గాంధీ కుటుంబంపైనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష పదవికి జరిగిన రేస్ లో సీనియర్లను కాదని, కాంగ్రెస్ తో ఆయా నాయకులకు ఉన్న అనుబంధాన్ని కాదని, టీడీపీనుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిష్టానం గుర్తింపు ఇచ్చింది. దీంతో చాలామంది నాయకులు హర్ట్ అయ్యారు. వీరందర్నీ కలుపుకొని వెళ్లడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం అవడం రేవంత్ రెడ్డి విధి. వరుసగా ఉప ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములకి కూడా ఆయన అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కనీసం రెండో స్థానాన్ని నిలుపుకోగలిగితే రేవంత్ రెడ్డికి అదే మొదటి విజయం అవుతుంది.  

రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే.. కచ్చితంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయిష్టంగానైనా సరే, ఆయనతో సీనియర్ నేతలు కలసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరకంగా.. సీనియర్లు ఏగట్టునుండాలో తేల్చుకోవాల్సిన సందర్భం వస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణలో రెండో పవర్ సెంటర్ ఎవరూ లేరు కాబట్టి.. రేవంత్ నాయకత్వాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. తన యాత్రతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యం నింపగలిగితే.. టీఆర్ఎస్, బీజేపీ.. రెండిటికీ రేవంత్ రెడ్డి గట్టిదెబ్బ కొట్టినట్టే. రేవంత్ పాదయాత్రతో అటు షర్మిల పార్టీకి కూడా తీరని నష్టం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర పార్టీల్లో ఉన్న తమ సామాజిక వర్గం నేతల్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని ఒకేచోటకు చేర్చడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. రేవంత్ పాదయాత్ర చేసి, అందరిలో భరోసా నింపగలిగితే, ఆ సామాజికవర్గానికి చెందిన నేతలంతా కాంగ్రెస్ ని వీడి బయటకు రాకపోవచ్చు.


కేసీఆర్ సింగిల్ బుల్లెట్‌తో ష‌ర్మిల‌, బీజేపీ, కాంగ్రెస్ విల‌విలా...!

అభిమానులకు షాక్ ఇచ్చిన రష్మిక..

పి.వి నరసింహారావుకు విద్యార్థి దశలోనే పోరాట స్ఫూర్తి..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తొలిరోజునుంచీ రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తానని చెబుతూనే వైరిపక్షాలకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీని ఒకే గాటన కట్టేస్తూ రెండిటినీ ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతానంటే కొంతమంది సీనియర్లు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఏ హోదాలో, తమ ప్రాంతంలో యాత్ర చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడాయన పీసీసీ అధ్యక్షుడిహోదాలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని పునరేకీకరణ చేస్తామంటున్నారు.

నేరుగా అకౌంట్లో రూ.10లక్షలు.. సంచలన పథకం ప్రకటించిన కేసీఆర్ ?

రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసిన రహస్యం ఏంటంటే..?

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి నాయకత్వం ఎక్కువగా రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్‌గా ఉండాలని భావించారు. రేవంత్ రెడ్డి అంటే సీనియర్లలో వ్యతిరేకత ఉన్నా.. అది తమకు రేవంత్ అడ్డు వస్తాడన్న అసూయతోనే తప్ప.. వేరే అంశాలు కాదు.. అందుకే రేవంత్‌ ను పోటీగా భావించని జిల్లా స్థాయి నాయకత్వం రేవంత్ వంటి యువ నాయకుడినే కోరుకుంది.

కాంగ్రెస్ మొత్తానికి రిస్క్ చేస్తోంది. రొటీన్ నుంచి వెరైటీ వైపుగా సాగుతోంది. కొత్త వైపుగా సాగుతోంది. పాత లెక్కలు, రోత పుట్టించే సమీకరణలకు దూరంగా జరుగుతోంది. శతాధిక వృద్ధ పార్టీ ఈ విధంగా ఆలోచించడం ఇపుడు అవసరం. లేకపోతే మరింతగా దెబ్బ తింటుంది.

ఏపీ లోనూ కాంగ్రెస్ ఆపరేషన్ ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>