SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/comidean-mallikrajuan1c152986-4329-426b-91ee-fc3fa9d80288-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/comidean-mallikrajuan1c152986-4329-426b-91ee-fc3fa9d80288-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎవరు.. ఎప్పుడు.. ఎలా ..పైకి ఎదుగుతారో చెప్పడం చాలా కష్టం మరికొంతమంది కొద్ది కాలం కూడా సినీ ఇండస్ట్రీలో నిలవలేక సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఇంకొంతమందేమో హాస్యనటులుగా తమ స్థానాన్ని పదిలం చేసుకుంటూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో మల్లికార్జున రావు గారు కూడా ఒకరు. అప్పట్లో హాస్యానికి పెట్టింది పేరు మల్లికార్జునరావు.. తన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమాలలో కామెడీని కూడా బాగా పండించేవారు. అయితే ఈయన గురించి ఇప్పుడు మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం.COMIDEAN MALLIKRAJUAN{#}CBN;Chiranjeevi;mallikarjuna rao;rajendra prasad;tanikella bharani;vamsi;Telugu Desam Party;December;June;Tammudu;Hello;Thammudu;Manam;Teluguస్మరణ: పలువురు సీఎంలు సంతాపం తెలిపిన ప్రముఖ కమెడియన్..స్మరణ: పలువురు సీఎంలు సంతాపం తెలిపిన ప్రముఖ కమెడియన్..COMIDEAN MALLIKRAJUAN{#}CBN;Chiranjeevi;mallikarjuna rao;rajendra prasad;tanikella bharani;vamsi;Telugu Desam Party;December;June;Tammudu;Hello;Thammudu;Manam;TeluguMon, 28 Jun 2021 07:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో ఎవరు.. ఎప్పుడు.. ఎలా ..పైకి ఎదుగుతారో చెప్పడం చాలా కష్టం మరికొంతమంది కొద్ది కాలం కూడా సినీ ఇండస్ట్రీలో నిలవలేక సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఇంకొంతమందేమో హాస్యనటులుగా తమ స్థానాన్ని పదిలం చేసుకుంటూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో మల్లికార్జున రావు గారు కూడా ఒకరు. అప్పట్లో హాస్యానికి పెట్టింది పేరు మల్లికార్జునరావు.. తన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమాలలో కామెడీని కూడా బాగా పండించేవారు. అయితే ఈయన గురించి ఇప్పుడు మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం..

మల్లికార్జున రావు 1951 డిసెంబర్ 13వ తేదీన అనకాపల్లిలో జన్మించారు. 1973 వ సంవత్సరంలో నుంచి సినిమాల్లోకి రావడం ప్రారంభించారు. అలా మొదటిసారి వంశీ దర్శకత్వం వహించిన రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ చిత్రంలో బట్టల సత్తిగాడు పాత్రలో బాగా ప్రాచుర్యం పొందాడు. ఆ తర్వాత హలో బ్రదర్, తమ్ముడు ,బద్రి వంటి సినిమాలు మల్లికార్జున రావుకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రముఖ రచయిత, తెలుగు నటుడైన తనికెళ్ల భరణి మల్లికార్జునరావు ఎప్పుడూ తన గురువు కంటే ఎక్కువగా భావించడం గమనార్హం.

మల్లికార్జున రావు కేవలం హాస్య నటుడు ,నటుడు మాత్రమే కాదు ఒక ప్రత్యేకమైన మానవత్వం కలిగిన వ్యక్తి.. వీలైనప్పుడల్లా ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ మాటలను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అనడం మరో విశేషం. ఇక అంతే కాదు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా మల్లికార్జున నియమించబడ్డాడు. ఇక తన వృత్తిలో ఉన్నప్పుడు పలువురు నటులకు ఆయన ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించబడినప్పుడు  సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


తన నటనకు గాను బెస్ట్ క్యారెక్టర్ అవార్డు గా తమ్ముడు సినిమాకు నంది అవార్డు కూడా లభించడం విశేషం. ఇదిలా ఉండగా లుకేమియాతో బాధపడుతూ 2008 జూన్ 24వ తేదీన హైదరాబాదులో మరణించారు. మరణానికి పలువురు మాజీ సీ.ఎంలు రాజశేఖరరెడ్డి, చంద్రబాబు సంతాపం కూడా తెలిపారు.



రజనీకాంత్ పై ఫైర్ అయిన కస్తూరి శంకర్ !

టాలీవుడ్ లో కొత్త భామల సందడి..!

పి.వి నరసింహారావుకు విద్యార్థి దశలోనే పోరాట స్ఫూర్తి..!

అమెజాన్ లో నారప్ప..రిలీజ్ డేట్ ఫిక్స్.. !

9 ఏళ్ల నిరీక్షణ.. సైడ్ రోల్స్ టూ లీడ్ రోల్.. జాతి'రత్నం' అనిపించుకున్న యువ హీరో..!

స్టార్ హీరోల ఫ్యాన్స్ కు ఇక పండుగే..!

బిఎండబ్ల్యూకి పోటీగా అంబాసిడర్.. వివరాలు..

టాలీవుడ్ లో కొడితే రీ సౌండ్ బాలీవుడ్ లో రావాల్సిందే..!

ప్రభాస్ తో సాహో అన్నాడు.. చిరు ఛాన్స్ కాదనుకున్నాడు.. సుజిత్ కనబడుట లేదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>