SportsSanjayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/coach-69041a97-1e37-4bbf-acbb-f2bfe9b84fdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/coach-69041a97-1e37-4bbf-acbb-f2bfe9b84fdc-415x250-IndiaHerald.jpg మిల్కాసింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌, కరణం మల్లీశ్వరి, సానియా మీర్జా వంటి దిగ్గజాలు మొదలుకొని సైనా, సింధు వంటి నేటి యూనివర్సల్‌ స్టార్లు వరకు ఏ ప్లేయర్‌ సక్సస్‌ఫుల్‌ స్టోరీని పరిశీలించినా వారి వెనుక కచ్చితంగా ఒక కోచ్‌ కష్టం దాగుంటుంది. ప్లేయర్లు సాధించే పతకాల మాటున కోచ్‌ల శ్రమ ప్రతిబింబిస్తుంది. ప్రపంచానికి చాంపియన్లను పరిచయం చేసే కోచలను గౌరవించాల్సింది పోయి తెలంగాణలో వారిని అవమానించే పరిస్థితులు దాపురించాయి. క్రీడారంగానికి వెన్నుముకగా నిలిచే కోచింగ్‌ వ్యవస్థ రాష్ట్రంలో శిథిలవస్థకు చేరుకుంది. స్పోరcoach{#}Kavuru Srinivas;Sania Mirza;Telangana Chief Minister;vedhika;Minister;media;Telanganaకోచ్‌లపై ఎందుకీ కక్ష?కోచ్‌లపై ఎందుకీ కక్ష?coach{#}Kavuru Srinivas;Sania Mirza;Telangana Chief Minister;vedhika;Minister;media;TelanganaMon, 28 Jun 2021 19:14:00 GMT* కొత్తగా సబ్‌కమిటీ పేరిట టైంపాస్‌
* పట్టించుకోని మంత్రి, శాట్స్‌ చైర్మన్‌

మిల్కాసింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌, కరణం మల్లీశ్వరి, సానియా మీర్జా వంటి దిగ్గజాలు మొదలుకొని సైనా, సింధు వంటి నేటి యూనివర్సల్‌ స్టార్లు వరకు ఏ ప్లేయర్‌ సక్సస్‌ఫుల్‌ స్టోరీని పరిశీలించినా వారి వెనుక కచ్చితంగా ఒక కోచ్‌ కష్టం దాగుంటుంది. ప్లేయర్లు సాధించే పతకాల మాటున కోచ్‌ల శ్రమ ప్రతిబింబిస్తుంది. ప్రపంచానికి చాంపియన్లను పరిచయం చేసే కోచలను గౌరవించాల్సింది పోయి తెలంగాణలో వారిని అవమానించే పరిస్థితులు దాపురించాయి. క్రీడారంగానికి వెన్నుముకగా నిలిచే కోచింగ్‌ వ్యవస్థ రాష్ట్రంలో శిథిలవస్థకు చేరుకుంది. స్పోర్ట్స్‌ హబ్‌.. స్పోర్ట్స్‌ సిటీ.. స్పోర్ట్స్‌ పాలసీ అంటూ పొద్దున లేచింది మొదలు చీకటి పడే వరకు మీడియా ముందు బ‌డాయిల‌కు పోయే రాష్ట్ర క్రీడాశాఖ పెద్దలు ఆ దిశగా పనులు మాత్రం చేయడం లేదు. 2009 తర్వాత నోటిఫికేషన్‌ ద్వారా కొత్త కోచ్‌ల‌ను తీసుకున్న దాఖలాలు లేవంటే తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కోచ్‌లంటే చిన్నచూపు...

సమైక్య ఆంధ్రప్రదేశలో 1989 వరకు నోటిఫికేషన ద్వారా తీసుకున్న కోచ్‌లను మూడేళ్ల సర్వీస్‌ అనంతరం వారి పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించే వారు. ఆ తర్వాత నోటిఫికేషన్‌ ద్వారా తీసుకున్న 1993, 1999, 2009 బ్యాచ్‌లకు చెందిన కోచ్‌ల సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌కు మాత్రం యాక్ట్‌-2, జీఓ-212 తాజాగా యాక్‌-4 అవరోధంగా ఉన్నాయని దశాబ్దాలుగా వీరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సర్కార్‌ నోటిఫికేషన్‌ లేకుండా తాత్కాలికంగా తీసుకున్న క్లరికల్‌, క్లాస్‌-4కు చెందిన దాదాపు 40 మంది ఉద్యోగుల సర్వీస్‌ను 1998లో రెగ్యులరైజేషన్‌ చేసినప్పుడు ప్రతిబంధకం కానీ ఈ జీఓలు నోటిఫికేషన ద్వారా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న కోచ్‌లకు మాత్రమే ఎలా అడ్డుగా తయారయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్రలో 2008లో జరిగిన స్పోర్ట్స్‌ అథారిటీ 55వ పాలకమండలి సమావేశంలో 76 మంది గ్రేడ్‌-3 కోచ్‌లు అవసరమని గుర్తించారు. ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర విభజనాంతరం తెలంగాణలో అధికారికంగా 37 కోచ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1993, 1999 బ్యాచలకు చెందిన కోచ్‌ల్లో ప్రస్తుతం 15 మంది మాత్రమే ఇంకా ఒప్పంద శిక్ష‌కులుగా విధులు నిర్వహిస్తున్నారు. వారిని క్రమబద్ధీకరించినా మరో 22 పోస్టులు మిగులుతాయి. వీరితో పాటు 2009లో పే అండ్‌ ప్లే స్కీమ్‌ కింద మరో 120 మంది శిక్ష‌కులను తీసుకున్నారు. వీరందరికి ఉద్యోగ భద్రత లేకుండా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌)వారి జీవితాలతో ఆడుకుంటోంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా చూస్తే దాదాపు మరో 200 మంది కోచ్‌లు అవసరముంది. కానీ, శోయ లేని శాట్స్‌ ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదు.


మంత్రుల సబ్‌కమిటీ ఏమైంది?

కరీంనగర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో 280 మంది పిల్లలకు ఉన్నది ఇద్దరే కోచ్‌లు. ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో 200 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చేది ఇద్దరే. రాష్ట్ర ఆవిర్భవం నుంచి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణకు పాలకమండలి లేదు. దీంతో శాట్స్‌ సమస్యలను చర్చించే వేదిక లేకుండా పోయింది. ఒప్పంద కోచ్‌లను క్రమబద్ధీకరించడం.. తాజా అంచనాల ప్రకారం కొత్త కోచలను నియమించడం వంటి నిర్ణయాలు తీసుకునే తీరిక క్రీడాశాఖ మంత్రి విరిసినోళ్ల వాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మన అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, వైఏటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రాజుకి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో గత ఏడాది కేబినెట్‌ సబ్‌ కమిటీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఏర్పాటు చేశారు. సబ్‌ కమిటీ ఏర్పాటైతే హడావుడిగా జరిగింది కానీ, దాని పనితీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కమిటీ ఏర్పాటైన కొత్తలో ఒక్కసారి భేటి అయిన సబ్‌కమిటీ ఆ తర్వాత అడ్రస్‌ లేకుండా పోయింది. స్పోర్ట్స్‌ అథారిటీ గతంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు పాలకమండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపేది. ఇప్పుడు పాలకమండలి ఊసే లేకుండా పోతే కేబినెట్‌ ఉపసంఘమని పేరు పెట్టి టైంపాస్‌ చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌కు కృషి చేయడం లేదని కోచలు, ప్లేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జగన్ కి మోడీ బంపర్ ఆఫర్....?

చిరు కోసం తమన్ : రచ్చ రంబోలా స్టార్ట్!

ఎడ్యుకేషన్ : ఆ రెండు తరగతులకు మాత్రం ఆగస్టు నుంచి ఆన్లైన్ క్లాసులు...

తెలంగాణ నీటి కోసం.. ఎవరితో అయినా రె'ఢీ'!

హీరో అజిత్ కుమారుడిని చూసారా..ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా.. ?

ఆ వరద కన్నా ఈ బురదే నయం అనుకుంటున్న స్టార్స్..!!

ఫీజుల‌పై ఒత్తిడిచేస్తే క‌ఠిన‌చ‌ర్య‌లు?

వరల్డ్ కప్ విషయంలో అనుకున్నదే జరిగింది?

సోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని కోట్లా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sanjay]]>